SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
‘సహజవాయువుతో అభివృద్ధి’ సాధ్యమా?

Leader of the Opposition Peter Dutton delivers his 2025-26 Budget Reply Speech in the House of Representatives at Parliament House, Canberra Source: AAP / MICK TSIKAS/AAPIMAGE
ప్రధాని ఆల్బనీజీ ఫెడరల్ ఎన్నికలకు తేదీని ఖరారు చేస్తూ, ప్రకటన చేయటంతో ఎన్నికల సమరం వాడిని వేడిని అందుకుంది. దేశంలోని రెండు పెద్ద పార్టీలు పెరుగుతున్న జీవనవ్యయం అందుకు కారణమయిన గృహనిర్మాణం, వసతి గురించిన విషయంపై కంటే మిగితా విషయాలపై తమ దృష్టిని కేంద్రీకరించినట్టు కన్పిస్తుంది. ఎన్నికల తేదీ ప్రకటన చేయడానికి రెండురోజుల ముందు విడుదల చేసిన బడ్జెట్ లో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి లేబర్ పార్టీ ప్రయత్నించగా, దానికి ప్రత్యమ్నాయంగా ‘సహజవాయువుతో అభివృద్ధి’ నినాదంతో లిబరల్ పార్టీ ఎన్నికల సమర శంఖం పూరించింది.
Share