ముఖ్యాంశాలు:
- అవకాశాలను వెతుకుతూ ప్రత్యక్షంగా కనపడని జాబ్ మార్కెట్ లోకి ప్రవేశించడం వలన మీకు పని దొరికే అవకాశాలు పెరుగుతాయి.
- వలస మరియు శరణార్థుల ఉపాధి సేవలు ఉపాధి మార్గాలను వేగవంతం చేస్తాయి.
- సంరక్షణ సేవలు, హాస్పిటాలిటీ మరియు ఉమెన్ ఇన్ ట్రేడ్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఉద్యోగాలను ప్రయత్నించండి.
మీరు ఆస్ట్రేలియాకు చేరుకున్న వెంటనే, మీ ఎంత సేపు పనిచేయవచ్చనే విషయం మరియు మీ వీసా పని గంటలను తెలుసుకొని ఉద్యోగ అవకాశాలను చురుకుగా వెతకటం చాలా అవసరం.
"ఎవరో మీకు ఉద్యోగం ఇస్తారని వేచి ఉండకండి" అని NB మైగ్రేషన్ లా వద్ద ప్రిన్సిపల్ లాయర్ గా పనిచేస్తున్న ఆగ్నెస్ కెమెన్స్ సలహా ఇస్తున్నారు.
ఉపాధి వెబ్‌సైట్‌లు మరియు ఏజెన్సీలు
సీక్, కెరీర్‌వన్ మరియు జోరా వంటి ఉపాధి వెబ్‌సైట్‌లు మరియు లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మీకు ఏ రకమైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి మరియు ఏయే రంగాలను నియమించుకుంటున్నాయి అనే విషయాలను తెలియపరుస్తాయి.
మీరు రిక్రూట్‌మెంట్ మరియు లేబర్-హైర్ ఏజెన్సీలను కూడా సంప్రదించవచ్చు. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు మిమ్మల్ని పర్మినెంట్ లేదా కాంట్రాక్ట్ జాబులలో ఉంచడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం కంపెనీ వాళ్ళ దగ్గర నుండి కొంచెం రుసుము కూడా వసూలు చేస్తారు . లేబర్ హైర్ ద్వారా వారు మిమల్ని జాబులలోకి తీసుకొని , వారు ఇతర యజమానులకు మిమల్ని నియమిస్తారు.

అవకాశాలను వెతుకుతూ జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించడం
చాలా ఉద్యోగాలు ప్రచారం చేయబడనందున, పని కోసం వెతుకుతున్నపుడు, ఉద్యోగ యజమానులతో నేరుగా మాట్లాడడం మరియు మీరు ఏర్పరచుకున్న పరిచయాలు ద్వారా మీ నెట్‌వర్క్ లో ఉన్న వారిని అడిగి తెలుసుకోవడం మంచిది.
మీ Facebook కమ్యూనిటీ గ్రూప్స్ ద్వారా మరియు మీ స్నేహితులు పని చేసేచోట అవకాశాల ఉన్నపుడు మీకు తెలియజేయమని మీరు అడగవచ్చు.
వలస మరియు శరణార్థుల ఉపాధి సేవలు
నేషనల్ నాట్-ఫర్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెటిల్మెంట్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ (SSI) వారు శిక్షణ మరియు ఉపాధి మార్గాలకు విభిన్న నేపథ్యాల నుండి వ్యక్తులను పరిచయం చేస్తారు. శరణార్థులు మరియు వలస సంఘాలను లక్ష్యంగా చేసుకునే కార్యక్రమాలను వారు అందిస్తారు.
"మేము దీనిని ‘విజయానికి 10 మెట్లు' అని పిలుస్తాము," అని SSI వద్ద ఉపాధి సేవల హెడ్ జోడీ లాకానీ చెప్పారు.
"వారు ఏమి నేర్చుకోవాలి, వారి వ్రాతపనులన్నింటినీ ఆస్ట్రేలియన్ ఎవిడెన్స్ బేస్ లోకి ఎలా అనువదించాలి, వారి విదేశీ అర్హతను ఎలా గుర్తించాలి, పని కోసం ఎలా వెతకాలి, వ్యాపారాలను ఎలా పరిశోధించాలి, వారు స్వతంత్రంగా ఉండటానికి ఎలా సహాయపడాలి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేస్తాము."
విదేశాలలో ఇంతకుమునుపు వారు పని చేసినట్లయితే , ఆస్ట్రేలియాలో ఇక్కడ ఎలా పనిచేస్తారో అన్న విషయం SSI మీకు తెలియజేస్తారు.
“ఉదాహరణకు, మీరు మిడిల్ ఈస్ట్‌లో బహుళ-బిలియన్-డాలర్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీర్ అయితే, మీరు మీ పనిని ఇక్కడ ఎలా మొదలు పెట్టగలరు? విదేశీ అర్హత గుర్తింపు పొందడం, పనిలో ఆంగ్ల భాషను మెరుగుపరచడం, విశ్వాసాన్ని పెంపొందించడం, సోషల్ నెట్ వర్క్ లను నిర్మించడం మరియు మీరు మరెక్కడైనా ప్రారంభించగలరా?" అనే అన్ని అంశాలను తెలియజేస్తారు.
మీరు ఉద్యోగములో చేరడానికి SSI మిమ్మల్ని స్థానిక వ్యాపారాలకు కూడా పరిచయం చేస్తుంది.
AMES ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం యొక్క వర్క్‌ఫోర్స్ ప్రోగ్రామ్ మరియు ఇతర స్వతంత్ర కార్యక్రమాల ద్వారా వలసదారులకు ఉచిత ఉపాధి సేవలను అందిస్తుంది.
ఈ ప్రోగ్రామ్‌లు ఉపాధి అడ్డంకులను పరిష్కరిస్తాయి, అంతేకాకుండా వలసదారుల నైపుణ్యాలు, అర్హతలు మరియు అనుభవాన్ని హైలైట్ చేస్తాయి. ఎంప్లాయిమెంట్ మెంటరింగ్ ప్రోగ్రామ్ వలసదారుల మార్గాలను ఉపాధిలోకి వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఎంప్లాయిమెంట్ మెంటరింగ్ ప్రోగ్రామ్ వలసదారుల మార్గాలను ఉపాధిలోకి వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది.Laurie Nowell, Public Affairs Manager at AMES.
"మేము మా రెఫ్యూజీ సెటిల్‌మెంట్, విద్య మరియు ఉపాధి సిబ్బందిని ఒకే చోటకి తీసుకువస్తాము మరియు వారు ప్రతి వలసదారులు లేదా శరణార్థి క్లయింట్‌ను పరీక్షించగలరు" అని మిస్టర్ నోవెల్ జోడించారు.
AMES - స్కిల్ల్డ్ ప్రొఫెషనల్ మైగ్రంట్స్ ప్రోగ్రాం ను నడుపుతూ ఆస్ట్రేలియన్ కార్యాలయాలకు వృత్తిపరమైన వలసదారులను పరిచయం చేస్తుంది.

