మీరు చదువుతున్నారా? అయితే ఈ ప్రభుత్వ రుణాల గురించి తప్పక తెలుసుకోండి!

Are you eligible for the Higher Education Loan Program?

Are you eligible for the Higher Education Loan Program? Credit: E+

దాదాపు మూడు మిలియన్ల ఆస్ట్రేలియన్లు HELP, (హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ ప్రోగ్రామ్) ద్వారా ప్రభుత్వ రుణ ఉపాధిని పొందుతున్నారు.. మీరు ఉద్యోగం పొందే వరకు మీ ట్యూషన్ ఫీజును వాయిదా వేయవచ్చు.


Key Points
  • మీకు ఉద్యోగం దొరికే వరకు హెల్ప్ లోన్ మీ కోర్సు ఫీజులను వాయిదా వేస్తుంది.
  • అలాగే మీ సంవత్సర ఆదాయం $51,550 కి చేరుకునే వరకు మీరు మీ రుణాన్ని చెల్లించనవసరం లేదు
  • అర్హత పొందడానికి మీరు తప్పనిసరిగా ఆస్ట్రేలియన్ పౌరుడై ఉండాలి లేదా నిర్దిష్ట అర్హత కలిగిన వీసా కలిగి ఉండాలి
  • చెల్లించని అప్పులు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కు అనుగుణంగా పెరుగుతాయి
ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నప్పుడే, మీరు ఫీజులు కట్టాల్సి వస్తుంది.

స్థోమత ఉన్నవారు ఫరవాలేదు కానీ , మిగతావారు చాలామంది ట్యూషన్ ఫీజులను కట్టడానికి ప్రభుత్వ రుణాలను ఆశ్రయిస్తారు. ఈ ప్రభుత్వ రుణ కార్యక్రమాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ ప్రోగ్రామ్ లేదా HELP అంటారు.

మీరు ఎలాంటి HELP రుణాలు తీసుకోవచ్చంటే?

HELP ద్వారా మీరు ఐదు రకాల పథకాలను తీసుకోవచ్చు. వీటిలో HECS-HELP మరియు FEE-HELP అందరూ వినియోగించుకొనేవి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి స్టెఫానీ స్టాక్‌వెల్ ప్రకారం, HECS-HELP లోన్‌కు అర్హత పొందాలంటే, మీరు తప్పనిసరిగా కామన్వెల్త్ సపోర్టెడ్ ప్లేస్ (CSP)లో నమోదు చేయబడాలని చెప్పారు.
CSP అంటే ఒక విద్యార్థి యూనివర్సిటీలో నమోదు చేసుకున్నపుడు , ప్రభుత్వం నేరుగా యూనివర్సిటీకి సబ్సిడీని చెల్లిస్తుంది. కాబట్టి విద్యార్థికి మొత్తం కోర్సు ఖర్చు తగ్గుతుంది.
Stephanie Stockwell, Department of Education spokesperson
"అయినప్పటికీ, విద్యార్థి ఇతర ఖర్చుల కోసం , హెల్ప్ లోన్ అవసరమని " ఆమె చెప్పారు .
మరోవైపు, మీరు పూర్తి ఫీజ్ చెల్లించాలంటే, FEE-HELPని ఉపయోగించవచ్చు. ఇది ఆస్ట్రేలియాలోని సబ్సిడీ లేని వ్యవస్థ.మీరు ఎంచుకున్న విశ్వవిద్యాలయాన్ని బట్టి ఎటువంటి రుణానికి అర్హులో నిర్ణయిస్తారు.

HECS-HELP మరియు FEE-HELP రుణాలు కోర్సు ఫీజులను కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగించబడతాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.
How is your HELP debt calculated?
How is your HELP debt calculated? Source: Getty / Getty Images/Kanawa_Studio

ఈ రుణాలకు మీరు అర్హులా?

  • ఆస్ట్రేలియన్ పౌరుడై ఉండాలి మరియు ఆస్ట్రేలియాలోనే చదువుతూ ఉండాలి.
  • ప్రస్తుతం లేదా అర్హత కలిగిన మాజీ న్యూజిలాండ్ స్పెషల్ కేటగిరీ వీసా కలిగి ఉండాలి. ఆస్ట్రేలియాలో మొత్తం కోర్సును అభ్యసించేవారై ఉండాలి
  • కోర్సు చదివే కాలమంతా ఆస్ట్రేలియాలో నివసించడానికి శాశ్వత లేదా అర్హత కలిగిన మాజీ హ్యుమానిటేరియన్ వీసా హోల్డర్ గా ఉండాలి.
  • పసిఫిక్ ఎంగేజ్‌మెంట్ వీసా హోల్డర్ గా ఉన్నా సరిపోతుంది.
  • బ్రిడ్జింగ్ కోర్సును చేపట్టే విదేశీయులు కూడా నిర్దిష్ట FEE-HELP రుణాన్ని పొందవచ్చు.

