Key Points
- పరస్పర-సాంస్కృతిక స్నేహాల ద్వారా విభిన్న వలస అనుభవాల మధ్య సాంప్రదాయికతలను కనుగొంటాము.
- మన నేపధ్యాల వారితో ఉండటం వల్ల , కొత్త దేశం లో మనకు అత్యంత క్లిష్టమైన సమాచారాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది.
- పరస్పర సాంస్కృతిక స్నేహ బంధాలు వలన మనం ఇక్కడ కు చెందిన వారమే అనే భావన ను బలోపేతం చేస్తాయి.
- మనం ఒకే సాంస్కృతిక నేపథ్యం వారితో ఉండిపోవడం వలన, మనం మంచి అర్థవంతమైన సంబంధాలను ఏర్పరుచుకునే అవకాశాన్ని కోల్పోయినవారమే అవుతాం.
వలస అనుభవం ఒంటరిగా ఉండవచ్చు, కాబట్టి మనం స్నేహం కోసం తెలిసిన వ్యక్తుల వైపు ఆకర్షితులమౌతాము.అయితే మన వాళ్ళను దాటి మనం ఇతరులతో స్నేహం చేసినపుడు, మన ఆలోచన దృక్పధం మరియు భావనాత్మకతను పెంచుతుంది.పరస్పర సాంస్కృతిక స్నేహ బంధాలు మన సామర్ధ్యాల ను కూడా తెలిసేలా చేస్తాయి.
“ఎవరైనా కొత్తగా ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు వారు తరచుగా, మైగ్రేషన్ విషయాల పై మొదట చర్చించుకుంటారు ” అని స్నేహ, వలసల ప్రొఫెసర్ డాక్టర్ హర్రియట్ వెస్ట్ కాట్ చెపుతున్నారు.
సాంస్కృతిక అవరోధం:
మన జాతీయ, సాంస్కృతిక సంభందాలు ఉన్న వారిలో మనం కలుసుకొని మన కష్టాలు, బాధలు చెప్పుకోవాలని అనుకుంటాం.కానీ, దాని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
“మీకు సమస్య ఏమిటంటే, మీరు మీ వారిని దాటి బయటకి రావడం లేదు, మీరు అందులోనే ఉండిపోతున్నారని ” RMIT ప్రొఫెసర్ కాథరిన్ గోమెజ్ హెచ్చరిస్తున్నారు.
మీ పరిస్థితి లో నేను ఉన్న ఈ విధంగానే ఆలోచిస్తాను. కానీ ఇక్కడి సమాచారం మరియు దృక్పథం విషయానికి వస్తే, నా స్నేహితుడికి తెలిసింది మాత్రమే నాకు తెలుసు. మనకు ఎలాంటి పరిస్థితులు కలగచ్చో తెలియదు కాబట్టి, కొన్ని సార్లు కొంచెం కష్టం అనిపించవచ్చు.Catherine Gomes
మనం వెలుపల వారితో స్నేహం చేయడం వల్ల, దేశంలో నివసించడానికి కీలకమైన సమాచారాన్ని పొందగలుగుతాము.
అంతర్జాతీయ విద్యార్థులు సాధారణంగా స్థానిక స్నేహితులను సంపాదించుకోవడం వల్ల వారు చక్కగా సర్దుకుపోతారని చెపుతున్నారు.
అయినప్పటికీ, చాలా మంది చైనీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమకు చైనీస్ సర్కిల్ వెలుపల స్నేహితులు లేరని చెప్పడం విన్నారని ప్రొఫెసర్ గోమేజ్ అన్నారు.

కానీ వలస వచ్చిన వారు స్థానికులతో స్నేహం చేయడం కొంచెం కష్టమే అంటున్నారు.
నిజం చెప్పాలంటే చాలా మంది వలసదారులకు, ముఖ్యంగా తాత్కాలిక వలసదారులకు, స్థానిక స్నేహితులను సంపాదించడం చాలా కష్టమే అనే చెప్పాలి.
స్నేహితులను సంపాదించడం కష్టమే!!
స్థానికులు సహజంగా వారుకూడా తెలిసిన వారితోనే స్నేహం ఏర్పరుచుకుంటారు. మాజీ రష్యన్ అంతర్జాతీయ విద్యార్థి మాక్స్ కాచెంకో వచ్చినప్పుడు ఈ కఠినమైన వాస్తవాన్ని గమనించాడు.
కొంతమంది వలసదారులు, మనకు ఇక్కడ స్థానికులు స్నేహితులు కావడం కొంచెం కష్టమే అని చెప్పారంటే , అది నిజమే, ఆ కష్టాన్ని నేను దాటుకునే వచ్చాను.Max Tkachenko
ఎలా స్నేహం చేయాలంటే
కాబట్టి, తన సాంస్కృతిక నేపథ్యం వాళ్ళని కాకుండా, ఇతరులతో కాచెంకో ఎందుకు స్నేహం చేసారో చూద్దాం?
“సహజంగా ఇది పిల్లాడిని చాక్లేట్ స్టోర్ కి తీసుకెళ్లినట్టు. ఎలా ఐతే తను అన్ని రకాలు ప్రయత్నిద్దాం అనుకుంటాడో,అలానే తకాచెంకో కూడా ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు తనవాళ్లతోనే పరిమితం కాకుండా బయట వారితో కూడా స్నేహం చేయడం ప్రారంభించాడు".

అతని సలహా ఏంటంటే చాలా సులభం: "మీరు బయటకు వెళ్ళి ప్రయత్నించండి".
“మీ సాంస్కృతిక నేపథ్యానికి మాత్రమే మీరు పరిమితం చేసుకున్నప్పుడు మీరు అభివృద్ధి చేయగల అత్యంత అర్థవంతమైన కొన్ని సంబంధాలను మీరు మిస్ అవుతున్నట్టే.”
మనం ఇక్కడి వారమే అన్న భావన
ప్రొఫెసర్ గోమ్స్, సింగపూర్ లో జన్మించిన యూరేషియన్ అయినా ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత, వివిధ వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉందని అంటున్నారు.

“మొదటిసారి ఇతర సాంస్కృతిక నేపధ్యం వారితో మాట్లాడినపుడు భయం గురించి, కష్టాల గురించి మాట్లాడతారు ” అని కాచెంకో అంటున్నారు.
మీరు భయం తో ఎంతో అవసరమైన విషయాలను వదిలేస్తున్నారు.
“భయాన్ని పక్కన పెట్టి, వాళ్ళతో మిమల్ని మీరు పరిచయం చేస్కోండి, కొన్ని జోకులు వేయండి, అంతే . మరియు ఆ వ్యక్తి ఆస్ట్రేలియా జన్మించాడా లేదా ఇక్కడకు పుట్టాక వచ్చాడా, ఇవన్నీ అవసరం లేదు ” అని అన్నారు.







