ఇంధన కొరతతో ప్రజల ఇబ్బందుల నడుమ ప్రధాని జాతీయ ప్రసంగం… “మీ వంతు కర్తవ్యం నిర్వర్తించండి” అంటూ పిలుపు…

అరుదుగా జరిగే జాతీయ ప్రసంగం ద్వారా నేడు ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీసీ ఆస్ట్రేలియన్లను మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన కొరతలను ఎదుర్కోవడంలో తమ వంతు సహాయం చేయమని కోరారు.

A close up shot of Anthony albanese in a black suit

The prime minister has delivered an address to the nation, calling for Australians to 'help each other' as petrol and diesel prices spike. Source: AAP / Mick Tsikas

మూడు నిమిషాల పాటు చేసిన ప్రసంగం ముందుగా రికార్డ్ చేసి బుధవారం సాయంత్రం 7 గంటలకు దేశవ్యాప్తంగా ప్రసారం చేయబడింది. హార్ముజ్ జలసంధి నుండి రాకపోకలు నిలిపివేయడమే కాకుండా, స్థానిక స్థాయిలో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం కూడా ఉంది.

Watch the prime minister's address:

ప్రధాన మంత్రి గ్లోబల్ ఇంధన సరఫరా చైన్ లో ఏర్పడిన సంక్షోభాన్ని “క్రైసిస్” అని పేర్కొనలేదు. దీని కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి, మరియు కొంతమంది ప్రజలు ప్యానిక్ బయ్యింగ్ కారణంగా ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారు.

ప్రసంగంలో, “మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. ఆస్ట్రేలియా యుద్ధంలో పాల్గొనడం లేదు. అయినప్పటికీ, ఆస్ట్రేలియన్లు పెరిగిన ధరల కారణంగా ఎక్కువ ఖర్చు చెల్లిస్తున్నారు,” అని పేర్కొన్నారు.

ప్రసంగంలో కొత్త నిర్ణయాలు చర్చించలేదు; కేవలం గత కొన్ని రోజులలో ప్రకటించిన విషయాలను పునరుద్ఘటించారు.. వీటిలో జాతీయ ఇంధన భద్రతా ప్రణాళిక, మూడు నెలల పాటు లీటర్‌కు 26.3 సెంట్ల ఇంధన ధరల తగ్గింపు, మరియు భారీ వాహనాల రోడ్డు వినియోగ చార్జ్ లో కోత ఉన్నాయి.

ఆల్బనీసీ ఆస్ట్రేలియన్లను ఈ ఈస్టర్ సెలవుల సమయంలో ఇంధనాన్ని పొదుపుగా వాడి, “తమ వంతు సహాయం చేయండి” అంటూ సూచించారు. ఆయన మాట్లాడుతూ, “అవసరానికి మించి ఇంధనం కొనకండి. సాధారణంగా పెట్రోల్ ఎంత వాడతారో అంతే ఉపయోగించండి. మీ తోటి వారి గురించి ఆలోచించండి. కొన్నిరోజుల్లో ట్రైన్, బస్ లేదా ట్రామ్ ద్వారా పనికి వెళ్ళగలిగితే దానిని ఉపయోగించండి,” అన్నారు.

ఆర్థిక భారం కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని ఆయన అంగీకరించారు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారాలు మరియు కుటుంబాలు కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు.

చివరగా, 2020లో COVID-19 సమయంలో మాజీ ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రసంగించారు. 2009లో మాజీ ప్రధాన మంత్రి కెవిన్ రడ్ స్టోలన్ జనరేషన్స్ కి క్షమాపణ తెలిపారు. 2003లో జాన్ హోవార్డ్ ఇరాక్ యుద్ధంలో ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని ప్రకటించారు.

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా నాలుగు దశల జాతీయ ఇంధన ప్రతిస్పందన ప్రణాళికలో రెండవ దశలో ఉంది. సరఫరా స్థాయిలు సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం నిర్ధారిస్తోంది, అయితే డిమాండ్ పెరగడం కారణంగా ధరలు పెరుగుతున్నాయి.

గురువారం నేషనల్ ప్రెస్ క్లబ్ లో ఆస్ట్రేలియా పరిస్థితి మరియు రిసెషన్ అవకాశం గురించి ప్రధాని ప్రస్తావించనున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


2 min read

Published

Updated

By Ewa Staszewska

Presented by Sandya Veduri

Source: SBS




Share this with family and friends


Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now