Explainer

పని గంటల్లో మార్పుల వల్ల అష్ట కష్టాలు పడుతున్న విద్యార్థులు

అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలపై ఆంక్షలు ఈ నెల నుండి అమల్లోకి వస్తాయి. అయితే, విద్యార్థి న్యాయవాదులు ఆస్ట్రేలియా అద్దె సంక్షోభం సమయంలో, ఆదాయాన్ని తగ్గించడం వల్ల కొంతమందికి ప్రాథమిక అవసరాలకు కూడా కష్టమవుతుంది అని అంటున్నారు.

'Priyanka' - not her real name - is struggling with housing stress (AAP).jpg
Key Points
  • అంతర్జాతీయ విద్యార్థులు 15 రోజులకు 48 గంటల మాత్రమే పని చేయవచ్చును.
  • ద్రవ్యోల్బణం వల్ల పెరుగుతున్న అద్దెలు మరియు నిత్యావసర ఖర్చులు.
ఇలా కష్టపడుతున్న వారిలో ప్రియాంక ఒకరు - (అసలు పేరు మార్చబడింది). ప్రియాంక’ మెల్‌బోర్న్‌లో నివసించే ఇండియానుంచి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని.ఈ మధ్య పెరిగిన అద్దెలు కారణం గా ఆమె ఇప్పుడు తెలియని వారితో "బెడ్" షేర్ చేసుకోవాల్సి వస్తుంది.

అంటే ఆమె ఒక షేర్డ్ హౌస్‌లో ఒక అపరిచితుడితో కలిసి అద్దెకు తీసుకుంటుంది - మరియు వారు వేర్వేరు సమయాల్లో అక్కడ ఉంటున్నారు. ఆమె మాట్లాడుతూ, ఇంకో అబ్బాయి రాత్రుళ్ళు పని చేయడం వలన ఆమె రాత్రి పూట రూమ్ లో ఉంటూ ఉదయాన్నే అయన వచ్చే సమయానికి ఖాళీ చేయాల్సి వస్తుంది అట.

నెలవారీ అద్దె $550 ని, ఇద్దరు పంచుకొని కడుతున్నామని తాను చెప్పుకొచ్చింది. కొన్ని సార్లు, ఆ అబ్బాయి కి పని లేనపుడు తను రూమ్ లో పడుకోవడానికి కుదరదు అని చెప్పి బాధపడింది.

ప్రియాంక 2022 లో చదువుకోవడానికి మెల్బోర్న్ వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక వారే హౌస్ లో casual షిఫ్ట్‌లలో పని చేస్తోంది. పని గంటలను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అందరి విద్యార్దుల్లగానే పాటు, ఆమె పై కూడా ఆ భారం పడింది. ఆస్ట్రేలియాలో ఇలాంటి చదువు ని తాను ఊహించ లేదని చెప్పింది.

మెల్‌బోర్న్‌లో, ఇప్పుడు 2 bedroom అపార్ట్‌మెంట్ సగటు అద్దె నెలకు 18-వందల డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. సిడ్నీలో, అయితే నెలకు 2500 డాలర్లు , కనీసం 36 శాతం ఎక్కువ. ఆస్ట్రేలియాలో తన చదువుకు ఖర్చుపెట్టేందుకు, తన తల్లితండ్రులు చాలా కష్టపడి, అప్పు చేసి , ఖర్చులు తగ్గించుకొని ఇక్కడకు పంపారని , అందుకే తన పరిస్థితి గురించి ఇంటి దగ్గర చెప్పలేనని తాను బాధపడింది.

ప్రియాంక చాలా నెలలుగా 'బెడ్'ని షేర్ చేస్తూ ఉండటం వల్ల తన మానసిక ఆరోగ్యాన్ని పై ప్రభావం పడుతుందని చెప్పింది.టర్నేషనల్ స్టూడెంట్ ఎంప్లాయబిలిటీ కోసం విక్టోరియన్ వర్కింగ్ గ్రూప్ అయిన VicWise ప్రెసిడెంట్ మనోరాణి గై నుండి ప్రియాంక సలహా కోరింది.

Ms గై అంతర్జాతీయ విద్యార్థులు పడుతున్న కష్టాలు గురించి, అంటే ఆదాయాలు తగ్గి అధిక అద్దెలు చెల్లించలేనివారి గురించి ఆందోళన చెందుతున్నారు. జూలై మొదటి నుండి, అంతర్జాతీయ విద్యార్థులు 15 రోజులకు 48 గంటల మాత్రమే పని చేయవచ్చును. COVID-19 సమయంలో ఉద్యోగుల కొరతను పరిష్కరించడానికి వర్క్ క్యాప్స్ తాత్కాలికంగా తీసివేశారు.

Home Affairs Minister క్లేర్ ఓ'నీల్ మాట్లాడుతూ, పని గంటలు పునరుద్ధరించడం వల్ల విద్యార్థులు తమ చదువులకు తగినంత సమయం కేటాయించడంతో పాటు తమను తాము పోషించుకోగలుగుతారని అంటున్నారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా యొక్క CEO ఫిల్ హనీవుడ్ దీనిని మద్దతిస్తున్నారు - అయితే మరింత సరసమైన ధరలకు విద్యార్థులకు ఇల్లు అవసరమని చెప్పారు.

అయినప్పటికీ, Ms గై ఇప్పుడు పెరుగుతున్న ధరలతో పాటు , పని పరిమితులు ఇంత త్వరగా తగ్గించడం వల్ల చాలా మంది విద్యార్థులు క్యాష్ ఇచ్చే పనులు తీసుకుంటారని చెప్పారు, తద్వారా వారు దోపిడీకి గురవుతారు అని భయపడుతున్నారు.ప్రియాంక మంచి ఉద్యోగం వెతుక్కోవాలని మరియు తన పరిస్థితి ని కొంచెం చక్కబడేలా చూసుకోవాలని అంటుంది .ఆస్ట్రేలియా లో ఖర్చులు ఇంత ఎక్కువగా ఉంటాయని ముందుగా తెలుసున్నట్లైతే తాను ఇక్కడ చదువుకోడానికి రాకపోదునని చెప్పింది.

మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, 1300 22 4636 లో Beyond Blue లేదా 13 11 14 వద్ద లైఫ్‌లైన్ వంటి ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. మీరు మీ కోసం లేదా మీరు స్నేహితుల తరుపున కాల్ చేయవచ్చు.

మీరు ఇంగ్లీష్ కాకుండా వేరే భాషలో చాట్ చేయాలనుకుంటే, 13 14 50కి ట్రాన్స్‌లేటింగ్ మరియు ఇంటర్‌ప్రెటింగ్ సర్వీస్‌కు కాల్ చేసి, Beyond Blue లేదా లైఫ్‌లైన్‌తో కనెక్ట్ అవ్వమని అడగండి.

ఈ ఆర్టికల్ ని పోడ్కాస్ట్ లో కూడా వినవచ్చును.
SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.

Share

Published

By Sandra Fulloon
Presented by Sandya Veduri
Source: SBS

Share this with family and friends


Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
పని గంటల్లో మార్పుల వల్ల అష్ట కష్టాలు పడుతున్న విద్యార్థులు | SBS Telugu