Key Points
- • మనసుకు తగిలిన గాయం మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
- • సరైన సహాయంతో, పిల్లలు వారి మనసుకు తగిలిన గాయం నుండి కోలుకోగలుగుతారు.
- • కొన్ని సందర్భాల్లో, నిపుణుల సహాయం అవసరం.
స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ సైకాలజీ, ANU లో సీనియర్ లెక్చరర్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ డేవ్ పసాలిచ్ మాట్లాడుతూ, పిల్లలలో ట్రామా వివిధ రకాలైన అనుభవాలను కలిగిస్తుందని చెప్పారు.
"పిల్లలు అనుకోని భయంకరమైన సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు నిస్సహాయంగా, భయానికి లోనవుతారు " అని డాక్టర్ పసాలిచ్ వివరిస్తున్నారు.
" కారు ప్రమాదాలు, యుద్ధం వాతావరణం , హింస, తల్లితండ్రులు విడిపోవడం వంటి విషయాల వారిని ఎక్కువ బాధిస్తూ ఉంటాయి ."
గ్రేటర్ సిడ్నీలోని పరమట్టాలోని కమ్యూనిటీ మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ (CMRC) లో నార్మా బౌల్స్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ ఆఫీసర్.
కొత్తగా వచ్చిన వలసదారులు మరియు శరణార్థులకు CMRC ప్రత్యేక మద్దతు సేవలను అందిస్తుంది.
యుద్ధం లేదా ఇంట్లో హింసకు గురైన బాధాకరమైన సంఘటనలను అనుభవించిన పిల్లల తల్లిదండ్రులు మరియు సంరక్షకులతో శ్రీమతి బౌల్స్ తరచుగా పని చేస్తారు.

మెదడు గా భయం ఎలా ప్రభావం చూపుతుందంటే
గాయం, ముఖ్యంగా క్లిష్టమైన అభివృద్ధి సమయం లో జరిగినపుడు, మెదడు నిర్మాణం మరియు దాని పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్ పసాలిచ్ చెబుతున్నారు.
"ముఖ్యంగా, పిల్లలు భయానికి గురైనప్పుడు, ప్రపంచం మొత్తం తలక్రిందులుగా అయినట్టు , వారు సురక్షితంగా ఉండే చోటుల్లో కూడా ఇప్పుడు ప్రమాదమనిపించేలా ఉంటుందని " డాక్టర్ పసాలిచ్ చెబుతున్నారు.
"ఇలాంటి సందర్భాలలో ఉన్న పిల్లల మెదడు మరియు వారి సామాజిక-భావోద్వేగ అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని " ఆయన చెప్పారు.
వారు చుట్టూ పక్కన జరిగే ప్రతి చిన్న విషయాలకు భయపడుతూ, సురక్షితంగా లేనట్టు బిక్కు బిక్కు మంటూ ఉంటారు.Dave Pasalich
మెదడు యొక్క లింబిక్ సిస్టమ్, ముఖ్యంగా అమిగ్డాలా, ఎవరైనా బెదిరించినపుడు సున్నితంగా మారుతుందని , దాని వల్ల ఆందోళన మరియు భయ ప్రతిస్పందనలకు దారితీస్తుందని డాక్టర్ పసాలిచ్ చెబుతున్నారు.
"ఎక్కువ కాలం భాదలు పడే పిల్లల మెదడు మరియు వారి శరీరంలో మార్పుల చోటుచేసుకొని సర్వైవల్ మోడ్ కు చేరుకుంటుంది."
సిడ్నీలోని బీ సెంటర్ ఫౌండేషన్ లో ప్లే థెరపిస్ట్ బ్రీ డి లా హార్ప్ మాట్లాడుతూ, పిల్లలు ఫ్లైట్ మోడ్ లో ఉన్నప్పుడు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్న విషయం గమనించరు.
ఇలాంటి సందర్భాల్లోనే స్కూళ్లలో గొడవలు మరియు చదువులో వెనుక పడటం వంటివి జరుగుతాయని Ms De La Harpe చెబుతున్నారు.
వారు సురక్షితంగా లేరని తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ’" అని ఆమె చెప్పారు.

ఇలాంటి స్థితి లో ఉన్న పిల్లలకు తల్లితండ్రులు ఎలాంటి సహాయం చేయాలి?
మెలానియా డీఫోల్ట్స్ గత 14 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు సహాయం చేస్తున్న కన్సల్టెంట్. తల్లిదండ్రులు పిల్లల మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం శ్రద్ద వహించడం ఎంత అవసరమో అన్న విషయాన్నీ చెబుతున్నారు.
డాక్టర్ పసాలిచ్ మాట్లాడుతూ పిల్లల భావాలు మరియు అవసరాలకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలి.
"తల్లిదండ్రులు, మొదట, సౌమ్యంగా, సున్నితంగా ఉంటూ — ముఖ్యంగా మీ పిల్లల ప్రవర్తన వారి అవసరాల బట్టి మీకు ఏమి చెబుతున్నారనే విషయాన్ని గమనించాలి.
ఉదాహరణకు, అక్కడ పిల్లలు అసురక్షితంగా భావిస్తే , వారు దూకుడు ప్రవర్తనను ప్రదర్శించవచ్చు. అది అర్ధం చేసుకొని , మనం వెనక్కి తగ్గి, భద్రత కోసం పిల్లల భద్రంగా ఉండేలా చేసుకోవాలని వివరిస్తున్నారు.

వారు తిరిగి మాములు పరిస్థితి కి రావాలంటే ప్రేమతో వారిని దగ్గరకు తీసుకొని అర్ధం అయ్యే విధంగా నెమ్మదిగా మార్పు తీసుకురావాలి.
ఇంట్లో అనుకూల వాతావరణం తో పాటు, మీరు పిల్లల తో ఎక్కువ సమయాన్ని గడిపేలా చూసుకోవాలి.
సైకోథెరపిస్ట్ మరియు ప్రస్తుతం బీ సెంటర్ లో ప్లే థెరపిస్ట్ అయిన టియానా విల్సన్, మాట్లాడుతూ గాయం ఎప్పుడైనా సరే దానికి రికవరీ అవసరం అని చెబుతున్నారు.
చాలా వరకు గాయాలు తెలియకుండానే జరుగుతుంటాయి, అన్నింటిని నెమ్మదిగా మాన్పవచ్చు.Tiana Wilson
కొన్ని సందర్భాల్లో, వృత్తిపరమైన సహాయం అవసరమని డాక్టర్ పసాలిచ్ సూచించారు."కొన్ని సార్లు పిల్లలు కోలుకొని యెడల , లేదా సమస్యలు పెరిగి వారి దైనందిన జీవితంపై ప్రభావం చూపిస్తే, వృత్తిపరమైన సహాయం పొందడం నిజంగా ముఖ్యం" అని డాక్టర్ పసాలిచ్ చెప్పారు.
ఎక్కడ సహాయం పొందాలి
- Your GP (doctor), mental health specialist, such as a psychiatrist, psychologist, counsellor or social worker
- Your local community health centre
- Australian Psychological Society Referral Service on 1800 333 497
- Phoenix Australia Centre for Post-traumatic Mental Health on (03) 9035 5599
- Centre for Grief and Bereavement on 1800 642 066







