ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31 న కొంతమంది మరియు నవంబర్ 1న కొంతమంది జరుపుకుంటున్నారు.దీపాల పండుగ అని పిలిచే ఈ పండుగను , సాధారణంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది.
ఆస్ట్రేలియాలో, 10 లక్షల కంటే ఎక్కువ మంది హిందువులు, జైనులు, బౌద్ధులు మరియు సిక్కులు ఉన్నారు. వారి సంస్కృతికి అనుగుణంగా వివిధ రకాల పండుగలను జరుపుకుంటారు. కొంతమంది ఈ దీపావళిని తీహార్ మరియు బందీ చోర్ దివాస్ అని కూడా పిలుస్తారు.
చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక.మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించే పండుగ ఇది.
డాక్టర్ జయంత్ బాబత్ మెల్బోర్న్ మోనాష్ యూనివర్సిటీలో హిందూ పూజారి మరియు సామాజిక శాస్త్రవేత్త గా పనిచేస్తున్నారు. అయన దీపావళి అంటే అర్ధాన్ని వివరిస్తూ -దీపావళి అనేది సంస్కృతం నుండి ఉద్భవించిన పదమని అన్నారు.
దీపం అంటే దీపం మరియు ఆవళి అంటే వరుస. దీపావళికి అర్థం దీపాల వరుస.Dr Jayant Bapat, a Hindu priest and researcher in sociology at Monash University in Melbourne
భారత ఉపఖండం అంతటా జరుపుకునే ఈ పండుగ, వారి ప్రాంతంలోని సంప్రదాయాలను బట్టి వేడుకలు మారుతూ ఉంటాయి.ప్రతి సంవత్సరం, దీపావళి అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో అశ్విని మరియు కార్తీక హిందూ చాంద్రమాన నెలలలో జరుపుకుంటారు.

సాంప్రదాయకంగా దియాస్ అని పిలువబడే మట్టి దీపాలను వెలిగిస్తూ, పిల్లలు పెద్దలు కాకరపోవ్వోతులు వెలిగిస్తారు.అసలు ముగ్గుల లేకుండా పండుగ లేనే లేదు, ముచ్చటగా ముగ్గును ఇంటి ముందు పెట్టి దీపాలతో అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశానికి చెందినవారు ఈ ముగ్గులను రంగోలి అంటారు. హిందూ దేవత లక్ష్మిని ఆహ్వానిస్తూ , అదృష్టాన్ని తీసుకువచ్చేలా ఉదయాన్నే అందమైన ముగ్గులను వేస్తారు.
ఈ సమయంలో కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇరుగుపొరుగు వారు మిఠాయిలు మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి కలుసుకుంటారు.ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే ఆశతో దీపాలు వెలిగించే ముందు ఇళ్లను శుభ్రం చేస్తారు. కొన్ని కుటుంబాలు తమ ఇంటికి సున్నాన్ని వేసి మరీ ఈ పండుగను చేస్తారు.

ఆస్ట్రేలియాలో దీపావళి ఎలా చేసుకుంటారు?
ఆస్ట్రేలియాలో భారతీయుల వలసదారుల సంఖ్య పెరుగుతోంది. దీని కారణంగా రాజధాని నగరాలు మరియు అనేక ప్రాంతీయ కేంద్రాలలో దీపావళి వేడుకలు జారుతున్నాయి. మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్ అయిన తారా రాజ్‌కుమార్ OAM, మాట్లాడుతూ అంతకుమునుపు తో పోలిస్తే దీపావళి వేడుకలు ఇప్పుడు బాగా చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వ్యాప్తంగా దీపావళి పండుగ జరుగుతుంది . మెల్బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్ నుండి విమానాశ్రయాల వరకు, పండుగ వాతావరణం చూడవచ్చు.Tara Rajkumar
"దీపావళిలో ముఖ్యమైన భాగం వెలుగు ద్వారా అజ్ఞానం తొలగిపోయినప్పుడు వచ్చే పరివర్తన" అని తారా రాజ్‌కుమార్ అన్నారు.
దీపావళి నానుడి కథల
హిందువులు సాధారణంగా దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఇది ధనత్రయోదశి లేదా ధంతేరాస్‌తో ప్రారంభమయ్యి , అంటే బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడానికి శుభప్రదంగా పరిగణించే రోజుతో మొదలుపెడతారు.
"ప్రజలు ఈ రోజున పిల్లలకు బహుమతులు కొంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరిస్తారు, ఇళ్ళు శుభ్రం చేస్తారు, ప్రజలు బంగారం మరియు వెండిని కొనుగోలు చేస్తారు. ఇది లక్ష్మీ దేవిని పూజించే రోజు" అని డాక్టర్ బాబాట్ చెప్పారు.

