SBS Spice దక్షిణాసియా ఆస్ట్రేలియన్ల యువత కోసం ప్రారంభించిన ఆంగ్ల కార్యక్రమం. చక్కని పాటలతో ప్రస్తుత ఆస్ట్రేలియన్ అభిరుచులకు అనుగుణంగా దక్షిణాసియా కథనాలను ప్రచురిస్తూ, SBS Spice అందరిని ఆకర్షించనుంది. 20 నుండి 34 సంవత్సరాల వయస్సు గల యువతకు నచ్చే విషయాలు పై ఈ కార్యక్రమం ఉంటుంది.

SBS Spice సోషల్ మీడియాలో చురుకుగా ఉండే వారికోసమే. మన సంస్కృతిని మన ఉనికిని చాటి చెప్పేలా ఆసక్తికర విషయాలు ఉంటాయని " SBS స్పైస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డిల్ప్రీత్ కౌర్ తగ్గర్ అన్నారు. ఆమె పాత్రికేయురాలిగా , సౌత్ ఆసియన్ టుడే వ్యవస్థాపకురాలిగా పనిచేసారు.
SBS Spice ను డిల్ప్రీత్ మరియు ఇండో-ఫిజియన్ పాత్రికేయురాలైన సుహల్య షరీఫ్ హోస్ట్ చేస్తున్నారు. వారు ఇప్పటికే ఇస్టాగ్రమ్ మరియు యూట్యూబ్ లలో పలు శీర్షికలను విడుదల చేసారు. SBS Spiceను SBS ఆడియో యాప్, వెబ్‌సైట్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ ల ద్వారా వినవచ్చును.
