Key Points
- బయోబ్లిట్జ్ శాస్త్రీయ పరిజ్ఞానం మరియు పర్యావరణంపై మన అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది.
- బయోబ్లిట్జ్¬లో ఎవరైనా పాల్గొనవచ్చు.
- బయోబ్లిట్జ్ సమయంలో సేకరించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల ఉపయోగం కోసం జీవవైవిధ్య (Biodiversity)డేటాబేస్¬కు అప్¬లోడ్ చేస్తారు.
ఎడారులు మరియు ఉష్ణమండల వర్షారణ్యాల నుండి మంచు ఆల్పైన్ శిఖరాలు మరియు యూకలిప్టస్ అడవుల వరకు ఆస్ట్రేలియా జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉంది.
ఇక్కడ ఏ జంతు మరియు మొక్కల జాతులు ఉంటాయనే దాని గురించి మనకు చాలా తెలుసు, మన పర్యావరణాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, మనం దానిని అంత జాగ్రత్తగా చూసుకోవచ్చు.
బయోబ్లిట్జ్ అనేది ఒక సిటిజన్ సైన్స్ యాక్టివిటీ, దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు మరియు శాస్త్రీయ అవగాహనను పెంచుతూ కొత్త జాతుల మొక్కలు లేదా జంతువులను కనుగొనే అవకాశాన్ని అందిస్తుంది.

బయోబ్లిట్జ్ సమయంలో, ఒక నిర్దిష్ట వ్యవధిలో నిర్దేశిత ప్రదేశంలో ఎన్ని మొక్కలు మరియు జంతు జాతులను నమోదు చేయడానికి ప్రజలు, శాస్త్రవేత్తలతో పాటు పాల్గొంటారు.
డాక్టర్ డేవిడ్ ఎడ్మండ్స్ ఒక సంరక్షణ పశువైద్యుడు, అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా యొక్క దక్షిణ తీరంలోని వాల్¬పోల్¬లో నివసిస్తూ , ఇక్కడ వాల్పోల్ వైల్డర్నెస్ బయోబ్లిట్జ్¬ను నడుపుతున్నారు
"వాల్పోల్ అడవి వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని అత్యంత తేమతో కూడిన భాగాలలో ఒకటి మరియు ప్రపంచంలో మరెక్కడా లేని జాతులు మరియు పర్యావరణ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. నిజంగా పరిశోధించబడని/కనుగొనబడని ఒక పెద్ద ప్రాంతం వరకు ఉంది, కాబట్టి ఈ ప్రాంతాలలో ఏమి ఉందో కూడా మాకు తెలియదు మరియు ఇక్కడ కొన్ని జాతులు డైనోసార్లకు ముందు కాలం నాటివి, కాబట్టి ఇది జీవవైవిధ్యానికి చాలా ముఖ్యమైన ప్రాంతం" అని డాక్టర్ ఎడ్మండ్స్ చెప్పారు.
బయోబ్లిట్జ్ కమ్యూనిటీను ఒక్కటిగా చేర్చి సైన్స్ కు ఎలా సహాయపడుతుంది
వాల్¬పోల్ అరణ్య ప్రాంతం మాదిరిగా, ఆస్ట్రేలియాలోని ఇతర పెద్ద ప్రాంతాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఇంకా మరింత తెలుసుకోవచ్చు. బయోబ్లిట్జ్¬లో కమ్యూనిటీని భాగస్వామ్యం చేయడం వలన కలిసి ముందుకు వస్తారని డాక్టర్ ఎడ్మండ్స్ చెప్పారు. ఇది పర్యావరణంపై విషయాలను మరియు శాస్త్రీయ అవగాహనకు సహాయపడుతుంది.
"బయోబ్లిట్జ్ చాలా శక్తివంతమైన ప్రాజెక్ట్ , ఇది వాస్తవానికి అందరు ఒకేలా ఆలోచించే వారిని ఒక్కటిగా చేస్తుంది , కానీ రికార్డ్ చేయబడిన ప్రతి పరిశీలన చాలా ఉపయోగపడుతుందని మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం - మరియు మన జ్ఞానాన్ని పెంపొందించే మరింత సమాచారాన్ని ఇస్తుంది మరియు మెరుగైన నిర్వహణ ఫలితాలకు దారితీస్తుంది" అని డాక్టర్ ఎడ్మండ్స్ వివరించారు.