రెండవ రోజును చతుర్దశి అని పిలుస్తారు, దీనిపై వివిధ పురాణాలలో కథలుగా చెప్పుకునే సంధర్భాలు ఉన్నాయి. "ఈ కథలలో ఒకటి.. ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు కృష్ణుడి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు" అని డాక్టర్ బాబత్ చెప్పారు.మరియు ఈ రోజున చాలా మంది ప్రజలు తమ తలుపులు తెరిచి ఉంచడం ద్వారా మరియు వారి ఇళ్ల ముందు లైట్లు వేయడం ద్వారా లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారని , డాక్టర్ బాబాట్ చెప్పారు. మూడవ రోజు లక్ష్మీ పూజ అని, ఐశ్యర్యం కోసం ఆరాదించేందుకు అత్యంత ప్రీతి పాత్రమైన రోజుగా పరిగణిస్తారు. "ఉదాహరణకు, ఈ రోజున, వ్యాపారవేత్తలు వారి ఖాతా పుస్తకాలు మరియు డబ్బును పూజిస్తారు" అని డాక్టర్ బబ్బట్ వివరించారు.
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ఈ రోజు శ్రీరాముడు, అతని భార్య సీతాదేవి మరియు సోదరుడు లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత వారి స్వస్థలమైన అయోధ్యకు తిరిగి వచ్చినందుకు చేసుకునే పండుగ అనికూడా అంటుంటారు. నాల్గవ రోజు, గోవర్ధన్ పూజ, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పూజిస్తారు."పురాణాల ప్రకారం, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక వేలుపై ఎత్తి, ప్రకృతి రౌద్రం నుండి ప్రజలను రక్షించాడు అని చెబుతుంటారు. ఈ రోజు కృష్ణుడు ఇంద్రుడిని ఓడించినందుకు జరుపుకునే పండుగ."
చివరి రోజు భాయ్ దూజ్, తోబుట్టువుల వేడుకని , సోదరీమణులు వారి ప్రేమ బంధాన్ని గౌరవించటానికి.. సోదరుడి నుదిటిపై ఎరుపు బొట్టును పెడతారు. భారతదేశంలో ఉండే భిన్న సంస్కృతుల వారు వారి సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకునే ఐదు రోజుల పండుగ ఈ దీపావళి. "ఉదాహరణకు, లక్ష్మి సంపదకు చిహ్నం, కానీ బెంగాల్‌లో వారు కాళికా దేవిని పూజిస్తారు, లక్ష్మిని కాదు. గుజరాత్‌లో విష్ణువుతో పాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. కొన్ని చోట్ల పిల్లలు మట్టితో కోటలు నిర్మిస్తారు" అని డాక్టర్ బాబాట్ వివరించారు.

