Key Points
- బొటానికల్ గార్డెన్స్ వంటి పెద్ద ప్రదేశాలు మినహా చాలా సిటీ పార్కులు సిటీ కౌన్సిల్¬ల యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ కిందకు వస్తాయి.
- పార్కులలో వాణిజ్య పరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి కండీషన్లు అప్లై అవుతాయి, తరచుగా కౌన్సిల్ అప్రూవల్ అవసరం, మరియు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇతర సందర్శకుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మరియు కమ్యూనిటీ అవసరాల పట్ల శ్రద్ధ వహించడం అనేది పార్కు మర్యాదను తెలిపే ముఖ్యమైన నియమం.
ఆస్ట్రేలియన్లు సిటీ పార్కులను ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి దేశవ్యాప్తంగా 50 వేలకు పైగా ఉన్నాయి.
ఈ పార్కులు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. కొంతమంది డాగ్ వాకింగ్ చేస్తారు ఇంకొంతమంది పార్కులలో వ్యాయామం చేస్తుంటారు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, కొంతమంది స్నేహితులు కలుసుకోవడానికి , పిక్నిక్¬లు, బార్బెక్యూలు మరియు పుట్టినరోజు పండుగలకు ఉపయోగపడతాయి.
సామి డొమిన్సన్ కు ఇద్దరు పిల్లల తల్లి మరియు కమ్యూనిటీ లోని కుటుంబాల కు ఉచిత విహారయాత్రల సిఫార్సులను చేస్తూ ఉంటారు. Mamma Knows Melbourne అనే వెబ్సైటు యొక్క కో-డైరెక్టర్ కూడా. ఆమె నగరంలోని అన్ని పచ్చని ప్రదేశాల తో నిండిన పార్కులను చూసారు. అందరు బయటకి వెళ్లాలనుకుంటూ ఉంటారని మరియు కొంచెం ఫన్¬గా గడపాలని కోరుకుంటారు. ప్రతిసారీ అన్నిటి పైన డబ్బులు ఖర్చుపెట్టకుండా ఉచితంగా ఉండేలా చూస్తుంటారని ఆమె తెలిపారు.
ఇంకా అప్పుడప్పుడూ, పార్కులు ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు తెలుసుకోవాలనుకునే మొదటి విషయం , ఫ్రెండ్స్ కమ్యూనిటీని కనుగొనడానికి మరియు లోకల్ ఏరియా గురించి కొంత సమాచారం తెలుసుకోవడానికి ఇదొక మంచి చోటని " తెలిపారు.

సిటీ ఆఫ్ సిడ్నీ కౌన్సిల్లోని గ్రీనింగ్ అండ్ లీజర్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తున్న జోయెల్ జాన్సన్ ప్రకారం, ఒక్క సిడ్నీలోనే 400 పబ్లిక్ పార్కులు ఉన్నాయి. వీటిలో పాకెట్ పార్కులు మరియు సబర్బన్ రిజర్వ్ల నుండి హెరిటేజ్-లిస్టెడ్ గార్డెన్ల వరకు ఉన్నాయి.
కొన్ని పార్కులు మరియు బహిరంగ ప్రదేశాలకు మాకు భాగస్వామ్య బాధ్యత ఉంది , ఉదాహరణకు కొన్ని ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం లేదా ట్రస్టులు నిర్వహిస్తూ ఉంటాయి.
కానీ చాలా వరకు పార్కులు సిటీ ఓనర్ లేదా క్రౌన్ రిజర్వ్ మేనేజర్ లేదా ట్రస్ట్ మేనేజర్ ద్వారా నిర్వహించబడతాయి.
కొన్ని పార్కులలో క్యాంపింగ్ మరియు వాహనాల ఎంట్రీపై బ్యాన్ వంటి కొన్ని విస్తృత నిబంధనలు ఉన్నపటికీ, ప్రతి స్థానిక ప్రభుత్వ ప్రాంతం దాని స్వంత ప్రత్యేకమైన నియమనిబంధనలను కలిగి ఉంటుందని గమనించడం ముఖ్యం.
"ఆ స్థానిక ప్రభుత్వ ఏరియాలో వివిధ సమస్యలు లేదా సంఘటనలు జరగవచ్చు. కాబట్టి, మీ లోకల్ కౌన్సిల్తో సంప్రదించడం చాలా ముఖ్యం" అని జాన్సన్ చెప్పారు.

కొన్నిసార్లు, ఒకే స్థానిక ప్రభుత్వం లో ఉన్న పార్కులకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి.