బయోబ్లిట్జ్ ఈవెంట్లను తరచుగా స్థానిక కమ్యూనిటీ, సంరక్షణ లేదా సహజ వనరుల నిర్వహణ వారు నిర్వహిస్తారు . పాల్గొనేవారు ఒక నిర్దిష్ట సమయంలో నిర్దేశిత సహజ ప్రాంతాన్ని వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు. సాధ్యమైనంత ఎక్కువ జీవవైవిధ్యాన్ని నమోదు చేస్తారు కూడా.
"నైపుణ్య స్థాయిల బట్టి అనేక పనులు చేయవచ్చు , కొంతమంది ప్రజలు ఎక్కువ దూరం నడవాలనుకుంటే లేదా తక్కువ దూరం మాకు సరిపోతుంది అనేవారు మరియు ఎటువంటి శాస్త్రీయ నైపుణ్యాలు లేని వారు ఎవరైనా వారికి నచ్చిన విధంగా పనిచేయవచ్చు. ఎందుకంటే వారు శాస్త్రవేత్తలతో కలిసి పని చేస్తారు, వారు ఏమి చూస్తున్నారో గమనించి గుర్తించే ప్రక్రియను ఎలా చేయాలో చేస్తే సరిపోతుంది . " అని డాక్టర్ ఎడ్మండ్స్ చెప్పారు.Dr David Edmonds
కావలసిందల్లా మీ పరిశీలనా శక్తి, నిశిత కుతూహలం మరియు స్మార్ట్ ఫోన్. బయోబ్లిట్జ్¬లో పాల్గొనేవారు వారు గమనించిన మొక్కలు మరియు జంతువుల ఫోటోలను తీస్తారు , తరువాత వాటిని గుర్తింపు కోసం ఐనేచురలిస్ట్ వంటి ఆన్లైన్ బయోడైవర్సిటీ డేటాబేస్¬లో అప్¬లోడ్ చేస్తారు. ఈ సమాచారం అట్లాస్ ఆఫ్ లివింగ్ ఆస్ట్రేలియాకు కూడా వెళుతుంది, ఇది ప్రతి ఒక్కరూ చూసేలా ఉచితంగా అందుబాటులో ఉంటుంది .
"మేము గుర్తించడానికి ప్రయత్నిస్తున్న వాటిని యొక్క ఫోటో తీసి వెబ్¬సైట్¬లో అప్¬లోడ్ చేస్తాము, అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దానిని చూసి ఆ జాతిని గుర్తించవచ్చు. వారు దీనిని రీసెర్చ్ గ్రేడ్ డేటా అని పిలుస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఆ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు వారి స్వంత పరిశోధనలో ఉపయోగించవచ్చు. " అని డాక్టర్ ఎడ్మండ్స్ చెప్పారు.

శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది
మెలిస్సా హోవ్ వాల్పోల్ అరణ్యానికి సమీపంలో నివసించే పర్యావరణవేత్త. మునుపటి వాల్పోల్ వైల్డర్-నెస్ బయోబ్లిట్జ్¬లో, అకశేరుకాలను (Invertebrates) అధ్యయనం చేసే వెస్ట్రన్ ఆస్ట్రేలియా మ్యూజియం శాస్త్రవేత్తలు - సాలెపురుగులు, పురుగులు మరియు నత్తలు వంటి వెన్నెముక లేని జంతువులు గురించి కమ్యూనిటీ వాలంటీర్లతో కలిసి బయోబ్లిట్జ్లో పని చేరారని ఆమె చెప్పారు.
బయోబ్లిట్జ్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అకశేరుకాల నమూనాలను పాల్గొంటున్న వారి సహాయంతో తీసుకున్నారు. నమూనాలలో ఒకదాన్ని తరువాత గతంలో ఎన్నడూ సేకరించని 'సూడోకార్పియన్' యొక్క కొత్త జాతిగా గుర్తించారు. అంతరించిపోతున్న టింగిల్ పిగ్మీ ట్రాప్డోర్ స్పైడర్ యొక్క కొత్త సమూహాల సంఖ్య యొక్క ఆధారాలను కూడా వారు కనుగొన్నారు" అని హోవ్ చెప్పారు.Melissa Howe
ఇలాంటి బయోబ్లిట్జ్ పరిశోధనలు సైన్స్ కు విస్తృత ప్రయోజనాన్ని చూపుతాయి.
"ఈ పరిశోధనలు జాతులపై మరింత పరిశోధనకు సహాయపడతాయి మరియు వాటి వివరణలు, జీవశాస్త్రం మరియు ఆవాస అవసరాలపై కీలక సమాచారాన్ని అందిస్తాయి. ముఖ్యంగా క్లియరింగ్, అభివృద్ధి లేదా అగ్ని పాలనలు వంటి వాటి స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏదైనా అవాంతర కార్యకలాపాలకు సంబంధించి వాటికి నిర్దిష్ట ఆవాస అవసరాలు మరియు ప్రత్యేక రక్షణ అవసరం కావొచ్చు , " అని హోవ్ చెప్పారు.
డాక్టర్ ఎడ్మండ్స్ మాట్లాడుతూ , వాల్పోల్ అరణ్యం వంటి ప్రాంతంలో బయోబ్లిట్జ్ను నిర్వహించడం ద్వారా స్థానిక పర్యావరణం యొక్క ఆరోగ్యం తెలుస్తుందని, అది చాలా ముఖ్యమని అన్నారు.

"వాల్పోల్ వైల్డర్¬నెస్ బయోబ్లిట్జ్ వలన కొత్త పర్యావరణ వ్యవస్థలను చూడటానికి మరియు ఇంతకు ముందు సర్వే చేయని ప్రాంతాలను సర్వే చేయవచ్చు. తమతో పాటు వచ్చే ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల ఆసక్తి లో ఉండాలని మరియు ప్రకృతి లో అనుబంధం కలిగి ఉండాలని మేము భావిస్తామని అయన తెలిపారు.
"బయోబ్లిట్జ్ ద్వారా కమ్యూనిటీ నిమగ్నత, తమ వంటి ఆలోచన కల వారితో పనిచేయడం మరియు వారు సైన్స్ నుండి చాలా తెలుసు కోగలుగుతారు" అని డాక్టర్ ఎడ్మండ్స్ చెప్పారు.
బయోబ్లిట్జ్ లో ఎవరైనా పాల్గొనవచ్చు. మీ స్థానిక కమ్యూనిటీ ద్వారా ఆన్లైన్లో వెతికి మీకు దగ్గరలో ఉన్న ఈవెంట్స్ లో పాల్గొనండి.







