Key Points
- పరీక్ష కోసం మీరు తెలుసుకోవలసిన అన్ని అంశాలను అధికారిక సిటిజన్¬షిప్ టెస్ట్ రిసోర్స్ బుక్ లో తెలుసుకోవచ్చు.
- పరీక్ష ఇంగ్షీషులో ఉంటుంది, కాబట్టి మీరు తప్పనిసరిగా భాషను బాగా అర్థం చేసుకోవాలి.
- అనేక స్థానిక కమ్యూనిటీ సంస్థలు పరీక్షకు సిద్ధం అవడంలో సహాయపడటానికి పౌరసత్వ పరీక్ష ప్రిపరేషన్ తరగతులు మరియు వనరులను అందిస్తాయి.
ఆస్ట్రేలియా వైవిధ్యభరితమైన మరియు బహుళ సాంస్కృతిక దేశం, ఇందులో 270 కంటే ఎక్కువమంది పూర్వీకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇది ప్రపంచంలోని పురాతన నిరంతర సంస్కృతులలో ఒకటిగా ఉంది మరియు 1945 నుండి దాదాపు ఏడు మిలియన్ల వలసదారులకు ఇప్పటి వరకు ఆశ్రయం ఇచ్చింది.
ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి ముందు మీరు నిర్దిష్ట ప్రమాణాలను కూడా తప్పకుండా పాటించాలి.
పౌరసత్వం కోసం 'కాన్ఫెరల్' లేదా 'డీసెంట్' ద్వారా దరఖాస్తు చేస్కోవచ్చు.
ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడంలో వందలాది మందికి మైగ్రేషన్ లాయర్ ఈవా అబ్దెల్-మెస్సయ్య (Eva Abdel-Messiah) సహాయం చేశారు. నివాస అవసరాన్ని తీర్చడమే అత్యంత ముఖ్యమైన ప్రమాణం అని ఆమె చెప్పారు.
ఆస్ట్రేలియాలో నివాస ఆవశ్యకతను తీర్చడానికి, మీరు నిర్దిష్ట ప్రమాణాలను పొంది ఉండాలి . మొదటిది, 12 నెలలకు మించకుండా నాలుగు సంవత్సరాలు చట్టబద్ధమైన వీసాపై ఆస్ట్రేలియాలో నివసించడం లాంటివి.
గడిచిన చివరి సంవత్సరం తాత్కాలికంగా కాకుండా శాశ్వత నివాసంలో ఉండాలి (PR వీసా ), మరియు గత 12 నెలల్లో 90 రోజులకు మించి బయట దేశాల్లో ఉండకూడదు.Eva Abdel-Messiah
నివాసపు ఆవశ్యకతను తీర్చడంతో పాటు, 18 ఏళ్లు పైబడిన వారు ఆస్ట్రేలియన్ పౌరసత్వం పొందడం కోసం దరఖాస్తు చేసుకునేవారు 'మంచి వ్యక్తిత్వాన్ని' ప్రదర్శించాలి, ఇది శాశ్వత నైతిక లక్షణాలుగా గుర్తిస్తారు.
ఇవి మాత్రమే కాకుండా
- ఆస్ట్రేలియాలో నివసించడానికి ప్లాన్ చేయండి లేదా విదేశాల్లో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వండి,
- ఇంగ్లిష్ భాషపై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి మరియు
- ఆస్ట్రేలియా గురించి మరియు ఆస్ట్రేలియా పౌరులు గా ఎలా మెలగాలో తెలుసుకోవాలి. దీన్ని అంచనా వేయడానికి, చాలా మంది దరఖాస్తుదారులు పౌరసత్వ పరీక్షను రాస్తారు.
"మీరు పెద్దవాళ్ళై ఉండి , 18 నుంచి 59 ఏళ్ల వయసు లో ఉంటూ ఇంగ్లిష్¬లో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ఇంటర్వ్యూ ఉంటుందని, పౌరసత్వ పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు అబ్దెల్-మెస్సయ్య (Ms Abdel-Messiah ).

ఒకవేళ మీరు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి అర్హత కలిగి ఉంటే మరియు పౌరసత్వ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మీ హోంవర్క్ చేయాలి.
ఆస్ట్రేలియన్ సిటిజన్¬షిప్ టెస్ట్ (పౌరసత్వ పరీక్ష) ఆస్ట్రేలియా పౌరుడిగా ఉండటానికి వ్యక్తి యొక్క తెలివితేటలు మరియు అవగాహనను అంచనా వేస్తారని అబ్దెల్-మెస్సీయా (Ms Abdel-Messiah) చెప్పారు.
ఇందులో ఆస్ట్రేలియా, వారి ప్రజలు, చిహ్నాలు, ప్రజాస్వామిక విశ్వాసాలు, హక్కులు, స్వేచ్ఛలు గురించి ప్రశ్నలు అడుగుతారు.
ఆస్ట్రేలియాలో చట్టాలు ఎలా రూపొందించబడతాయో అర్థం చేసుకోవడం మరియు స్వేచ్ఛ, గౌరవం మరియు సమానత్వం చుట్టూ తిరిగే దేశం యొక్క ప్రధాన విలువల పట్ల నిబద్ధతను ప్రదర్శించడం కూడా ఇందులో ఉంటుంది.
