Telstra మరియు YouGov కలిసి చేసిన పరిశోధనలో మూడు వంతుల మంది ఆస్ట్రేలియన్లు వివిధ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నారని చెపుతున్నారు .
దాదాపు సగం మంది (46 శాతం) ఆస్ట్రేలియన్లు పుట్టిన తేదీలు, పెంపుడు జంతువుల పేర్లు మరియు వారికి ఇష్టమైన క్రీడా జట్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటివి తరుచూ అందరు ఎక్కువగా వాడేవని మరియు సులభంగా ఉహించగలిగేవని నిపుణులు అంటున్నారు .
స్కామ్ కాల్‌లు మరియు సైబర్ ఉల్లంఘనలు పెరుగుతున్న క్రమంలో, ఇలాంటి ఊహించే password లు పెట్టడం ప్రమాదకరమని టెల్‌స్ట్రా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డారెన్ పౌలీ చెప్పారు.
SBS తెలుగు డిజిటల్ రేడియో ద్వారా పోడ్కాస్ట్ లు మరియు రోజు న్యూస్ వినవచ్చును . 'SBS ఆడియో ' యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేస్కోండి.