Key Points
- ఆస్ట్రేలియన్లు వారసత్వ పన్ను చెల్లించరు.
- ఎగ్జిక్యూటర్ ను వారసత్వ పనులకు నియమిస్తారు.
- వీలునామా ఉంటే వారసత్వం చాలా సులభం. లేదంటే కోర్టుకు వెళ్లవలిసి ఉంటుంది.
"ఎవరైనా చనిపోయినప్పుడు, వారు సంపాదించిన ఆస్తి, వారి కుటుంబానికి, స్నేహితులకు, లేదా సంస్థలకు చెందేలా ఉంటుంది.
"ఇళ్లు, బ్యాంకు ఖాతాలు, కార్లు, షేర్లు లేదా గృహోపకరణాలు వంటివి ఉండవచ్చు, లేదా సెంటిమెంట్ విలువ కలిగిన వస్తువులు కూడా అయిఉండవచ్చు ," అని విక్టోరియా ట్రస్టీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ మెలిస్సా రెయినాల్డ్ వివరించారు.
"ఆస్తిని ప్రత్యేకంగా బహుమతిగా కూడా ఇవ్వవచ్చు - నేను నా కారుని A వ్యక్తికి ఇస్తాను. లేదా నాకు నచ్చినవారికి $10,000 మొత్తాన్ని ఇవ్వొచ్చు, అది వారసత్వంగా పరిగణలోకి వస్తుంది. లేదా ఆస్తిని మొత్తం సాధారణంగా ఎవరికైనా రాసివ్వచ్చు. ఉదాహరణకు, నేను నా ఎస్టేట్ మొత్తాన్ని నా పిల్లలకు వదిలివేస్తాను" అని వీలునామా రాయవచ్చు.
ఎగ్జిక్యూటర్ అంటే ఎవరు?
వీలునామా అంటే వారి మరణానంతరం ఆస్తిని ఎలా పంచాలనుకుంటున్నారో అన్న విషయాన్నీ వివరించే పత్రం.
వీలునామాలో, ఎగ్జిక్యూటర్ అని పిలువబడే ఒక చట్టపరమైన సంస్థ యొక్క వ్యక్తి , ఆస్తి యొక్క ట్రస్టీగా వ్యవహరించడానికి నియమించబడతాడు. మరణించినవారి కోరికలను నెరవేర్చడం మరియు అన్ని బాధ్యతలను నిర్వర్తించడం అయన బాధ్యత.
ఎగ్జిక్యూటర్ కూడా లబ్ధిదారుడు కావచ్చు.
ఫిలిప్పీన్స్ మరియు ఆస్ట్రేలియా రెండింటిలోనూ లా ప్రాక్టీస్ చేసిన ఫ్లోరంటే అబాద్, ఎగ్జిక్యూటర్ నియమించని సందర్భాల్లో, కోర్టులు జోక్యం చేసుకోవలసి ఉంటుందని చెప్పారు.
"దరఖాస్తుదారున్ని ట్రస్టీ లేదా అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు" అని మిస్టర్ అబాద్ చెప్పారు.
"కాబట్టి ఎగ్జిక్యూటర్ వీలునామాలో నియమించబడిన ధర్మకర్త, మరియు ఆడ్మినిస్ట్రేటర్ కోర్టుచే నియమించబడిన ధర్మకర్త."
మీరు ఎగ్జిక్యూటర్ గా నియమితులైనప్పటికీ, మీరు విధులను నిర్వహించలేరని భావిస్తే, మీ తరపున పని చేయడానికి మీరు రాష్ట్ర ధర్మకర్తలకు అధికారం ఇవ్వవచ్చు. ప్రభుత్వ ఏజెన్సీ అందుకు సహాయం చేస్తుంది.
ఎగ్జిక్యూటర్ లేదా అడ్మినిస్ట్రేటర్ తప్పనిసరిగా లబ్ధిదారులను సంప్రదించి, 'ప్రోబేట్' కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ప్రొబేట్ అనేది విల్లు ను చెల్లుబాటు చేసే కోర్టు ఆర్డర్ మరియు ఎస్టేట్‌ను నిర్వహించడానికి ఎగ్జిక్యూటర్ కు అనుమతిని ఇస్తుంది.
సుప్రీం కోర్ట్ ప్రొబేట్ కోసం దరఖాస్తులను నమోదు చేస్తుంది. మీరు మీ ప్రాంతంలో సుప్రీం కోర్ట్ ప్రొబేట్ రిజిస్ట్రీని చూడవచ్చు.
విల్లు లేకపోతే ఎవరు వారసులవుతారు?
"ఒక వ్యక్తి వీలునామా లేకుండా చనిపోయినప్పుడు, దీనిని డైయింగ్ 'ఇంటెస్టేట్' అంటారు," అని మెలిస్సా రేనాల్డ్స్ వివరిస్తున్నారు.
