Key Points
- వసతి కోసం చూస్తున్నప్పుడు ముందుగా మీ బడ్జెట్ మరియు జీవనశైలి బట్టి వెతకటం ప్రారంభించండి.
- విశ్వవిద్యాలయ నోటీసులుబోర్డులు మరియు సోషల్ మీడియా సైట్లలో మీ స్వంత భాషలో సహాయం కోరండి.
- మీ విశ్వవిద్యాలయం లేదా కళాశాల కు సమీపంలో విద్యార్థి వసతులను చూడండి.
- విశ్వవిద్యాలయ వసతి లో ఉండటం ద్వారా మీరు అక్కడ విషయాలను త్వరగా తెలుసుకొని సర్దుకోగలుగుతారు.
మీరు ఎక్కడ చదువుతారో నిర్ణయించుకుని నిర్దారించున్న వెంటనే, మీరు మీ బడ్జెట్, ఉండాలనుకునే చోటు, జీవన శైలికి తగినట్టుగా ఇల్లు వెతుక్కోవాలి.
Homestays
“ Home stays అంటే వసతి, ఇక్కడ విద్యార్థులు ఒక కుటుంబం తో ఉంటూ భోజనం వారు పెట్టి , వేరే గదిని ఏర్పాటు చేస్తారు ” అని ఆస్ట్రేలియా అధ్యయనం డైరెక్టర్ వోజ్టెక్ వావర్జిన్స్కీ వివరించారు. ఆయన కొత్తగా వచ్చిన విద్యార్థుల కు ఈ వసతి ని కల్పించడంలో తోడ్పరతారు.
“ఆస్ట్రేలియన్ కల్చర్ ను తెలుసుకోవాలనే విద్యార్థులు, చిన్న వయస్సు వారు, స్వతంత్రంగా జీవించలేని విద్యార్థులు ఇటువంటివి తీస్కుకోవచ్చు”
ప్రతి వారం సగటు ధర 350 డాలర్లు. ఆస్ట్రేలియా హోమస్టే నెట్ వర్క్, ఆస్ట్రేలియా స్టడీ వంటి విద్యార్థి మద్దతు సంస్థలు ద్వారా మీరు దీనికి ధరఖాస్తు చేసుకోవచ్చు.
Student accommodations
మరోవైపు, స్టూడెంట్ అకామిడేషన్ అంటే విద్యార్థుల కోసమే నడిపే వేరే వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఈ అపార్టుమెంట్ల అద్దెలొ అన్ని బిల్లులు కలిసే ఉంటాయి.
ఈ విద్యార్థుల అపార్టుమెంట్లు మాములుగా హై రైజింగ్ టవర్స్ లో, ప్రధాన విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు లేదా రవాణాకు
సమీపంలో ఉంటాయి. వీటిల్లో మీరు ఉండాలనుకుంటే,కాలేజీలకు సులభంగా అందుబాటులో ఉంటాయి. మీరు కాలేజీకు దగ్గరగా తక్కువ ప్రయాణం కావాలనుకే వారు, ఇటువంటి వాటిలో ఉండొచ్చు.
వీటి గురించి Wojtek, వివరిస్తూ, ఈ అపార్టుమెంట్లు బాగా మైంటైన్ చేస్తూ ఉంటారని , double room కి 280-300 డాలర్లు పడుతుందని మరియు సింగల్ రూమ్ కి 350 డాలర్లు వరకు పడుతుందని చెపుతున్నారు.
UniLodge, Campus Living Villages మరియు Student Housing Australia ద్వారా స్టూడెంట్ వసతిని ని వెతుకోవచ్చని చెపుతున్నారు.
ఆస్ట్రేలియా స్టడీ వంటి స్టూడెంట్ సపోర్ట్ ఏజెన్సీ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
బాంగ్లాదేశ్ నుండి సిడ్నీ కి చదువుకోవడానికి వచ్చిన ఎస్ ఎం అమినుల్ ఇస్లాం, మాట్లాడుతూ పెరిగి పోతున్న అద్దె రేట్లతో, ఇల్లు ఉంటె చాలు adjust అయిపోదాం అనే పరిస్థితి లో ఉన్నాం కానీ , మంచి ఇల్లు, అందులో సౌకర్యాలు అవేమి వారు చూసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.
తన అనుభవంతో, ఇల్లు కోసం చూస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసినట్టు తను చెప్పాడు.అతని తెలిసిన కాంటాక్ట్స్ బట్టి అమీనుల్ విద్యార్థులతో ఇంటి యజమానులు నంబర్స్ షేర్ చేసి సహాయం చేస్తున్నాడు.
చాలా మంది ఇంటి యజమానులు రెంట్స్ కి ఇవ్వడానికి విద్యార్థులు కోసం చూస్తున్నారు. అమినుల్ విద్యార్థులు తమ కాలేజీ నెట్ వర్క్ లోకి, సీట్ ఖరారు అయిన వెంటనే జాయిన్ అవ్వాలని ప్రోత్సహిస్తున్నాడు.
అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి భాష, కాబట్టి మీ స్వంత భాషలో సహాయం అడగడం చాలా అవసరమని తను అంటున్నాడు.

