ఆమె మౌంట్ పొల్లాక్ రోడ్‌లో ఉంటున్నట్లుగా, చైతన్య మధగని (శ్వేత ) గా గుర్తించారు. మిర్కా వే, పాయింట్ కుక్‌లో, వారి ఇంటి వద్ద నేరానికి పాల్పడ్డ దృశ్యాలను గుర్తించారు. రెండింటికి సంబంధం ఉన్నట్టుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు. దీనిపై ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. TAAI కమ్యూనిటీ ప్రెసిడెంట్ చక్రి చెయనం, దీనిపై స్పందిస్తూ, తెలుగు కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
నందిని బిస్కుండా, ఉమెన్స్ నెట్వర్క్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ , కుటుంబ హింస మరియు గృహ హింసతో ఇబ్బంది పడుతున్న వారికీ తప్పకుండా సహాయం చేస్తామని వారు బయటికి రావాలని , కమ్యూనిటీ కు వారు స్వచ్ఛందంగా సహాయపడుతున్నట్లు తెలిపారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.