"ఆస్తి వారికి చెందె అర్హత ఉన్నట్లు భావిస్తే ప్రొబేట్ మంజూరు కోసం కోర్టుకు దరఖాస్తును దాఖలు చేయవచ్చు లేదా ఆస్తిని నిర్వహించడానికి పబ్లిక్ ట్రస్టీకి అధికారం ఇవ్వొచ్చు."
వీలునామా లేకుండా ఆస్తులను పంపిణీ చేయడానికి ఉపయోగించే చట్టాన్ని వారసత్వ చట్టం అంటారు.చాలా ఆస్తులు సాధారణంగా భాగస్వామికి, మిగిలినవి పిల్లలకు వెళ్తాయి.
జీవిత భాగస్వామి ఉన్నప్పుడు మరియు పిల్లలు లేనప్పుడు, ఆస్తి భాగస్వామికి వెళుతుంది. భాగస్వామి లేదా పిల్లలు లేనప్పుడు, సంబంధిత చట్టంలో పేర్కొన్న విధంగా తదుపరి దగ్గరి బంధువుకు వెళుతుంది.
వారసత్వంగా ఎవరూ లేకపోతే, ఆస్తి రాష్ట్రానికి చెందుతుంది.

ఎటువంటి టాక్స్ నాకు వారసుడిగా వర్తిస్తుంది?
ఆస్ట్రేలియన్లు వారసత్వ పన్ను చెల్లించరు, కానీ ఇతర ఆర్థిక బాధ్యతలు మాత్రం తెలుసుకోవాలి.
మీరు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయిస్తే ATO పన్ను నియమాలు వర్తిస్తాయి.
అక్రమ్ ఎల్-ఫహ్క్రి, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. "మరణించిన వారి ఇంటికి కానీ ఆస్తికి కాని ఎటువంటి పన్నులు ఉండవు" అని అతను వివరించాడు.
వారసత్వంగా వచ్చిన రెసిడెన్షియల్ ప్రాపర్టీని రెండేళ్లలోపు విక్రయించినట్లయితే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (CGT) మినహాయింపు ఉంది, కాబట్టి ప్రొఫెషనల్ సలహా తీసుకోవడం ఉత్తమం.
నగదుగా మార్చబడిన షేర్లు కూడా CGT వర్తిస్తుంది మరియు నగదు వారసత్వం నుండి ఏదైనా బ్యాంకు వడ్డీని తప్పనిసరిగా మీ పన్ను రిటర్న్‌పై ప్రకటించాలి.
విదేశీ ఆస్తి వారసత్వం గా వస్తే?
విదేశీ ఆస్తికి కూడా అదే రెండేళ్ల సమయం వర్తిస్తుంది.
"ఇది ఆ రెండు సంవత్సరాల వ్యవధిలో విక్రయించబడి, ఆపై డబ్బు ఆస్ట్రేలియాకు వచ్చినట్లయితే, దాన్ని రుజువు చూపించి ఆస్ట్రేలియన్ నిబంధనలలోకి వస్తుంది మరియు దానికి పన్ను ఉండదు" అని మిస్టర్ ఎల్-ఫహ్క్రి చెప్పారు.
"అది అమ్మబడిన దేశంలో వేరే పన్ను చట్టాలు ఉంటే మాత్రం, సమస్య ఉంటుంది. అప్పుడు ఆ దేశపు పన్ను విధానం ద్వారా లావాదేవీలను చేయాలి."
మీరు నాన్ రెసిడెంట్ అయితే ప్రత్యేక CGT నియమాలు వర్తిస్తాయి, కాబట్టి సలహా తీసుకోవడం ఉత్తమం.

నేను వారసత్వాన్ని సవాలు చేయవచ్చా?
మీరు వారసత్వానికి అర్హులని అనుకుంటే, కానీ వీలునామాలో మీ పేరు లేకుంటే లేదా వీలునామా లేకుంటే, వారసత్వ చట్టం ప్రకారం వారసత్వాన్ని సవాలు చేసే హక్కు మీకు ఉంటుంది. దీనిని పబ్లిక్ ఫ్యామిలీ ప్రొవిజన్ క్లెయిమ్ అంటారు.
సుప్రీం కోర్ట్ కు వీలునామా అవసరమైతే మారుస్తుంది.
అయితే, వారు అనుకుంటే వారసత్వానికి అర్హులు కారు . మీరు మీ దావాను సమర్ధించుకోగలగాలి , అని మిస్టర్ అబాద్ చెప్పారు.
మరణించిన వ్యక్తి లేనందున మీరు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూపించగలగాలి. దీనికి ప్రత్యేకంగా నియమాలేమి లేవు, కానీ సుప్రీం కోర్ట్ మీ దావా చుట్టూ ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది.Florante Abad