"ఉన్న 400 పార్కులలో [సిడ్నీ సిటీలో], మీరు మీ కుక్కలను పట్టీ లేకుండా తెసుకెళ్లగలిగేవి (dog off leash ) 50 మాత్రమే ఉన్నాయి, కానీ పెద్ద పార్కులను ఆఫ్-లీష్గా నిర్ణయించారు , అంటే పార్క్ ఏరియా 50 శాతానికి పైగా కుక్కలు తిరిగేలా ఉంటాయి."
మిసెస్ డోబిన్సన్ వివరిస్తూ , ఆఫ్-లీష్ పార్కులలో కూడా, ఆట స్థలానికి దగ్గరలో ఉన్నప్పుడు మీ కుక్కను కట్టివేసి ఉంచడం చాలా అవసరం అని చెపుతున్నారు.
"నేను కొన్నిసార్లు చూసిన ఒక విషయం ఏమిటంటే, ప్రజలు తమ కుక్కలను ప్లే గ్రౌండ్¬కు తీసుకుని వస్తారు మరియు కొంత మంది పిల్లలకు కుక్కలంటే భయం అయిఉండొచ్చు . కాబట్టి, ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచవలసిన విషయం అని ఆమె చెప్పారు.
పార్కు, ఆట స్థలాల నియమాలకొస్తే , చాలా అంశాలు మనం సహజంగా పాటించాల్సినవే ఉంటాయని డోబిన్సన్ చెప్పారు.
"వీలైతే మీ చెత్తను మీతో తీసుకెళ్లడం, లేదా అక్కడ ఉండే చెత్త బుట్టను ఉపయోగించడం, మీరు బయలుదేరే ముందు శుభ్రం చేయడం, పిల్లలు వాళ్లకు తగిన ఆట వస్తువులతోనే ఆడేలా చూసుకోవడం చేయాలని తెలిపారు.”
మీ పిల్లల బర్త్ డే పార్టీకి ఆతిథ్యం ఇవ్వడానికి మీరు స్థానిక పార్కును ఎంచుకున్నప్పుడు, 'ఇతరుల గురించి ఆలోచించి ఇబ్బంది కలగకుండా పనులు చేసుకోవాలి.
మీరు మాట్లాడుతున్నప్పుడు చేసే శబ్దం కాని పాటలు పెట్టె శబ్దం గురించి జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ వద్ద ఉన్న అతిపెద్ద బూమ్బాక్స్¬ను తీసుకురావడం లేదని నిర్ధారించుకోవాలి మరియు పిల్లల పరంగా విషయాలను అదుపులో ఉంచుకోవాలి. అన్ని స్ట్రీమర్లు మరియు పార్టీ స్టఫ్ను (ఒకవేళ మీరు అక్కడ అలంకరిస్తున్నట్లైతే ) మీతో ఇంటికి తీసుకెళ్లాలి.

పార్కులలో నిర్వహించే ఈవెంట్/కార్యకలాపాలు కోసం అనుమతి తీసుకోవాలా?
పెళ్లిళ్లు మరియు సంవత్సరం చివరి లో చేసుకునే పార్టీల వంటి వాటికి అంటే ఎక్కువ మంది హాజరు అయ్యేవాటికి బుకింగ్ లేదా పర్మిట్ అవసరం కావచ్చు. వ్యాపార సంబంధ కార్యకలాపాలకు కూడా ఇది వర్తిస్తుందని సిడ్నీ సిటీకి చెందిన జాన్సన్ వివరించారు.
మీరు వస్తువులను అమ్మాలనుకున్న లేదా చాలా పెద్ద షో లు పెట్టాలన్న లేదా వ్యాపార సంబంధమైన వాటి వల్ల చూపే విషయాల పై సాధారణంగా ఆమోదం కావాలి.Joel Johnson
పార్కులలో ఫిట్నెస్ లేదా వెల్నెస్ తరగతులు నిర్వహించే ప్రొఫెషనల్ ట్రైనర్లు సిటీ కౌన్సిల్ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది మరియు కొన్ని సందర్భాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Scott Hunt Fitness Enhancement వ్యవస్థాపకుడు మరియు CEO, ఇది మూడు రాష్ట్రాల్లో అవుట్¬డోర్ ఫిట్నెస్ ట్రైనింగ్ సెషన్లలో ప్రత్యేకత కలిగిన పర్సనల్ ట్రైనింగ్ బిజినెస్ నడుపుతున్నారు.
