Daycare కి పంపటం వల్ల అస్తమాను పిల్లలు sick అవుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసం!!

Australia Explained Childcare sicknesses

Early childhood edukesen hemi wan must long Ostrelea from hemi kivim ol parents taem blong go bak long wok. Credit: Hispanolistic/Getty Images

చిన్నప్పటి నుండే చైల్డ్¬కేర్¬ను ప్రారంభించాలనే నిర్ణయం మీ పిల్లలకు మరియు మీ కెరీర్¬కి ఉపయోగకరంగా ఉండవచ్చు . కానీ, ఈ విషయం అనేక కుటుంబాల జీవితాలను, ముఖ్యంగా కొత్త వలసదారులు లేదా మొదటిసారి తల్లిదండ్రులగా అయ్యే వారికి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. ఈ ఛాలెంజ్¬ను సమర్థవంతంగా నిర్వహించడానికి, కుటుంబాలను తగినంతగా రెడీ చేయడానికి ఇటీవల వచ్చిన వలసదారులు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో చూద్దాం ?


Key Points
  • తల్లిదండ్రులు తమ ఉద్యోగాలలో తిరిగి చేరటానికి చిన్న పిల్లలుగా ఉన్నపుడే త్వరగా చైల్డ్ కేర్ కు పంపాలని సిఫార్సు చేస్తున్నారు.
  • మొదటిసారి గా తల్లిద౦డ్రులు అయినవారు మరియు వలస వచ్చినవారు, పిల్లల తరచూ అనారోగ్యానికి గురికావడ౦ వల్ల ప్రత్యేక౦గా ఇబ్బందులకు గురవుతారు.
  • సెంటర్ లింక్ సబ్సిడీకి అర్హులు కాని కొంతమంది వలసదారులు, పిల్లల సంరక్షణ యొక్క పూర్తి ఖర్చును భరించాల్సి ఉంటుంది.
  • అనారోగ్యంతో ఉన్న పిల్లలను చైల్డ్ కేర్ కు పంపకపోవడం వల్ల ఇతర పిల్లల పట్ల మనం చూపించే కర్తవ్యం అవుతుంది.
ఆస్ట్రేలియాలో వలసదారుల కు కుటుంబ మద్దతు లేనందు వలన పిల్లలను చూసుకోవడానికి కష్టం అవుతుంది. ఉద్యోగం లో తిరిగి జాయిన్ అవటానికి ఆస్ట్రేలియాలో ముందస్తు గా చైల్డ్¬హుడ్ ఎడ్యుకేషన్ సిఫార్సు చేస్తున్నారు.

క్రమం తప్పకుండా చైల్డ్¬హుడ్ ఎడ్యుకేషన్ సదుపాయానికి హాజరు కావడం పసిపిల్లలు మరియు చిన్నారులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది మరియు వారిని సామాజికంగా మరియు విద్యాపరంగా పాఠశాలకు సిద్ధం చేస్తుంది.

ఏదేమైనా, శిశువులు మరియు పసిపిల్లలు బాల్య విద్యా సంస్థలలో వారి జీవితకాల అభ్యాస ప్రయాణాన్ని(lifelong journey of learning) ప్రారంభిస్తున్నప్పుడు, వారి మెదడు మాదిరిగానే, వారి రోగనిరోధక వ్యవస్థ (immune system) కూడా నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. 

ఇది ఇన్ఫెక్షన్¬ను గురి చేసే సూక్ష్మజీవులతో పరస్పర సహకారం పొందడం ప్రారంభిస్తుంది, దీనిని సాధారణంగా 'బగ్స్' అని పిలుస్తారు.
Australia Explained Childcare sicknesses
Doctors often recommend that most infections will subside without specific medical treatment.  Credit: The Good Brigade/Getty Images
ఎటువంటి మద్దతు లేకుండా, డేకేర్ నుండి తరచుగా అనారోగ్యాన్ని ఎదుర్కోవటానికి అనుభవం లేని మొదటిసారి తల్లిదండ్రులు అయ్యే వారికి ఇది ముఖ్యంగా ఛాలెంజింగ్¬గా ఉంటుంది మరియు భయాందోళనగా కూడా ఉండవచ్చు.

జ్యోతి సంధు మెల్బోర్న్¬లో చైల్డ్¬హుడ్ ఎడ్యుకేటర్.