నిర్మాణ రంగంలో స్త్రీలు:
మహిళలను సివిల్ లేదా నిర్మాణ రంగంలో పని చేసేలా చూసేందుకు NSW రాష్ట్ర ప్రభుత్వ చొరవ తీసుకుంది. SSI ద్వారా, వ్యాపారాలు మరియు నిర్మాణ రంగంలోకి ప్రవేశించే మహిళలు ఇద్దరికీ సామర్థ్యాన్ని మరియు అవగాహనను పెంపొందిస్తుంది.
"మహిళలను ట్రేడ్‌లలోకి రిక్రూట్ చేయడానికి, సాధికారత కల్పించడానికి వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రత్యేకంగా వ్యాపారాలతో కలిసి పని చేస్తున్నాము" అని Ms Lazkany చెప్పారు.
మహిళలకు ఆర్థిక సాధికారత ఎంత ముఖ్యమైనదో NSW రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది . దీని ద్వారా, స్త్రీలు తమతో పాటు వారి కుటుంబానికి కూడా మద్దతు ఇవ్వగలుగుతారు.
ట్రేడ్‌లలో మహిళల ఉనికి పెరగడం వలన సామాజికంగా ఎంతో మార్పును వస్తుంది కనుక , ఇది కెరీర్ అవకాశాలను వెతికే వారు పరిగణించదగిన అంశం.
సంరక్షణ మరియు హాస్పిటాలిటీ పరిశ్రమలను పరిగణించండి
అనేక ఎంట్రీ స్థాయి ఉద్యోగ అవకాశాలు ఈ రంగాలలో మెండుగా ఉన్నందున AMES ఆస్ట్రేలియా వారు ఈ రంగాలలో వృత్తిపరమైన శిక్షణను అందిస్తున్నారు.
"వలసదారులు మరియు శరణార్థులు వృత్తిపరమైన అర్హతలు లేకపోయిన పని చేయాలనే ఆలోచన ఉన్నవారికి ఈ శిక్షణ ఇస్తుంటాము. కేర్ మరియు హాస్పిటాలిటీ రంగాల ద్వారా, వారు శ్రామికశక్తిలో చేరడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు అర్హతలను త్వరగా పొందగలుగుతారు " అని Laurie Nowell చెప్పారు.
కేర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. ఈ రంగంలో దాదాపు రెండు మిలియన్ల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మరియు అది 2025 నాటికి 2.5 మిలియన్లకు పెరుగుతుంది.[Laurie Nowell, Public Affairs Manager, AMES Australia]

స్వచ్ఛంద సేవ యొక్క ప్రయోజనాలు
"మిమల్ని మీరు పరిచయం చేస్తూ మీ టాలెంట్ ను కూడా పరిచయం చేసేలా చూస్కోండి" అని ఆగ్నెస్ కెమెన్స్ చెపుతున్నారు.
“ఈ దేశానికి వచ్చే ఏ వలసదారుడైనా అద్భుతమైన సంస్కృతిని మరియు కొన్ని వృత్తులకు భిన్నమైన విధానాలను తీసుకువస్తారు . మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు, చాలా 30, 40, 50 తిరస్కరించిన ఖచ్చితంగా ప్రయత్నించాలని దీన్ని సిఫార్సు చేస్తాము.
"ఈ విధంగా, అనుభవాన్ని పొందేటప్పుడు మీరు యజమానికి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు," అని Ms కెమెన్స్ చెప్పారు.







