తాజాగా విడుదలైన ఫలితాలను పరిశీలిస్తే, "ఆస్ట్రేలియా విద్యార్థులలో మూడో వంతు (One-third) మంది చదవడం, రాయడం మరియు లెక్కలు వంటి విభాగాల్లో తమ వయసు, తరగతి స్థాయికి అవసరమైన కనీస విద్యా ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు,’’ అని తేలింది.
పరీక్షలు రాసిన 12 లక్షల మంది విద్యార్థులలో దాదాపు 33.5 శాతం మంది ఆశించిన స్థాయి కంటే వెనుకబడి ఉన్నారని ఆస్ట్రేలియన్ కరికులం, అసెస్‌మెంట్ అండ్ రిపోర్టింగ్ అథారిటీ (ACARA) స్పష్టం చేసింది. మొత్తం విద్యార్థులలో 10శాతం మంది తీవ్రంగా వెనుకబడి ఉన్నారని, వారికి తక్షణమే ప్రత్యేక శిక్షణ అవసరమని నివేదికలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు మూడురెట్లు వెనకబడి ఉన్నారు. అదేవిధంగా, విద్యావంతులైన తల్లితండ్రులు గల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






