Explainer

మీ అర్హతలను ఇక్కడ ఆస్ట్రేలియా లో గుర్తిస్తున్నారా?

ఆస్ట్రేలియా లోని నైపుణ్య కొరత సమస్యకు వలసదారులు మరియు శరణార్థుల యొక్క ప్రతిభ వారి సామర్ధ్యాన్ని పూర్తి మేరకు వినియోగించుకోవట్లేదని ఒక నివేదిక వెల్లడించింది.

Former United Nations HIV Program Specialist Dr Mohammad Zubair Harooni (Supplied).jpg
సెటిల్మెంట్ సేర్విసెస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సమర్పించించిన ఈ నివేదిక ప్రకారం వలస కార్మికుల యొక్క నైపుణ్యాన్ని సరియైన విధంగా వినియోగించుకుంటే ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్థ వందల కోట్ల డాలర్లు పెంచుకోవచ్చని అని పేర్కొంది.

గత ఏప్రిల్ నెల లో కాన్బెర్రా లోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో , Home Affairs Minister Claire O'Neil ముఖ్యంగా వలసబాటు ని ఉద్దేశించి ప్రసంగించారు. "మన వలస వ్యవస్థ ఒక దశాబ్దం గా చాలా నిర్లక్ష్యానికి గురైయ్యింది అన్నారు. "

Settlement Services International నివేదిక ప్రకారం ఊహించిన ఫలితాలు సాధిచడం అంత సులభం కాదని, వలస కార్మికులు మరియు శరణార్థులు ఆస్ట్రేలియా స్థానిన ఉద్యోగ వ్యవస్థ లోని అడుగుపెట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని తేలింది.

Dr Mohammad Zubair Harooni అనే ఒక శరణార్ధుని అనుభవం మేరకు, ఆఫ్ఘనిస్థాన్ వైద్య వ్యవస్థ మరియు యునైటెడ్ నేషన్స్ HIV ప్రోగ్రాం స్పెషలిస్ట్ గా దాదాపు15 ఏళ్ళ అనుభవం ఉన్నపటికీ ఆస్ట్రేలియా ఆరోగ్య రంగంలో స్థానం సంపాదించుకోలేక పోయారని ఆశ్చర్యపోయారు.

ఈ సమస్య ఇతర రంగాలకు కూడా వర్తిస్తున్నదని, ఉదాహరణ కు ఇంజినీరింగ్ విభాగం లో ఆస్ట్రేలియా లో 30,000 పైగా స్థానాలు ఖాళీగా ఉన్నకాని, ఇంజినీరింగ్ నిపుణ్యంతో వలస వచ్చిన కార్మికుల్లో దాదాపు సగం మందికి పైగా నిరుద్యోగుల్లా ఉంటూ , వేరే రంగాల్లో వారి ప్రజ్ఞకి లోబడి పనిచేస్తున్నారని తేలింది.

వీరి ప్రజ్ఞ పాటవాలకు ఉద్యోగ అవకాశాల రాకపోవడాన్ని వివిధ కారణాలు ఉన్నాయని Violet Roumeliotis , Settlement Services International CEO పేర్కొన్నారు.

"వలస కార్మికులు మరియు శరణార్థులు ఇంగ్లీష్ బాషా ప్రావిణ్యం , సాంస్కృతిక మరియు సామాజిక దృక్పధ లోపాలు, అసంకిల్పీత వివక్ష వంటివి ముఖాయ అడ్డంకులు గా భవించినప్పటికీ వాటి లో నిజం లేదని ఆవిడ పేర్కొన్నారు. " కానీ నివేదిక లో కొన్ని సిస్టమాటిక్ సమస్యలు ఉన్నట్టు గా కూడా గుర్తించింది.

ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందుతున్న వారిలో 57 శాతం మందికి పని చేయడానికి అనుమతి లేదు. తాత్కాలిక వీసాలపై దాదాపు మూడింట రెండొంతుల మంది కార్మికులు కనీస ప్రమాణం కంటే తక్కువ వేతనం పొందుతున్నారు. మరియు శాశ్వతంగా వచ్చిన వారిలో కేవలం 33 శాతం మంది మాత్రమే వారి పోస్ట్-స్కూల్ అర్హతలను ఆస్ట్రేలియాలో గుర్తించారు. సెటిల్‌మెంట్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ వారు దీన్ని దోపిడీ మరియు తక్కువ ఉపాధి కోసం చేస్తున్న నాటకం అంటున్నారు.

డాక్టర్ హరూనీ అర్హతలు ఇప్పుడు గుర్తించారు, అయితే దీని కోసం అందరిలాగే అయన కూడా చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన వలసదారులు మరియు శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఫెడరల్ ప్రభుత్వానికి ఇప్పటికే బాగా తెలుసు.

క్లైర్ ఓ'నీల్ మాట్లాడుతూ ఇలాంటి అవకతవకలను తప్పకుండా మారుస్తామని మంత్రి చెప్పారు .
Final Migration Strategy ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది. ఇది వీసాలు మరియు పని పరిస్థితులు, అలాగే అర్హతల గుర్తింపు గురించి దీర్ఘకాలంగా ఉన్న ఆందోళనలను పరిష్కరిస్తుందని అన్నారు. ఇంతలో, డాక్టర్ హరోనీ మాట్లాడుతూ, తను ఎప్పుడూ ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తూ నే ఉన్నారని చెప్పారు.

ఈ ఆర్టికల్ ని పోడ్కాస్ట్ ద్వారా కూడా వినవచ్చును.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.

Share

Published

Updated

By Deborah Groarke
Presented by Sandya Veduri
Source: SBS

Share this with family and friends


Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service