బ్రిస్బేన్ సిటీలో పర్మిట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఆయన వివరిస్తున్నారు:
"మీరు ఒకేసారి 10 మంది కంటే తక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తే, మీకు అనుమతి అవసరం, కానీ అది ఉచితమే . బూట్ క్యాంప్ వంటి వాటిల్లో 10 మంది కంటే ఎక్కువ మందితో కూడిన గ్రూప్ ఉంటే పర్మిట్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రజల హెల్త్ మరియు సేఫ్టీ స్టాండర్డ్స్¬ను దృష్టిలోకి తీసుకోవడం వల్లనే పార్కుల లోపల వ్యాపార కార్యకలాపాలను కౌన్సిల్ నియంత్రించడానికి ముఖ్యమైన కారణం.
"మీకు పర్మిట్ అవసరమని వారు చెప్పడంలో గొప్ప విషయం ఏమిటంటే, పార్కుల్లో పనిచేసే పర్సనల్ ట్రైనర్స్ నిజానికి అర్హత మరియు భీమా కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి ఇది వారికి సహాయపడుతుంది."
ఏదేమైనా, వినోద ప్రాతిపదికన పార్కులో ఎక్సర్సైజ్ చేయడానికి ఒక గ్రూప్ గుమిగూడుతుంటే ఈ కండిషన్స్ వర్తించవు.
"మీరు మరియు మీతోటివారు, మీ గ్రూప్ లేదా మీ సహచరులతో పార్కులో వ్యాయామం చేస్తుంటే, అది లాభాపేక్ష లేని విషయం అయితే, ఎటువంటి ఆంక్షలు లేవు. మన పార్కులు అందరికోసం, అందుకే గా మనం పన్నులు కడుతున్నది.

పార్కు నిబంధనలు సాధారణ ప్రజలకు మరియు వ్యాపార యజమానులకు అర్థమయ్యేలా స్పష్టంగా ఉంటాయని మిస్టర్ హంట్ చెప్పారు. ఏదేమైనా, అనిశ్చితి ఉన్న సందర్భాల్లో, మర్యాదపూర్వకమైన మరియు పరిగణనాత్మక విధానాన్ని అవలంబించడం ఎల్లప్పుడూ తెలివైన పనని తెలిపారు.
అసలు కౌన్సిల్ దేనిపై చర్యలను చేపడుతుంది అంటే ఫిర్యాదులపై మాత్రమే. వాటిపైనే చర్యలు తీసుకుంటారు. మీరు కమ్యూనిటీని ఇబ్బంది పెట్టకపోతే, అసలు సమస్యే ఉండదని తెలిపారు.Scott Hunt
" సాధారణ మర్యాద మరియు గౌరవం కలిగి ఉండండి, ఇది కమ్యూనిటీ పార్కు అని గుర్తించి మసలుకోండి ."
మీ పార్కు లో BBQ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారా?
పార్క్ నియమాలు సూటిగా ఉంటాయి , మనం ఇతరులకు గౌరవం ఇస్తూ మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు :
- సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వండి: మీరు మీ స్వంత పోర్టబుల్ BBQ ను తీసుకురావాలని అనుకున్నట్లయితే, ఇది మీ ప్రాంతంలో అనుమతించబడుతుందో లేదో మొదట ధృవీకరించడం చాలా ముఖ్యం.
- పరిశుభ్రత పాటించండి: కౌన్సిల్¬లు BBQ ప్లేట్లను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ, తరువాతి వినియోగదారుని పరిగణనలోకి తీసుకొని, మరింత శుభ్రంగా ఉంచడం మర్యాదపూర్వక పని.
- షేరింగ్ ఈజ్ కేరింగ్:"ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్" సూత్రం సాధారణంగా బయటి ప్రదేశాలలో వర్తిస్తుంది, కానీ చాలా పార్కులు బహుళ షేడ్ పిక్నిక్ ప్రాంతాలు మరియు హాట్ ప్లేట్లను అందిస్తాయి, ఇది ప్రతి ఒక్కరికీ తగినంత లభ్యతను ఉండేలా చూస్తుంది.
మీ రాష్ట్రం లేదా భూభాగంలో అగ్ని ప్రమాద హెచ్చరికలు మరియు నిషేధాల గురించి ఈ క్రింది వాటి ద్వారా సమాచారం పొందండి.
New South Wales Fire Danger Ratings
Queensland Fire Danger Ratings
Western Australia Fire Danger Ratings
South Australia Fire Danger Ratings