HELP ద్వారా మీకు ఎంత డబ్బు వస్తుందంటే?

మీ కోర్సు లో ఉండే సబ్జెక్టుల ప్రకారం డబ్బును విడుదల చేస్తారు. సంవత్సరాల లెక్క వేయరు. మీరు ఎన్ని ఎక్కువ సబ్జెక్టులు తీసుకుంటే, మీ హెల్ప్ రుణం పెరుగుతుంది. బ్రూస్ చాప్‌మన్ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్ మరియు ఈ HECS ప్రోగ్రాంను రూపొందించిన వారు.

అయన దీనిని వివరిస్తూ "డిగ్రీలో నమోదు చేసుకున్నప్పుడు, మొదటి సెమిస్టర్‌లో నాలుగు సబ్జెక్టులు చదవవచ్చు దాని బట్టి నాలుగింటికి డబ్బులను ఇస్తారని", ప్రొఫెసర్ చాప్‌మన్ అన్నారు.

" ఒక సబ్జెక్టుకు సుమారు $500 పడుతుంటే , సంవత్సరం లో 4 సబ్జెక్టులకు $3,000 ఖర్చవుతుంది, కానీ మరుసటి సంవత్సరం మీరు ఒక సబ్జెక్టు తీసుకుంటే, మీ అప్పు కేవలం $500 మాత్రమే మంజూరవుతుంది."
Happy Australian students
Horizontal color image of a small group of Australian university students from different heritages and backgrounds. Credit: funky-data/Getty Images

మీరు రుణాన్ని ఎలా చెల్లించాలంటే?

మీకు ఉపాధి దొరికే వరకు మీ రుణం చెల్లించాల్సిన పని లేదు. మీ యజమాని జీతం నుండి ఆదాయపు పన్నును కట్టినప్పుడు, వారు మీ హెల్ప్ రుణాన్ని చెల్లించడానికి కొంచెం అదనంగా మినహాయిస్తారు. అదికూడా మీ వార్షిక ఆదాయం ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత మాత్రమే జరుగుతుంది.

ప్రస్తుతం, మీ జీతం సంవత్సరానికి $51,550 అయితే, అప్పుడు మీ రుణం ముగిసే వరకు ఆదాయంలో ఒక శాతం పన్ను అదనంగా విధించబడుతుంది.ఈ HELP program విదేశీ విద్యార్థుల రుణాలతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటుందని ప్రొఫెసర్ చాప్‌మన్ చెప్పారు.

"ఒక వేళ మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే, మీరు తిరిగి చెల్లించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ పరిస్థితులు మెరుగుపడిన తరువాతే ప్రభుత్వం చెల్లించమని అడుగుతుందని ఆయన చెప్పారు.

హెల్ప్ రుణం మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి తిరిగి చెల్లించే పద్ధతులు భిన్నంగా ఉంటాయి.ఈ విధంగా, HELP రుణాలు ఇతర బ్యాంకు రుణాలు లాగా నిర్ణీత వ్యవధిలో చెల్లించే విధంగా ఉండవని , ప్రొఫెసర్ చాప్‌మన్ గుర్తుచేశారు.

మీరు ఒక నిర్దిష్ట ఆదాయం చేరుకునే వరకు మీ రుణాన్ని చెల్లించడం ప్రారంభించాల్సిన అవసరం లేనప్పటికీ, మీ రుణం కాలక్రమేణా పెరుగుతుంది."కస్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం రుణానికి వర్తించే ఇండెక్సేషన్ రేటు మారుతుంది" అని స్టెఫానీ స్టాక్‌వెల్ హెచ్చరిస్తున్నారు.

మీరు ఎక్కువ కాలం విదేశాల్లో నివసించాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం మీ రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది. కాకపోతే మీ విదేశీ ఆదాయాన్ని రుజువుగా చూపిస్తే ఆయా హెల్ప్ షరతులు వర్తిస్తాయి.
The University of Sydney
The University of Sydney Source: AAP

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెనీ హింద్‌మార్ష్ ప్రకారం, మీరు మీ కోర్సు వ్యవధిలో ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

“అర్హత కలిగిన విద్యార్థులు వారి విశ్వవిద్యాలయం ద్వారా అందించే HECS-HELP ఫారం ను నింపి సమర్పించవలసి ఉంటుంది. మరియు ఈ ఫారమ్‌లో వారి పన్ను ఫైల్ నంబర్ అది లేకపోతే TFN కోసం అప్లికేషన్ పెట్టె నిర్ధారణ పత్రం ఉన్న సరిపోతుంది., అలాగే వారి ఐడెంటిఫైయర్ నంబర్ వంటివి అవసరం.

దీనిపై మరింత సమాచారం కోసం, Studyassist వెబ్సైటు ను సందర్శించండి.


Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
మీరు చదువుతున్నారా? అయితే ఈ ప్రభుత్వ రుణాల గురించి తప్పక తెలుసుకోండి! | SBS Telugu