Key Points
- స్వదేశీ వాయిస్ టు పార్లమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాల్లో మెజారిటీ ప్రజలు "నో" ఓటు వేశారు
- ఆరు రాష్ట్రాలు మరియు నార్తర్న్ టెరిటోరి 'నో' ఓటును నమోదు చేయగా, ACT 'ఎస్ 'కు ఓటు వేశారు.
- ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బానీసీ అందరు ఆస్ట్రేలియన్లను కలిసి ముందుకు రావాలని కోరారు.
రాజ్యాంగంలో పార్లమెంటుకు స్వదేశీ వాయిస్ ను పొందుపరచాలనే ప్రతిపాదనను ఆస్ట్రేలియన్లు తిరస్కరించారు.
శనివారం జరిగిన చారిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా మొత్తం ఆరు రాష్ట్రాలు మరియు నార్తర్న్ టెరిటోరి 'నో' ఓటును వేశారు.
మొత్తం జాతీయ గణనలో 'నో' ఓటు ఆధిక్యంలో ఉంది.
కేవలం ACT లో మాత్రం "ఎస్" ఓటును వేశారు.
నిర్ణయం కి నిరాశ చెందిన ప్రధాన మంత్రి ఆంథోనీ మాట్లాడుతూ "మనం ఎలా ఆలోచిస్తున్నామో ఫలితం తెలపలేదని, అయినా ఈ నిర్ణయం మనల్ని విభజించిందని " అన్నారు.

Australian Prime Minister Anthony Albanese delivers a statement on the outcome of the Voice Referendum at Parliament House.
"ప్రతిపాదన మరియు ప్రక్రియ ఆస్ట్రేలియన్లను ఏకం చేయడానికి రూపొందించబడి ఉండాలి, మనలను విభజించడానికి కాదు" అని ఆయన అన్నారు.

Opposition Leader Peter Dutton and Shadow Minister for Indigenous Australians Senator Jacinta Price address the media following the referendum. Source: AAP / JONO SEARLE/AAPIMAGE
ఇండీజీనస్ ఆస్ట్రేలియా మంత్రి లిండా బర్నీ మాట్లాడుతూ ఈ నిర్ణయం చుసిన తరువాత తప్పకుండా మొదటి ప్రజల నుండి నాయకులు పుడతారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
ఇండీజీనస్ ఆస్ట్రేలియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని ప్రముఖ 'నో' ప్రచారకర్త న్యుంగ్ గై వారెన్ ముండిన్ అన్నారు.
"కొన్ని స్వదేశీ సమాజాలలో కొనసాగుతున్న హింస, దుర్వినియోగం, బలవంతపు నియంత్రణ మరియు విధ్వంసక ప్రవర్తనపై ప్రజలు దృష్టి సారించాలని " అని ఆయన అన్నారు.
NITV ద్వారా ఫస్ట్ నేషన్ ప్రజల దృక్పథాల ను మరియు SBS నెట్వర్క్ లో voice తో పార్లమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ గురించి తెలుసుకోండి.
60కి పైగా భాషలలోని వీడియోలు మరియు పాడ్ కాస్ట్ లను యాక్సెస్ చేయండి.
Voice Referendum hub on SBS On Demand ద్వారా వాయిస్ రిఫరెండం కు సంబంధించి తాజా వార్తలు మరియు విశ్లేషణలు, తెలుసుకోండి.