Key Points
- బిజినెస్ పార్టీలకు మర్యాద నియమాలు ఖచ్చితంగా అనునయించేలా ఉంటాయి. అలానే , మిగతా సామాజిక సమావేశాలకు కూడా హోస్ట్ లు మరియు అతిథులు ఇద్దరూ సాంస్కృతిక బాధ్యతలను పాటించవలిసి ఉంటుంది.
- ఆస్ట్రేలియాలో, పార్టీ కి వెళ్ళినపుడు కాని , ఒకరి ఇంటిని సందర్శించేటప్పుడు చిన్న బహుమతిని తీసుకువెళ్లడం ఆచారం
- పిల్లల పార్టీలలో ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి , ఇందులో పిల్లలు వెళ్ళేటపుడు చిన్న బహుమతులు ఇచ్చే పద్ధతి ఉంటుంది.
పిల్లల పుట్టినరోజులు, గృహప్రవేశాలు మరియు డిన్నర్ పార్టీలు లాంటివి ఆస్ట్రేలియన్లకు సహజంగా చేసుకుంటూ ఉంటారు.
కానీ మన ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అతిధులను ఆహ్వానించడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు, సెలవు రోజు అయితే సరిపోతుంది.
వారాంతంలో కానీ సెలవు రోజుల్లో కానీ అతిథులను ఆహ్వానించడాన్ని ‘బార్బీ‘ అని పిలుస్తారు.

ఆస్ట్రేలియన్ స్కూల్ ఆఫ్ ఏటికెట్ డైరెక్టర్ జారిఫ్ హార్డీ ప్రకారం, బార్బెక్యూ పార్టీ ఆయితే ఈ రోజుల్లో "నంబర్ వన్ ఛాయస్ " అని అంటున్నారు.ఇది ‘80లు మరియు ‘90లలో ఉండే విందు పార్టీల కన్నా ఇప్పుడు మంచి ప్రాధాన్యతను సంతరించుకుంది.
"ఇందులో సాధారణంగా బయట బార్బెక్యూ ఉండి అందరూ దాని పక్కనే గుమిగూడి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు"
ఇది చక్కగా ఏ బాదరబందీ లేకుండా సునాయాసంగా చేసుకునే పార్టీ "అని హార్డీ చెప్పారు.
క్రిస్మస్ పార్టీ కొంచెం వ్యాపార సంబంధమైన పార్టీ లాంటిదే కాబట్టి మిమ్మల్ని ప్రభావితం చేసే మద్యపాన వినియోగాన్ని గమనించి అదుపులో ఉండాలి. మీ వస్త్రధారణ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి, సూపర్ షార్ట్ డ్రెస్సులు, లేదా తక్కువ-కట్ క్రోక్స్ లేదా చొక్కాలు వేలాడేలా వేసుకోకూడదు .Zarife Hardy
సహోద్యోగులు మరియు మీ యజమానులు పట్ల గౌరవంగా మాట్లాడుతూ , ఈవెంట్ అంతటా వృత్తి నైపుణ్యం గౌరవప్రదంగా సంభాషణలలో పాల్గొనేలా ఉండాలని ఆమె సూచించారు .ఇంటి దగ్గర చేసే పార్టీలో కూడా , హోస్ట్ మరియు అతిథుల దగ్గర మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి.
"మొట్టమొదటిగా, మీరు ఎవరిని ఆహ్వానిస్తున్నారో నిర్ణయించుకోవాలి. ఇందులో బాగా కలిసి ఉండటానికి ఇష్టపడే వారినే ఆహ్వానించాలి " అని హార్డీ సూచిస్తున్నారు.
ఆహ్వానించబడిన ప్రతి వ్యక్తి సౌకర్యవంతంగా ఉండేలా హోస్ట్ కు సన్నాహాలు చేయడం కూడా కీలకం."మీ అతిథులు ఇంటికి వచ్చిన వెంటనే మీరు వారితో సమయాన్ని గడపాలని గుర్తుంచుకోండి , ఇంకా వంటగదిలో పనిచేసుకుంటూ ఉండకూడదు అని ఆమె చెపుతున్నారు
మీరు వారితో మాట్లాడటానికి మునుపే వారికీ పెట్టవలిసినవన్నీ సిద్ధంగా ఉంచుకునేలా చూసుకోండి.Zarife Hardy
మీకు మరీ తెలిసిన మీ కుటుంబంలో వారైతే తప్ప, ఇతరుల ఇంటికి వెళ్తున్నపుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఓవర్ సీస్ స్టూడెంట్స్ ఆస్ట్రేలియా వ్యవస్థాపకుడు మరియు CEO సామ్ శర్మ మాట్లాడుతూ, హోస్ట్ వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు వైన్ బాటిల్, చిరుతిండి లేదా స్వీట్లు వంటి చిన్న బహుమతిని తీసుకువెళ్లడం మర్యాదపూర్వకంగా పరిగణించబడుతుందని చెప్పారు.
వారి పార్టీని ఏర్పాటుచేయడానికి ఏమైనా సహాయం కావాలా అని హోస్ట్ ను అడగడం కూడా మంచి ఆలోచన" వారు పార్టీను హోస్ట్ చేస్తున్నారు కనుక , కొంచెం సహాయం చేయడం మరియు వారికీ కావలిసిన వస్తువులను తేవడం వల్ల వారి పనిని సులభతరం చేయవచ్చు "అని మిస్టర్ శర్మ వివరించారు.

