SKIP TO MAIN CONTENT

విదేశీ విద్యార్థుల రాకపై కోత

Australia Chinese Students Threatened
International student commencements will be capped next year as the government tries to limit overseas migration. Credit: Mark Baker/AP

ఉన్నత విద్యలను, వృత్తి విద్యలను అభ్యసించడానికి ఆస్ట్రేలియా వచ్చే విద్యార్థుల సంఖ్యపై ఫెడరల్ ప్రభుత్వం కోత విధించనుంది.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

ఉన్నత విద్యలను, వృత్తి విద్యలను అభ్యసించడానికి ఆస్ట్రేలియా వచ్చే విద్యార్థుల సంఖ్యపై ఫెడరల్ ప్రభుత్వం కోత విధించనుంది.


2025 సంవత్సరానికిగాను ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి కేవలం రెండు లక్షల డెబ్బై వేల విదేశీ విద్యార్థలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఈ రెండులక్షల డెబ్బైవేలలో, లక్షా నలభై ఐదువేల సీట్లను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు, 95వేల సీట్లను వృత్తివిద్యలను అందించే సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 30వేల సీట్లను మిగిలిన విశ్వవిద్యాలయాలు, ఉన్నతవిద్యలను అందించే అనుబంధ సంస్థలు పంచుకుంటాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆస్ట్రేలియాలో చదువుకోవలనుకునే విదేశీ విద్యార్థులు అశనిపాతంలా మారనుంది. గత సంవత్సరంతో పోలిస్తే సీట్ల సంఖ్య 53వేల దాకా తగ్గే అవకాశముంది. కాగా, విదేశీ విద్యారంగం సమగ్రతను కాపాడటానికే ఈ చర్యలు చేపట్టనున్నామని ప్రభుత్వం అంటోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now