నేపాల్‌లో తీహార్ వేడుకలు
నేపాలీ దీపావళిని తీహార్ అంటారు.ఐదు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో కాకులు, కుక్కలు మరియు ఆవులు వంటి జంతువులను పూజిస్తారు. మొదటి రోజుని యమపంచక్ లేదా "కాగ్ తీహార్" అంటారు. కాకులకు పూజ చేస్తారు . తమ ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కాకులు సహకరిస్తాయి కాబట్టి వాటికీ పూజ చేస్తారు. రెండవ రోజును "కుకుర్ తీహార్" అంటారు. కుక్కలకు పూజ చేస్తారు , అవి చూపించే విధేయతకి గౌరవమిస్తూ చేస్తారు. ఆ రోజున కుక్కలకు స్నానం చేయించి, పూజించి, రుచికరమైన ఆహారాన్ని పెడతారు."గై తిహార్", సాధారణంగా మూడవ రోజున చేసేది, ఆవులకు చేసే పూజ , ఇది పవిత్రంగా మాతృత్వానికి చిహ్నంగా చేస్తారు..

నాల్గవ రోజు, సాధారణంగా "గోరు తిహార్" అని పిలుస్తారు, రైతులకు వ్యవసాయంలో తోడుగా ఉండే ఎద్దులకు పూజ చేస్తారు. అదే రోజున, ఖాట్మండు లోయ మరియు పరిసర ప్రాంతాలలోని నెవార్ ప్రజలు "మ్హా పూజ"ను జరుపుకుంటారు, అంటే "స్వీయ ఆరాధన".చివరి రోజును "భాయ్ టికా" అంటారు. ఇది తోబుట్టువుల పండగ. చెల్లెల్లు నూనె మరియు నీటితో వారి చుట్టూ తిరుగుతూ మృత్యు దేవుడైన యముడు నుండి వారిని రక్షించమని కోరుకుంటారు.
బంది చోర్ దివస్
బందీ చోర్ దివాస్ అనేది "సిక్కుల దీపావళి" పండుగని ఆస్ట్రేలియా సిక్కు కమ్యూనిటీకి పండుగ కోఆర్డినేటర్ గురీందర్ కౌర్ వివరించారు. వారు పొందిన స్వాతంత్ర్యానికి గుర్తుగా "ఇండిపెండెన్స్ సెలబ్రేషన్" అని కూడా పిలుస్తారని, ఇది 17వ శతాబ్దంలో గ్వాలియర్ జైలు నుండి ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్ విడుదలైన జ్ఞాపకార్థంగా చేసుకుంటారు అని చెప్పారు. ఆయనతో పాటు ఖైదు చేయబడిన 52 మందిని విడుదల చేయవలసిందిగా అప్పటి మొఘల్ చక్రవర్తి జహంగీర్‌ను అభ్యర్థించాడు. అందరూ గురు హరగోవింద్ కవచాన్ని పట్టుకోగలిగితే విడుదల చేయడానికి చక్రవర్తి అంగీకరించాడు.
బంది అంటే 'ఖైదీ' మరియు చోర్ అంటే 'విడుదల'. ఆనాటి ప్రధాన సందేశం ఏమిటంటే, గురువు తన కోసం మాత్రమే కాకుండా ఇతరుల మానవ హక్కుల కోసం కూడా పోరాడారు.Gurinder Kaur
ఆస్ట్రేలియాలోని సిక్కులు బందీ చోర్ దివస్‌ను తమ సమీప గురుద్వారాలో మరియు ఇళ్లల్లో జరుపుకుంటారు."సిక్కుల గురువు ఆశీర్వాదం పొందిన రోజున, వారు గురుద్వారాలో కొన్ని కొవ్వొత్తులను వెలిగించి, మిఠాయిలు పంచిపెడతారు " అని కౌర్ చెప్పారు.

"ఇంట్లో, బహుమతులు మరియు మిఠాయిలు పంచుకుంటారని మరియు టపాసులు సురక్షితంగా వెలిగిస్తారు" అని కౌర్ అన్నారు.దీపావళి, బంది చోర్ దివాస్ మరియు తీహార్ గురించి మరింత తెలుసుకోవడానికి,sbs.com.au/Diwali సందర్శించండి.