తమ పిల్లలను చేర్పించే ముందు అక్కడి పరిస్థితుల పై అవగాహన కల్పించేందుకు తల్లిదండ్రులకు ఓరియెంటేషన్ సెషన్ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.
మన ఇల్లు చాలా సురక్షితమైన వాతావరణం, ఇక్కడ పిల్లలు ఒకరిద్దరు పెద్దవారికి మాత్రమే అలవాటు అవుతారు . కానీ డేకేర్ లో చిన్నతనంలోనే , పిల్లలు చాలా మంది ఇతర పిల్లలు మరియు పెద్దవారికి అలవాటు అవుతారు. వారికి ఏదో ఒక అనారోగ్యం రావడం చాలా సాధారణం.
Jyoti Sandhu
మెల్¬బోర్న్¬కు చెందిన GP డాక్టర్ అమీర్ సయీదుల్లా డేకేర్ నుండి ఇన్ఫెక్షన్లకు గురయ్యే చాలా మంది చిన్న పిల్లలను చూశారు.

“ఆరు నెలల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు మా దగ్గరికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. శీతాకాలంలో, వచ్చే అంటువ్యాధులు ఎగువ లేదా దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరియు ఒటైటిస్ మీడియా వంటివి మరియు వేసవికాలంలో వీటికి తోడు గ్యాస్ట్రో పేషెంట్లు ఎక్కువగా వస్తుంటారు.”

"డేకేర్¬కు వెళ్లే 100 మంది పిల్లలలో, 20-30 మంది తరచుగా ఈ ఇన్ఫెక్షన్లకు గురవుతారు" అని డాక్టర్ సయీదుల్లా వివరించారు.
Australia Explained Childcare sicknesses
New migrants often face extra challenges when their child becomes ill, due to lack of support network. Credit: MoMo Productions/Getty Images
తొలిసారి తల్లి అయిన నికితకు 18 నెలల బాబు ఉన్నాడు.

'మా బాబు వారానికి ఒకసారి చైల్డ్ కేర్ కి వెళ్తుంటాడు. ఇప్పటికే రెండు సార్లు ఫ్లూ వచ్చింది , దీనికి GP యాంటీబయాటిక్స్ మరియు స్టెరాయిడ్¬ను ఇచ్చారు , ఎందుకంటే పారాసిటమాల్ మరియు ఇబుప్రోఫెన్ చేయలేదు . చేతి-పాదాలు మరియు నోటి వ్యాధి కూడా బాబు కి వచ్చింది " అని ఆమె చెప్పారు.

వర్కింగ్ డే మధ్యలో పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్ నుంచి తీసుకెళ్లమని తల్లిదండ్రులను తీసుకెళ్ళమనడం చాలా కష్టమైన విషయమని చెప్పారు.

పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురైతే, యజమాని నుండి సెలవు అడగడం తల్లిదండ్రుల కు చాలా ఆందోళన కలించే విషయం.  
కొత్త వలసదారులు గా వచ్చిన మేము, పిల్లల సంరక్షణ సబ్సిడీకి అర్హులు కాదు మరియు పూర్తి ఖర్చును జేబు నుండి భరించాలి, ఇది మా విషయంలో రోజుకు $ 125. అనారోగ్యం కారణంగా పంపకపోతే, పూర్తి మొత్తాన్ని చెల్లించాలి , ఇది మరింత బాధించే విషయం.
Nikita


'ముక్కు కారడం వల్ల పిల్లలను ఇంటికి పంపడం సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫెక్షన్ యొక్క ఇతర లక్షణాలు ఉంటే, ఉదాహరణకు, జ్వరం, దగ్గు లేదా పెద్ద పిల్లలు గొంతు నొప్పి గురించి కంప్లయింట్ చేస్తే, లేదా బాబు సరిగ్గా కనిపించకపోతే, బాబును ఇంటికి పంపడానికి నేను సపోర్ట్ ఇస్తాను అని డాక్టర్ సయీదుల్లా వివరిస్తున్నారు.

