10 దక్షిణాసియా భాషల్లో వార్తలు, కరెంట్ అఫైర్స్, వినోదం, కమ్యూనిటీ కథలతో పాటు పాటలు మరియు యూట్యూబ్ ఛానెల్ తో సహా సరికొత్తగా మీ ముందుకు తీసుకువచ్చారు. దక్షిణాసియా ఆస్ట్రేలియా ప్రేక్షకుల కోసం 24/7 వార్తలతో పాటు వినూత్న కార్యక్రమాలను అందిస్తున్నారు.
ప్రసుతం ప్రసారమవుతున్ను బంగ్లా, గుజరాతీ, హిందీ, నేపాలీ, మలయాళం, పంజాబీ, సింహళ, తమిళం మరియు ఉర్దూ భాషల కార్యక్రమాలతో పాటు, అన్ని బాలీవుడ్ (హిందీ), భాంగ్రా (పంజాబీ) మరియు నేపాలీ హిట్స్ ఇప్పుడు జత చేసారు. గత సంవత్సరం ప్రారంభించిన తెలుగు భాషా కార్యక్రమమాలను శీర్షికల రూపేణా వెబ్‌సైట్ లో మరియు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అందిస్తున్నారు.
దక్షిణ ఆసియా నుండి 1.5 మిలియన్లకు పైగా ప్రజలు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. "పెరుగుతున్న దక్షిణ ఆసియా ప్రజలకు, సమకాలీన ఆస్ట్రేలియన్ సమాచారాన్ని అందించడానికి SBS ఎంతో ఉపయోగపడుతుందని , ” SBS సౌత్ ఏషియన్ ప్రోగ్రామ్ మేనేజర్ మన్ప్రీత్ కౌర్ సింగ్ అన్నారు.
SBS దక్షిణాసియా భాషా కార్యక్రమాలు ప్రతి రోజు 11:00AM నుండి 6:00 PM వరకు మరియు వారాంతాల్లో 5:00PM నుండి 6:00PM వరకు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
DAB, డిజిటల్ TV (ఛానల్ 305), యూట్యూబ్ ఛానెల్, అలాగే SBS ఆడియో యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా లైవ్ రేడియో కూడా అందుబాటులొ ఉంటుంది. మీరు మెచ్చే దక్షిణాసియా పాటలను కూడా ఇతర సమయాల్లో ప్రసారం చేయనున్నారు.
Language | Day and time |
Bangla | Monday & Thursday 3:00PM |
Gujarati | Wednesday & Friday 2:00PM |
Hindi | Monday to Sunday 5:00PM |
Malayalam | Thursday & Friday 1:00PM |
Nepali | Tuesday & Thursday 2:00PM |
Punjabi | Monday to Friday 4:00PM |
Sinhala | Monday, Tuesday, Thursday & Friday 11:00AM |
Tamil | Monday, Wednesday, Thursday & Friday 12:00PM |
Urdu | Wednesday & Friday 3:00pm |
ప్రతి SBS భాషా కార్యక్రమానికి ద్విభాషా వెబ్‌సైట్ మరియు ఫేస్బుక్ పేజీల ద్వారా శీర్షికలు మరియు సమాచారాన్ని అందిస్తున్నారు. మీరు శీర్షికలను SBS ఆడియో ద్వారా కూడా వినవచ్చును.