అలాంటిది, మెల్బోర్న్ కి చెందిన పవన్ జంకకుండా తన సమయస్ఫూర్తితో ప్రాణాలకు తెగించి పెట్రోల్ బంకు అగ్ని ప్రమాదాన్ని నివారించాడు. పవన్ శ్రీకాకుళం జిల్లా గార మండలం సిలగం నుండి ఆస్ట్రేలియాకి చదువుకోవడానికి 8 నెలలు క్రితం వచ్చాడు.
ఫిబ్రవరి 11 వ తారీఖున, ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో రాత్రి భోజనం కోసం పవన్ రెడ్డి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అకస్మాత్తుగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ బంకుకు నిప్పంటించి పారిపోగా, అక్కడి ఉన్న సిబ్బంది మరియు వచ్చిన కొనుగోలుదారులు తృటిలో తప్పించుకు పారిపోయారు. మంటలు వ్యాపించడం గమనించిన పవన్ రెడ్డి హుటాహుటిన- అక్కడ ఉన్న అగ్నిమాపక పరికరాన్ని తీసుకొని ప్రమాదాన్ని ఆపగలిగాడు. అత్యవసర సేవలు వారు మరియు పోలీసులు హాజరుకాగా, పవన్ రెడ్డి చూపించిన తెగువను కొనియాడారు.
పవన్ మాట్లాడుతూ "నాన్న చిన్నప్పుడే చనిపోయినా, అమ్మ మంగ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తూ కష్టపడి ఇద్దరిని చదివిస్తున్నారని చెప్పారు" . మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.