హై-గ్రేడ్ ఉష్ణోగ్రత (సుమారు 39 - 40 డిగ్రీలు), ముక్కు కారటం, విరేచనాలు, వాంతులు లేదా ఏదైనా కొత్త దద్దుర్లను కలిగి ఉన్నప్పుడు ద్రవాన్ని తీసుకోవడం బాగా తగ్గడం అని, GP ద్వారా తప్పనిసరిగా పరిశోధించబడే ఇన్ఫెక్షన్ యొక్క ప్రమాదకర లక్షణాలను హైలైట్ చేశారు.

అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు ఇంట్లో ఉండటం ఎందుకు ముఖ్యమో సంధు వివరించారు.

"తల్లిదండ్రులు సెలవు తీసుకొని అనారోగ్యంతో ఉన్న బిడ్డతో కొన్ని రోజులపాటు ఉండాలని నాకు తెలుసు, కానీ ఇది పిల్లల శ్రేయస్సు కోసం... పిల్లలు చాలా అనారోగ్యానికి గురైతే, తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లవలసి ఉంటుంది మరియు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది" అని సంధు వివరించారు.

అనారోగ్యంతో ఉన్న పిల్లలను శిశు సంరక్షణ కేంద్రం నుండి మినహాయించడం వారి సదుపాయంలోని ఇతర పిల్లల పట్ల వారి బాధ్యతపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పారు.

తరచుగా చేతులను కడుక్కోవడం మరియు ఫ్లూ లేదా గ్యాస్ట్రోఎంటరైటీస్¬తో బాధపడుతున్న పిల్లల నుండి సురక్షితమైన దూరాన్ని పాటించడం మంచిది.

Australia Explained Childcare sicknesses
Frequent handwashing and keeping a safe distance from a child suffering from flu or gastro is advised.  Credit: Maskot/Getty Images/Maskot
పిల్లలకు మంచి పౌష్టికాహారం, సకాలంలో టీకాలు వేయడాన్ని డాక్టర్ సయీదుల్లా గట్టిగా సమర్థిస్తున్నారు.

"మమ్మల్ని చూడటానికి వచ్చే చాలా మంది పిల్లలు ఇనుము మరియు విటమిన్ డి లోపం వంటి పోషక లోపాలతో బాధపడుతున్నారు. కాబట్టి, వాటి పోషకాలను టాబ్లెట్ లేదా ద్రవం రూపంలో భర్తీ చేయడం వల్ల వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు అంటువ్యాధులు వచ్చే అవకాశాలను మరింత తగ్గిస్తుంది" అని ఆయన సలహా ఇస్తున్నారు.

'మరో విషయం చిన్నప్పుడు జరిగే వ్యాక్సినేషన్... వ్యాక్సినేషన్ జరిగిన పిల్లలకు మరియు కొన్ని వైద్య కారణాల వల్ల వాక్సినేషన్ లేని వారికి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి" అని ఆయన చెప్పారు.

ఆస్ట్రేలియాలోని చాలా ముందస్తు చైల్డ్¬హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్(బాల్య విద్యా కేంద్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్దేశించిన టీకాలను ఆమోదిస్తాయి.

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించకూడదని అనుకుంటారు. దాని చుట్టూ వేర్వేరు రెగ్యులేషన్స్, గైడ్¬లైన్స్ ఉన్నాయి. చైల్డ్¬కేర్ సర్వీస్¬లో అంటువ్యాధి ఉంటే, వ్యాక్సినేషన్ వేయని పిల్లల తల్లిదండ్రులు వారిని ఇంట్లోనే ఉంచాలని మేము సిఫార్సు చేస్తున్నాము ఎందుకంటే వారికి ఆ రోగనిరోధక శక్తి ఉండదని " అని సంధు చెప్పారు.

పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్లే సెంటర్లు వంటి ఇండోర్ సౌకర్యాల కంటే పార్కులు మరియు ఆటస్థలాలు వంటి సహజ వాతావరణాలకు అలవాటు/పరిచయం చేయాలని ఆమె గట్టిగా సూచిస్తుంది.

నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రచురించిన Staying Healthy హ్యాండ్¬బుక్ ఇన్ఫెక్షన్ నియంత్రణ మరియు అనారోగ్యాన్ని పర్యవేక్షించడానికి ముందస్తు చైల్డ్¬హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనుసరించాల్సిన ప్రోటోకాల్లను నిర్వచిస్తుంది.


Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service