Share accommodation
ఒకసారి కొంచెం సెటిల్ అయిన తర్వాత, విద్యార్థులు సాధారణంగా ఖర్చులు తగ్గించుకోవడానికి , వేరే గా వాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి ఇల్లు తీసుకుందామని అనుకుంటారు
Flatmate Finders, Flatmates.com.au మరియు Gumtree ప్రముఖ వసతి వెబ్సైట్ల ద్వారా రూమ్మేట్స్ ను వెతకవచ్చు.
బాంగ్లాదేశ్ నుండి సిడ్నీ కి చదువుకోవడానికి వచ్చిన ఎస్ ఎం అమినుల్ ఇస్లాం, మాట్లాడుతూ పెరిగి పోతున్న అద్దె రేట్లతో, ఇల్లు దొరికితే చాలు సర్దుకు పోదాం అనే పరిస్థితి లో ఉన్నాం కానీ , మంచి ఇల్లు మరియు సౌకర్యాలు గురించి చూసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. తన అనుభవంతో, ఇల్లు కోసం చూస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసినట్టు తను చెప్పాడు.

University-owned accommodation
క్యాంపస్ సమీపంలో , మీరు అనేక విశ్వవిద్యాలయ అపార్టుమెంట్లు కూడా చూడవచ్చు. విశ్వవిద్యాలయ వసతులు , విద్యార్థులకు బాగా సపోర్ట్ మరియు సహాయం చేస్తాయి.
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కాన్బెర్రా లో Professor Sally Wheeler, మాట్లాడుతూ
మొదటిసారి ఆస్ట్రేలియా కి చదువుకోవడానికి వచ్చిన వారు కాలేజీ వసతుల్లో లో ఉండటమే మంచిదని చెపుతున్నారు.
రెసిడెన్షియల్ కళాశాలలో ఒక గదికి ఖర్చులు విశ్వవిద్యాలయాల మధ్య గణనీయంగా మారుతూ ఉంటాయి మరియు మీరు వారానికి $ 700 వరకు చెల్లించవచ్చు. ఏదేమైనా, ఈ ఖర్చు సాధారణంగా అన్ని రకాల సౌకర్యాలు మరియు సేవలను కవర్ చేస్తుందని గమనించడం చాలా అవసరం.
మీరు స్వతంత్రంగా గా ఉంటూ అన్ని సౌకర్యాలు కావాలనుకుంటే ఇదొక మంచి ఆప్షన్. ఆన్-కాంప్పస్ వసతి తో పాటు, కొన్ని విశ్వవిద్యాలయాలు ఆఫ్-కాంపస్ హౌసింగ్ కోసం కూడా సహాయం చేస్తాయి. ఈ వివరాలు ప్రస్తుత మరియు భవిష్యత్ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి, దీని వలన బయట వసతులు వెతుక్కోవడానికి ఉపయోగపడతాయి.

Further resources
Study Australia (Australian Government)





