Key Points
- ఫస్ట్ నేషన్స్ కమ్యూనిటీల చరిత్ర గురించి మీరు అర్థం చేసుకోండి మరియు స్థానికేతర ప్రజలతో వారికి ఉన్న సంబంధాలను తెలుసుకోండి.
- మీరు నివసిస్తున్న భూమి/ప్రాంతం యొక్క సాంప్రదాయ యజమానుల గురించి తెలుసుకోండి.
- బహుళ సాంస్కృతిక సమాజాలు ఉమ్మడి అనుభవాల ద్వారా నిర్మించవచ్చు.
ఫస్ట్ నేషన్స్ ప్రజలకు సహాయంగా ఉండటం అంటే ఆ వ్యక్తి స్వదేశీ ప్రజలకు ప్రాముఖ్యత ఇస్తూ వారికీ మద్దతుగా నిలబడటం అని యోర్టా మహిళ డాక్టర్ సమ్మర్ మే ఫిన్లే వివరించారు.

"మాతో కలిసి ఉండటం వల్ల మేము గొంతెత్తి మా సమస్యలను మీతో పంచుకునేందుకు సహాయపడుతుంది. మార్పు కోసం కలిసి పనిచేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం" అని ఆమె చెప్పారు.
అవగాహన పెంచుకోండి
ఏదైనా సంబంధం బలపడటానికి మొదటి దశ "అక్కడి ప్రజలను తెలుసుకోవడం" అని బండ్జాలుంగ్ మహిళ మరియు CEO కరెన్ ముండిన్, రీకన్సిలేషన్ ఆస్ట్రేలియా చెప్పారు
"ఫస్ట్ నేషన్స్ ప్రజలతో ఇతర ఆస్ట్రేలియన్లకు నేడు ఉన్న సంబంధాల్ని అర్థం చేసుకోవడం మరియు వారి చరిత్రను అర్థం చేసుకోవడం,ప్రారంభించాలి." ఈ ప్రక్రియ ఆస్ట్రేలియన్ల జీవితాల్ని సుసంపన్నం చేస్తుందని ఆమె చెప్పారు.
"ఇక్కడి ప్రజలతో , ప్రాంతంతో మరియు దేశంతో వారి సంబంధాల్ని బలోపేతం చేసే అవకాశం ఇస్తుంది" అని ముండిన్ చెప్పారు.
విశ్వసనీయ వనరులను ఉపయోగించి స్థానికేతర ప్రజలను అర్థంచేసుకుంటామని మరియు దానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ ఫిన్లే చెప్పారు.
"మేము మొత్తం జనాభాలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నందున, తమకు తాము సమయం కేటాయించుకొని వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవారే మిత్రులని " ఆమె చెప్పారు.
"ప్రతి ఒక్కరికీ మేము మా గురించి అవగాహన కల్పించేంత జనాభా లేమని అన్నారు."
ఫస్ట్ నేషన్స్ ప్రజల గురించి తెలుసుకోవడానికి అనేక వనరులు ఉన్నప్పటికీ, ఫస్ట్ నేషన్స్ సంస్థలు మరియు స్థానిక కౌన్సిళ్ల ద్వారా మీరు నివసించే భూమి యొక్క సాంప్రదాయ యజమానుల గురించి తెలుసుకోవడం మంచి ప్రారంభమని ముండిన్ చెప్పారు.
అందరిని సమానంగా చూడాలి
ల్యూక్ పియర్సన్ ఒక గామిలారే వ్యక్తి, మరియు ఇండిజెనియస్ X స్థాపించిన వారు. వైవిధ్యమైన స్వదేశీ అభిప్రాయాలను తెలియజేసే ఆన్¬లైన్ వేదిక.

సానుకూల మార్పులో ప్రతి ఒక్కరూ వారి పాత్ర పోషించగలిగినప్పటికీ, ఈ సందర్భంలో వారికీ సహాయం చేసే మిత్రులు అని పేరును ఉపయోగించుకునే వాళ్లకి అయన విరుద్ధం అని ఆయన వివరించారు.
"మీరు చేసేది మంచి పనే కాబట్టి , గుప్తంగా ఉంచి దాని ద్వారా మీరు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించకండి.
"మీకు మంచి పేరు రావడం కన్నా స్వదేశీ ప్రజల సమస్యలను తీర్చి వారి జీవితాల్ని మెరుగుపరచడమే దీని లక్ష్యం."
READ MORE

What is Welcome to Country?





