RMIT యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ మెలిస్సా వీలర్ పనిచేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ ఫ్లెక్సిబుల్ మరియు హైబ్రిడ్ మోడల్స్ 2020 కి మునుపే ప్రణాళికల్లో ఉన్నాయి, అయితే COVID-19 లాక్‌డౌన్‌లు దానిని పూర్తి తరహా లో బయటకు తీసుకొచ్చాయి అని ఆమె చెప్పారు. అలా అనుకూలమైన పని విధానాలు కల్పించకపోతే ఉద్యోగస్థులు కంపెనీ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది కూడా అని ఆమె గట్టిగా చెబుతున్నారు.
అంగవైకల్యం ఉన్నవారు, గ్రామీణ ప్రజలు, మరియు చంటి పిల్లలు ఉన్న కుటుంబాలతో సహా ఆస్ట్రేలియా అంతటా విభిన్న అవసరాలు ఉన్న వ్యక్తులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ విధానాలు అనుకూలంగా ఉంటాయని డాక్టర్ వీలర్ చెప్పారు. అనుకూలమైన పని విధానాలు అనేవి యజమానులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని అని స్విన్‌బర్న్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ హాప్‌కిన్స్ అన్నారు.
మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.