Key Points
- De-facto సంబంధంలో ఉన్నవారు నమోదు చేసుకోకపోతే వారి నిబంధనలు, హక్కులు, నమోదు చేసుకున్నవారిలా కాకుండా ,వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.
- de-facto సంబంధం ను నమోదు చేసుకోవడం వలన వారి విడాకుల సంబంధిత అంశాల్లోనూ మరియు జీవిత భాగస్వామి నుండి రావాల్సిన నిధులు వంటి విషయాల్లోను సహాయపడుతుంది.
- కోర్టు ద్వారా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా కూడా వివాదాలను పరిష్కరించుకోవచ్చు.
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవుస్తునట్లైయితే దానిని De - facto సంబంధంగా కుటుంబ చట్టంలో వివరిస్తున్నారు. ఇది నమోదు చేసుకోవాలంటే వారు ఉండే రాష్ట్రం లేదా నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, దక్షిణ ఆస్ట్రేలియాలో de-facto సంబంధాలను Relationship Register Act 2016 ద్వారా నమోదు చేస్తారు.ఇది ఒక్కసారి నమోదు చేసుకుంటే , చట్టరీత్యా అన్ని రాష్ట్రాల్లోనూ గుర్తిస్తారు.

కుటుంబ చట్టంలో నిపుణులైన సిడ్నీ న్యాయవాది నికోల్ ఎవాన్స్ మాట్లాడుతూ , ఈ De-Facto Relationship వైపు అందరూ ఎందుకు మొగ్గు చూపుతున్నారో వివరిస్తున్నారు.
ఇది వీసాలు పొందడానికి మరియు భాగస్వామి మరణించిన సందర్భంలో, కీలక నిర్ణయాలకు మరియు ఇతర వైద్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.
“చట్టపరమైన తల్లిదండ్రుల నిర్ధారణ విషయానికొస్తే , ప్రత్యేకించి స్వలింగ సంపర్కంలో ఉన్న మహిళలకు, de-facto Relationship ను నమోదు చేయడం వలన చట్టరీత్యా తల్లితండ్రులుగా గుర్తిస్తారు. దీని ద్వారా కొన్ని సంక్షేమ ప్రయోజనాలను కూడా పొందొచ్చు.
కోర్టు వారు De-Facto relationship గురించి పరిగణించే అంశాలు
న్యాయస్థానం De-Facto relationship గురించి పరిగణించే అంశాల్లో, మీరు ఎంత కాలం ఈ సంబంధంలో ఉన్నారు, భౌతికంగా కలిసి ఉంటున్నారా మరియు ఉమ్మడి ఆస్తుల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించిన రెండు సాధారణ అపోహలు గురించి ఎవాన్స్ వివరిస్తున్నారు.
చాలా మంది De-facto relationship గా గుర్తించబడాలి అనుకుంటే కనీసం 2 సంత్సరాలు కలిసుండాలి అనుకుంటారు , కానీ అది నిజం కాదు. అలానే ఈ సంబంధంలో ఉన్నవారు , రెండు సంవత్సరాల తర్వాత, అవతలి వ్యక్తి ఆస్తులలో 50%కి అర్హులని చాలా మంది అనుకుంటారు అది కూడా నిజం కాదని వివరిస్తున్నారు.

