అసలు జ్వరం వచ్చినపుడు అది బాక్ట్రయల్ లేక వైరల్ ఇన్ఫెక్షన్ న అని తెలుసు కోవాలి. ఎన్ని రోజులు ఇంట్లో వైద్యం సరిపోతుంది అన్న విషయాలను శ్రీకృతి బచ్చు తో మాట్లాడి తెలుసుకుందాం. తను ఫస్ట్ జనరేషన్ తెలుగు అమ్మాయి. న్యూజిలాండ్ లో పుట్టి, ఆస్ట్రేలియా లో చదువుకొని తెలుగు చక్కగా మాట్లాడుతొంది. జేమ్స్ కుక్ యూనివర్సిటీ లో మెడిసిన్ చేసి, ఇప్పుడు బ్రిస్బేన్ లో క్వీన్స్ లాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో గత ఒక సంవత్సరంగా పని చేస్తుంది. Emergency Department లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న తను, చూసిన చాలా కేసుల ఆధారంగా మరియు అనుభవం తో పిల్లలో జ్వరం గురించి మరిన్ని విషయాలను తెలియజేశారు. పిల్లల లో జ్వరం గురించి మరిన్ని విషయాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోండి. https://www.rch.org.au/kidsinfo/fact_sheets/fever_in_children/
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.