SKIP TO MAIN CONTENT

ఏ గూటికి చేరిందో ఈ చిలుక?

B. Saroja Devi.png
B. Saroja Devi, who ruled South Indian cinema for seven decades, passed away at 87..

‘సినిమారంగం కూడా ఓ వ్యాపారమే. ప్రపంచంలోని ఎన్నో వ్యాపారాల్లో ఇది ఒకటి. కాని నమ్మకం...నమ్మకం...నమ్మకం కేవలం నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ది.. వీటి మీద ఆధారపడివున్న వ్యాపారం ఇదొక్కటేనని నా దృఢ విశ్వాసం. కళాకారుల మాట మీద నమ్మకం ఉంచి, ఏడాది, ఏడాదిన్నర తర్వాత డేట్లు పుచ్చుకొని, లక్షలు ఇచ్చిపోయే రంగం మరేదైనా ఉందంటారా? చెప్పండి?’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ కవ్వించి, నవ్వించి మనసులను దోచిన అభినయ సరస్వతి బి. సరోజాదేవిగారు.

Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS

Skip to podcast episode content

‘సినిమారంగం కూడా ఓ వ్యాపారమే. ప్రపంచంలోని ఎన్నో వ్యాపారాల్లో ఇది ఒకటి. కాని నమ్మకం...నమ్మకం...నమ్మకం కేవలం నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ది.. వీటి మీద ఆధారపడివున్న వ్యాపారం ఇదొక్కటేనని నా దృఢ విశ్వాసం. కళాకారుల మాట మీద నమ్మకం ఉంచి, ఏడాది, ఏడాదిన్నర తర్వాత డేట్లు పుచ్చుకొని, లక్షలు ఇచ్చిపోయే రంగం మరేదైనా ఉందంటారా? చెప్పండి?’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ కవ్వించి, నవ్వించి మనసులను దోచిన అభినయ సరస్వతి బి. సరోజాదేవిగారు.

పెద్దయ్యాక సన్యాసినిగా మారి ప్రజలకు సేవ చేయాలనుకున్న ఈ చిన్నది, కళామతల్లి సేవలో ఏడు దశాబ్ధాలపాటు గడిపి, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ ప్రేక్షకులను తన నటనతో మైమరిపించి, ఇక సెలవని తుది వీడ్కోలు పలికారు. ఆత్మగౌరవం కోల్పోవడం కంటే హీనమైన పని మరొకటి లేదని భావించే సరోజాదేవి గారు చివర వరకు సినీపరిశ్రమలో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుని, 87 ఏళ్ల వయసులో సుదీరతీరాలకు పయనమయ్యారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now