SBS వారు ఆస్ట్రేలియాలో నివసించే ఆదిమ తెగల వారిని ఈ భూమి యొక్క నిజమైన యజమానులుగా గుర్తిస్తున్నారు.
"అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్" పాటను 1878లో ఉపాధ్యాయుడు మరియు పాటల రచయిత అయిన పీటర్ డాడ్స్ మెక్‌కార్మిక్ రాశారు. ఈ పాటను 19 ఏప్రిల్ 1984న ఆస్ట్రేలియా జాతీయ గీతంగా ప్రకటించారు.
2021లో ఈ పాటలో రెండవ లైన్లో ఉండే పదాలను 'యంగ్ అండ్ ఫ్రీ' నుండి 'వన్ అండ్ ఫ్రీ'కి మార్చి, ప్రాచీన కాలం నుండి ఇక్కడ నివసిస్తున్న ఆదివాసీలకు చారిత్రక, రాజకీయ ప్రాధాన్యతను కల్పించేలా మార్పులు చేశారు.
Australian National Anthem lyrics ఆస్ట్రేలియన్లందరూ హర్షధ్వనులతో చాటండి,
మనందరం ఒక్కటేనని, స్వతంత్రులమని;
శ్రమకు తగిన సంపదనిచ్చేసువర్ణ భూమి మనది;
ఆ భూమికి నలుదిశలా విశాల సముద్రముంది;
ప్రకృతివనరులకు నిలయమైన మన భూతలం
అపూర్వమైన అందాలతో అలరారుతోంది;
చరిత్రపుటలలోని ప్రతి దశలో
ఆస్ట్రేలియా ప్రగతిబాటన పయనించు.
ఆనందం ప్రతిధ్వనించగా గొంతుకలుపుదాం,
ఆస్ట్రేలియా విజయశిఖరాలను అధిరోహించు
వెలుగును విరజిమ్ముతున్న సదరన్ క్రాస్ నీడలో
ఒళ్లువంచి, మనసు లగ్నం చేసి పాటుపడదాం;
కామన్వెల్త్ దేశాలకే మన దేశాన్ని
మకుటాయమానంగా తీర్చిదిద్దుదాం;
సముద్రపు అలలను దాటి వచ్చిన వారంతా
పంచుకోవడానికి తగినంత భూతలముంది;
ఆస్ట్రేలియాను ప్రగతిబాట నడిపించడానికి
ధైర్యంగా కలసి నడుద్దాం;
ఆనందం ప్రతిధ్వనించగా గొంతుకలుపుదాం,
ఆస్ట్రేలియా విజయశిఖరాలను అధిరోహించు
- Credit: Don Arnold/Getty Images
Australian Citizenship Pledge
1949లో ఆస్ట్రేలియా పౌరసత్వం ప్రవేశపెట్టినప్పటి నుండి, 60 లక్షలకు పైగా ప్రజలు పౌరులయ్యారు.పౌరసత్వ వేడుకలను స్థానిక కౌన్సిల్లు నిర్వహిస్తాయి, వాటిలో సెప్టెంబర్ 17న ఆస్ట్రేలియన్ పౌరసత్వ దినోత్సవం కూడా ఒకటి.వేడుకలో భాగంగా, ఆస్ట్రేలియా జాతీయ గీతం వినిపిస్తారు మరియు ప్రజలు ఈ దేశ బాధ్యతలను చేపడుతున్నట్లు ప్రతిజ్ఞ చేస్తారు.
దీనిలో రెండు రకాలుగా ప్రతిజ్ఞ చేస్తారు — వాటిలో ఒకటి దేవుడిని ప్రస్తావిస్తూ, మరొకటి లేకుండా.ఈ గీతాన్ని అధికారిక వేడుకలు, క్రీడా పోటీలు మరియు ఇతర సమాజ కార్యక్రమాలలో పాడతారు.
Pledge version 1
ఇప్పటి నుంచి, దేవుని సాక్షిగా,
నేను ఆస్ట్రేలియా దేశానికి నమ్మకంగా,
ప్రజాస్వామ్య పాలనకు కట్టుబడి ఉంటానని
వారి హక్కులు, స్వేచ్ఛలను గౌరవిస్తానని
వారి చట్టాలను పాటిస్తూ నడుచుకుంటాని ప్రమాణం చేస్తున్నాను.
Pledge version 2
ఇప్పటి నుంచి,
నేను ఆస్ట్రేలియా దేశానికి నమ్మకంగా,
ప్రజాస్వామ్య పాలనకు కట్టుబడి ఉంటానని,
వారి హక్కులు, స్వేచ్ఛలను గౌరవిస్తాను అని,
వారి చట్టాలను పాటిస్తూ నడుస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Read and listen Australian National Anthem and citizenship pledge in your language