పార్టీలకు ఆలస్యం గా వెళ్లకుండా చూసుకోవాలి. ఆస్ట్రేలియాలో, సమయానికి పార్టీకి చేరుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆలస్యంగా వెళ్ళినపుడు మీరు కొన్ని ఆటలను మరియు మంచి విషయాలను మిస్ అవ్వచ్చు "అని మిస్టర్ శర్మ వివరిస్తున్నారు.
హోస్ట్ కు కొంత సహాయం చేయడం తప్పనిసరి కాదు , కానీ చేస్తే మంచిది.వంట చేయడంలో కాని ఏర్పాటు చేయడంలో కాని , శుభ్రపరచడంలో కాని మీరు హోస్ట్ కు సహాయం చేయగలిగితే, వాళ్ళు మిమల్ని మెచ్చుకుంటారు. మరియు బయలుదేరే ముందు వారికి కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోకండి.
అంతర్జాతీయ విద్యార్థిగా, మిస్టర్ శర్మ 17 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చారు. మొదటి నుండి ఆస్ట్రేలియన్ పార్టీకి సంబంధించిన పరిభాషలను ఇక్కడ వారిని చూసి నేర్చుకున్నారు.
అయన కొన్ని ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుతూ :
- Bubbles = sparkling wine
- BYO = Bring Your Own [drink]
- snag = sausage
- bring a plate = అతిథుల తో పంచుకోవడానికి కొంత ఆహారాన్ని తీసుకురావడానికి ఆహ్వానం
"మీకు ఆహార అలెర్జీలు ఉంటే, ముందుగానే చెప్పడం ముఖ్యమని మిస్టర్ శర్మ చెప్పారు.
"RSVPలో, మీకు ఏవైనా అలెర్జీలు ఉన్నాయా లేదా మీరు శాకాహారా లేదా గ్లూటెన్ రహిత వంటి ఆహారాలను తీసుకుంటారా అన్న విషయాలను మిమ్మల్ని అడగవచ్చు, కాబట్టి వారికి ముందుగానే తెలియజేయండి.
"లేకపోతే, నేను ఏమిచేస్తానంటే నేను శాఖాహారిని కనుక నాకు కావలిసినవి నేనే తీసుకువెళతాను. నేను ఇప్పటి వరకూ చాలా ఈవెంట్ లకు హాజరయ్యాను, కాబట్టి హోస్ట్ కొన్ని సార్లు మరిచిపోయినపుడు బాధపడతారని నాకు తెలుసు "అని మిస్టర్ శర్మ వివరించారు.

చిన్నపిల్లల పార్టీలు
సాధారణంగా, పిల్లల పార్టీలలో ఆహార ఏర్పాట్లను హోస్ట్ మాత్రమే బాధ్యత వహిస్తారు.
మెల్బోర్న్ కు చెందిన సోన్జాహెర్జ్ బర్గ్, వారి ఇద్దరు పిల్లల పార్టీలకు చేసే దాన్నిబట్టి వివరిస్తున్నారు.
"మీరు పిల్లల్ని పార్టీ కి పిలిచినప్పుడు పెద్దలకు ఫుడ్ పెడతారని భావిస్తారు. వారి ఆహారపు అలవాట్లను గురించి ఖచ్చితంగా అడగండి. కాబట్టి, మీరు సాధారణంగా అందరూ తినేలా ఉండే ఆహారాన్ని పెట్టడం మంచిది.

తగినంత మొత్తంలో ఆహారాన్ని ఉంచటం కూడా ముఖ్యం. దీనివలన చివరి లో హైరానా పడనవసరం లేదు. మీకు బడ్జెట్ లో ఉండేలా పిల్లలకు సులువైన ఆహారాన్ని మీరు పెట్టవచ్చు. మీరు ఎలా పెట్టారన్న విషయాన్నీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం చూడలేదని ఆమె చెప్పారు.
"పిల్లలకు "ఫెయిరీ బ్రెడ్" పెట్టవచ్చు. ఇది ఆస్ట్రేలియా సంస్కృతి లో భాగం. లేకపోతే, మీరు ఆస్ట్రేలియన్ పైస్ కూడా పెట్టవచ్చు ,"అని హెర్జ్ బర్గ్ చెప్పారు.
సాధారణంగా పిల్లలకు పార్టీ బ్యాగ్ లను‘ ఇస్తారు. ద్ద పెద్ద ఖరీదైనవి ఇవ్వనక్కర్లేదు కానీ, మన స్థోమతకు తగ్గట్టుగా ఇవ్వచ్చు.

హెర్జ్ బెర్గ్, ఐదేళ్ల కొడుకు పుట్టినరోజు కోసం తాను ఏమి సిద్ధం చేస్తున్నానో వివరిస్తున్నారు.
"మేము చిన్న చిన్న భూతద్దాలు, రంగురంగుల పెన్సిల్స్,ఖాళీ కార్డు మరియు చిన్న స్టిక్కర్లను కొంటూ ఉంటాము."
పిల్లలు చక్కగా ఇంటికి వెళ్లి గుర్తుపెట్టుకునేలాగా, ఆడుకొనేలాగా ఉంటే బాగుంటాయి. అవేకాకుండా, మూడేళ్లకల్లా ఎక్కువ ఉన్నవారైతే, చిన్న చాక్లేట్లు లాంటివి కూడా గిఫ్టుబాగ్ లో పెట్టొచ్చు.Sonja Herzberg
ఇలాంటి వాటికీ బహుమతి విలువ కన్నా వారి గురించి అలోచించి ఇవ్వడమే గుర్తుండిపోతుంది.
పుట్టినరోజు చేసుకునే పిల్లలకు పార్టీలో వచ్చే బహుమతుల కంటే వాళ్ళ స్నేహితులతోనే ఎక్కువ ఆనందంగా గడుపుతారు. వాళ్ళకి బహుమతులు ఇష్టమే కానీ, కొన్ని రోజులకి అవన్నీ మరిచిపోతారు. వారు గుర్తుపెట్టుకునేది ఆ రోజు స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు మాత్రమే.








