Key Points
- వేడి వేసవి రోజుల్లో నీళ్లు లేదా ఎలెక్ట్రోలైట్ వంటి పానీయాలు తాగడం చాలా అవసరం.
- బయటకు వెళుతున్నప్పుడు, SPF 50 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి.
- బయటకు వెళ్ళే ముందు UV ఇండెక్స్ ఎంత ఉందొ అన్న విషయాన్నీ తెలుసుకోవడం మంచిది.
అధిక ఉష్ణోగ్రత ఉన్నపుడు, వాతావరణానికి తగ్గట్టుగా వేడిని తగ్గించే సామర్ధ్యం మన శరీరానికి ఉంటుంది. థెర్మోస్టాట్ లా మన శరీరం వేడిని నియంత్రించగలదని సిడ్నీ GP డాక్టర్ అయిన ఏంజెలికా స్కాట్ చెబుతున్నారు.
మన శరీరం వేడికి ఎలా స్పందిస్తుందంటే
వేడి విషయానికి వస్తే, ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి మన శరీరం వివిధ మార్గాల్లో స్పందిస్తుంది. అందులో ప్రధానమైనది చెమట, అని డాక్టర్ స్కాట్ వివరిస్తున్నారు.
వేడిగా ఉన్నప్పుడు, మన చెమట గ్రంథులు చెమటను విడుదల చేస్తాయి, దాని ద్వారా శరీరం చల్లబడుతుంది.Dr Angelica Scott
చెమటతో పాటు, మన చర్మంలోని రక్త నాళాలు కూడా తెరుచుకుంటాయి, ఇది చర్మం ద్వారా వేడిని విడుదల చేయడానికి సహకరిస్తాయి.
వేడి వాతావరణంలో ‘హీట్ డిస్సిపేషన్’ అనే శారీరక ప్రక్రియ గురించి కూడా డాక్టర్ స్కాట్ ప్రస్తావించారు.
"మీ శరీరం లో ఉన్న వేడిని అన్ని వైపులకు తరలించడానికి ప్రయత్నిస్తుంది. ఇలా జరిగినప్పుడు, మీ చేతులకు మరియు కాళ్ళకు కూడా చెమటలు పడతాయి."
వేడి వల్ల చెమట మరియు చర్మం కందటం తో పాటు, వేగంగా నిస్సార శ్వాసను కూడా తీసుకుంటారని డాక్టర్ స్కాట్ వివరిస్తున్నారు. వేడి గాలి ‘సాధారణ’ఉష్ణోగ్రత గాలి కంటే ‘బరువుగా ‘ఉంటుంది.
వేడి వాతావరణంలో కుక్కలు ఎలా అయితే తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయో, వాటిలానే మనుషులకు జరుగుతుందని పోల్చి చెపుతున్నారు. "మనుషులు కూడా వేడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వేగంగా శ్వాసను తీసుకుంటారని చెప్పారు."
వేడి వల్ల ఈ సాధారణ లక్షణాలతో పాటు, వేడి సంబంధిత అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉందని, డాక్టర్ స్కాట్ హెచ్చరిస్తున్నారు.
వడ దెబ్బ తగిలితే అత్యవసర పరిస్థితి కి తీసుకుకెళ్లవలిసి వస్తుంది. వడదెబ్బ వల్ల వచ్చే లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా చెమటలు పట్టడం, బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, వికారం కలగడం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం, నాడి తక్కువగా కొట్టుకోవడం, గుండె ఎక్కువ కొట్టుకోవడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలను చూస్తారు. కొంతమంది కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోవచ్చు కూడా.Dr Angelica Scott
ప్రొఫెసర్ ఆన్ కస్ట్, చైర్ క్యాన్సర్ కౌన్సిల్ మాట్లాడుతూ వేడి వాతావరణం కు తగ్గట్టుగా మనం సిద్ధం కావాలని చెపుతున్నారు.
వాతావరణ మార్పుతో, ఆరుబయట సమయం గడపడం కష్టమవుతుంది. వాతావరణ మార్పుల వల్ల బుష్ ఫైర్స్ మరియు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయని చెపుతున్నారు.
వేసవి లో చల్లగా ఉండటానికి చిట్కాలు
వేడి రోజులలో అనారోగ్యాలను నివారించడానికి, డాక్టర్ స్కాట్ ఈ క్రింది సలహాలను పాటించమని సలహా ఇస్తున్నారు:
1. నీరు లేదా ఎలెక్ట్రోలైట్ ను ఎక్కువగా తాగడం.
ఎప్పుడు మీ దగ్గర నీళ్లు ఉంచుకునేలా చూసుకోండి. "కొన్నిసార్లు మనం తగినంత నీరు తాగుతామని అనుకుంటాము, కానీ అవి సరిపోవు. వాస్తవానికి మనం రోజుకు మూడు లీటర్ల నీరు త్రాగాలి." వేడి వేసవి రోజులో నీరు తాగాలి కానీ, ఇతర సోడాలు మరియు మద్యం వంటివి మంచివి కాదని డాక్టర్ స్కాట్ హెచ్చరిస్తున్నారు. దాహం వేస్తె ఒక సోడా తాగితే దాహం తీరుతుంది అనుకుంటాం కానీ, అందులో ఉండే ఎక్కువ చెక్కెర స్థాయిలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు. మీరు నీళ్లకు బదులుగా ఏమైనా వేరే రకమైన పానీయాలు ప్రయత్నించాలంటే స్పోర్ట్స్ డ్రింకులను తాగవచ్చు. అందులో ఉండే ఎలెక్ట్రోలైట్ శక్తి ని కూడా ఇస్తుంది.
2. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి.
వేడి వాతావరణంలో, ముఖ్యంగా పుచ్చకాయ మరియు దోసకాయ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తినడం మంచివి. డాక్టర్ స్కాట్ మాట్లాడుతూ, చల్లటి శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి తేలికపాటి మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. "చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది."

3. ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోండి: దుస్తులు, టోపీ , సన్ గ్లాసెస్ , సన్స్క్రీన్ మరియు నీడ
ఎమ్మా గ్లాసెన్ బరీ ప్రకారం, సన్స్ మార్ట్ గా ఉండాలి, వేడి నుండి మరియు UV కిరణాల నుండి రక్షించే ఐదు ముఖ్యమైన విషయాలను పాటించాలి.
ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోండి: వాతావరణానికి తగ్గట్టుగా దుస్తులు, టోపీ ను'ధరించడం, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, సన్స్క్రీన్ రాసుకోవడం మరియు నీడ ఉండే చోటుల్లో ఉండటం ముఖ్యమని గమనించాలి.
బీచ్ కు వెళ్ళేటప్పుడు కాని అసలు రోజువారీ దినచర్యలలో సన్స్క్రీన్ ను ఉపయోగించాలని గ్లాసెన్ బరీ చెప్పారు.
సన్ స్మార్ట్ విక్టోరియా కొత్త ప్రచారం ప్రకారం - ‘Don't let cancer in’ చర్మ క్యాన్సర్ ను నివారించడానికి మంచి సూర్యరశ్మి రక్షణను ఉపయోగించడం గురించిన ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. వారు మాట్లాడుతూ, మీరు కుక్కను బయటకు తీసుకువెళ్తున్నపుడు, తోటపని చేస్తుంటే, పెరటిలో పిల్లలను చూసుకుంటుంటే లేదా ఆరుబయట నడుస్తుంటే, కచ్చితంగా సన్స్క్రీన్ రాసుకొని వెళ్ళండి.
4. వాతావరణ పరిస్థితి ని బట్టి మరియు UV స్థాయిలపై బట్టి మీ పనులను నిర్దారించుకోండి.
బయటకి వెళ్ళే ముందు, ఆ రోజు వాతావరణ సూచనను తనిఖీ చేయాలని డాక్టర్ స్కాట్ సిఫారసు చేస్తున్నారు.
"ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని మీకు తెలిసినప్పుడు, వీలైతే బయట పనులకు వెళ్లకండి. సాధారణంగా, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాలు కాబట్టి ఆ సమయంలో బయట ఉండకుండా ప్రయత్నించండి.
అధిక UV రేడియేషన్ చర్మ క్యాన్సర్ కు ప్రధాన కారణం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఇతర దేశాలలో కంటే ఎక్కువ uv రేడియేషన్ ఉన్నందున, స్కిన్ కాన్సర్ బారిన ఎక్కువ పడుతుంటారు. ఇది మిగితా వారితో పోలిస్తే 2 వంతులు ఎక్కువగా ఉందని ప్రొఫెసర్ కాస్ట్ చెపుతున్నారు.
UV కిరణాల్ని మనం చూడలేము మరియు రోజు లో వేడి బట్టి అది ఎంత శాతం ఉన్నదో చెప్పలేమని ఆమె చెప్పారు
ఆస్ట్రేలియా లో వేసవి లో UV 12 నుండి 14 శాతం వరకు ఉంటుంది, అదే యూరప్ లో అత్యధికంగా 8 వరకే ఉంటుంది.

5.మీ శరీర పరిస్థితిని బట్టి అధిక శ్రమను నివారించండి.
డాక్టర్ స్కాట్ ప్రకారం, ఎండలో వ్యాయామం చేస్తే మీరు సులభంగా అలసిపోతారని తెలిస్తే, మీ శరీరానికి కొంచెం విరామం ఇస్తూ చేయడం మంచిది. మీ శరీరం ఎంతవరకు' తట్టుకోగలదో దాని బట్టి నిర్దారించుకోండి.
"కానీ మీరు నిజంగా సన్ బాత్, లేదా నడవడం, ఆరుబయట వ్యాయామం చేయాలనుకుంటే, మీ శరీర సంకేతాల పై దృష్టి పెట్టండి.
గ్లాసెన్ బరీ, డాక్టర్ స్కాట్ తో ఏకీభవిస్తూ, “మనకు చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు, పార్కులు ఉన్నాయి, కానీ చర్మ క్యాన్సర్ కు కారణమయ్యే కొన్ని తీవ్రమైన UV స్థాయిలు కూడా ఎక్కువ ఉన్నాయి. UV స్థాయి మూడు కంటే ఎక్కువ ఉన్నపుడు బయటకు కవర్ చేసుకొని వెళ్లేలా చూసుకోవాలి.
మీ ప్రాంతంలో UV స్థాయిల గురించి మరిన్ని విషయాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోండి.
మీరు ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ మరియు న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీని కూడా సందర్శించవచ్చు.