ఒక వ్యక్తి చట్టబద్ధంగా వేరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ, ఆ జంట లో ఎవరైనా de facto సంబంధంలో ఉండవచ్చు అని చట్టంలో ఉంది.
బ్రిస్బేన్ లో డామియన్ గ్రీర్ కుటుంబ న్యాయవాది, కొన్నిసార్లు వివాహం చేసుకున్న వారు మానస్పర్థలతో విడిపోతారు, కానీ విడాకులు తీసుకోరు. వారిలో ఒకరు ఈ De-Facto సంబంధంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి కేసులు అరుదుగానే వస్తాయంటున్నారు.
చట్ట ప్రకారం వివాహం చేసుకున్న వారిలానే, వీరు విడాకులు తీసుకుంటే, వారి పిల్లల భవిష్యత్తు , పోషణ విషయంలొ వివాదాలు కోర్టు ద్వారా పరిష్కరించబడతాయి.అవే కాకుండా, మధ్యలో ఏ సమయంలోనైనా ఆర్థిక ఒప్పందాన్నికూడా కుదుర్చుకోవచ్చు, అని నికోలే ఎవాన్స్ వివరించారు.
వీరిద్దరూ De-Facto సంబంధం లో ఉన్నపుడు వారు సంపాదించిన ఆస్తులను పరిగణించి, విడిపోయినప్పుడు వారి మధ్య ఆస్తులు మరియు అప్పులను ఎలా విభజించాలో అన్న విషయాన్నీ ఒప్పంద పత్రం నిర్ణయిస్తుంది.బైండింగ్ ఫైనాన్షియల్ అగ్రిమెంట్ ను చట్టపరమైన నిపుణులు మాత్రమే తయారు చేయాలి.
"ఈ de-Facto సంబంధ ఒప్పందంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు షరతులు ఒప్పుకున్నట్లు న్యాయవాది సమక్షంలో ఇద్దరూ సంతకం చేయాలి."
మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కారం
పెళ్లైన వారిలానే, విడిపోయిన de facto జంటల పిల్లలు మరియు ఆర్థిక విషయాలకు సంబంధించిన వివాదాల ను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ సేవలను పొందవచ్చు.WA కౌన్సెలర్ ఫియోనా బెన్నెట్ మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం వారిద్దరి మద్య సానుకూల వాతావరణం ఏర్పడేలా సహాయం చేస్తుందని అన్నారు.విడాకుల తర్వాత, ఆస్తుల విభజన మరియు భాగస్వామి పోషణకై ఆర్థిక సహకారం వంటి విషయాల గురించి కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది.

“మీరు ఒకవేళ 2 సంవత్సరాల వ్యవధి దాటినప్పటికీ కూడా కోర్టును ఆశ్రయించవచ్చు, కొంచెం సమస్య క్లిష్టతరమవుతుందని " గ్రీర్ అన్నారు. దానికంటే, ఇద్దరూ పరస్పర ఒప్పందాన్ని అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా వ్రాతపూర్వకంగా నిర్ధారించుకోవాలి.కోర్టు సిఫారసు చేసినా, మీరు ఒక ఒప్పొందానికి వచ్చిన, లేక ఆర్థిక ఒప్పొందనికి కుదుర్చుకున్నా, వ్రాతపూర్వకంగానే జరగాలి అని గ్రీర్ చెప్పారు.

మధ్యవర్తిత్వ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు కుటుంబ సమస్యలలో గృహ హింస గురించి నిర్ధారించుకుంటాము.“మీరు కోర్టుకి వెళితే , వివాదాస్పదంగా మారుతుంది. మీరు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించినట్లైతే , ఇతరుల వైపునుండి ఆలోచించడానికి మరియు మీ తరుపు విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
కుటుంబ విషయాల్లో చట్టపరమైన సమాచారాన్ని తెలుసుకోవాలన్న లేదా వకీలు కోసం Lawfully explained అనే వెబ్సైట్ ను సందర్శించండి, లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విక్టోరియా మరియు క్వీన్స్‌లాండ్ లా సొసైటీతో సహా ఆస్ట్రేలియా అంతటా ఉన్న ఇతర న్యాయ సంఘాల మద్దతుతో నడుస్తుంది.కుటుంబ సమస్యలు గురించి సమాచారం కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా 1800 050 321కి కాల్ చేయండి.
మీరు సమస్యల్లో ఉంటే ఎమర్జెన్సీ కాల్ 000|లైఫ్‌లైన్ 13 11 14|జాతీయ లైంగిక వేధింపులు, గృహ హింస కౌన్సెలింగ్ సర్వీస్ 1800 737 732 సంప్రదించండి.