ఆస్ట్రేలియన్ పౌరసత్వ పరీక్షలో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇది ఆస్ట్రేలియన్ చిహ్నాలు, చారిత్రక సంఘటనలు, ప్రభుత్వ నిర్మాణం మరియు పౌరసత్వ హక్కులు మరియు బాధ్యతలు వంటి వివిధ అంశాలను కవర్ చేస్తుంది.
ఈ 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో ఐదు ఆస్ట్రేలియన్ విలువలపై ఆధారపడి ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కదానిలోనూ తప్పులు ఉండడానికి వీల్లేదని పేర్కొంది. కాబట్టి, పరీక్షకు పాస్ మార్క్ 75%, ఇది కొన్ని తప్పులకు అనుమతిస్తుంది. “ అని చెప్పారు.
కానీ ఆస్ట్రేలియా విలువలకు సంబంధించిన విభాగంలో ఎలాంటి పొరపాట్లకు తావులేదు. మీరు ఒక ప్రశ్నలో ఓడిపోతే లేదా మీరు ఒక ప్రశ్నలో విఫలమైతే, మీరు మొత్తం పరీక్షలో విఫలమయ్యారని అర్థం.Eva Abdel-Messiah
డిపార్ట్మెంట్ ఆఫ్ హోం అఫైర్స్ వెబ్¬సైట్ ((homeaffairs.gov.au)) అధికారిక పౌరసత్వ పరీక్ష వనరుల బుక్¬లెట్ నుండి అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తుంది, దీనిని "ఆస్ట్రేలియన్ సిటిజన్¬షిప్: మా (మన) కామన్ బాండ్ ". అని పిలుస్తారు.
బుక్లెట్ 40 భాషల్లో అందుబాటులో ఉంది మరియు మీరు వెబ్సైట్లోని పాడ్కాస్ట్ లింక్ ద్వారా కూడా కంటెంట్ను వినవచ్చు.
పరీక్షకు అవసరమైన సమాచారం అంతా "అవర్ కామన్ బాండ్ (మా (మన) సాధారణ బంధం)" బుక్-లెట్¬లో ఉంది. మీరు దానిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి మరియు దానిని గుర్తుంచుకోవడంలో మీకు సహాయపడటానికి నోట్స్ రాసుకోవాలి.
అసలు పరీక్ష మాదిరిగా ఉండే ఉచిత పౌరసత్వ పరీక్ష అభ్యాసాన్ని అందించే అనేక వెబ్సైట్లలో ఒకదానిలో మీరు ఆన్లైన్ ప్రాక్టీస్ పరీక్షను కూడా తీసుకోవచ్చు.
కంప్యూటర్ల నుండి వెబ్¬సైట్ లింక్¬లను యాక్సెస్ చేయడం కంటే అనేక ఫోన్ యాప్స్ నుండి యాక్సెస్ మరియు నావిగేట్ చేయడం సులభం అని శ్రీమతి అబ్దెల్-మెస్సియా (Ms. Abdel-Messsiah)చెప్పారు.
"ఈ ఫోన్ యాప్స్ చాలా హెల్ప్ అవుతాయి. నేను ఎప్పుడూ నా క్లయింట్లను వాటిని డౌన్లోడ్ చేసుకోమని మరియు ప్రతి రాత్రి అరగంట లేదా గంట సమయాన్ని గడపడానికి వాటిని ప్రోత్సహిస్తాను. దాని గురించి యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయి.”
ప్రభుత్వంలోని మూడు శాఖలు, ఫెడరల్ పార్లమెంటరీ వ్యవస్థ, గవర్నర్ జనరల్ పాత్రను అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరమని ఆమె చెప్పారు.
పౌరసత్వ పరీక్ష ముఖ్యమైన ఆస్ట్రేలియన్ సంఘటనల గురించి మీ తెలివితేటల్ని అంచనా వేస్తుంది మరియు తరచుగా స్వదేశీ మరియు సాంస్కృతికంగా వైవిధ్యమైన ఆస్ట్రేలియన్ల గురించి వారి త్యాగాల గురించి కూడా ఉంటుంది.
పరీక్ష కేవలం ఇంగ్షీషులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీరు భాషను బాగా అర్థం చేసుకోవాలి.

ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి మీరు చదవడం ప్రాక్టీస్ చేయాలి.
" నేను క్లైంట్స్ కి ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహిస్తాను. ప్రిపరేషన్¬లో భాగంగా ఇంగ్లిష్¬లో వార్తలు వినడం, ఇంగ్లిష్¬లో వార్తాపత్రికలు చదవడం. కనీసం వారానికి ఒకసారి అయినా పరీక్షను ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే పరీక్ష తిరిగి రాయడానికి ; ఆరు నుండి తొమ్మిది నెలల మంచి గ్యాప్ ఉంటుందని " అబ్దెల్-మెస్సియా చెప్పారు.
మీకు సహాయం అవసరమైతే మరియు మీ ఇంగ్లిష్¬ను మెరుగుపరచడంలో సహాయం కావాలిస్తే డిపార్ట్¬మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్¬సైట్¬లో స్టడీ మెటీరియల్ , ఇతర సహాయం కోసం మీరు అనేక స్థానిక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లని సంప్రదించవచ్చు.
ఉదాహరణకు, NSW లోని సిడ్¬వెస్ట్ మల్టికల్చరల్ సర్వీసెస్ మరియు విక్టోరియాలోని సదరన్ మైగ్రెంట్ అండ్ రెఫ్యూజీ సెంటర్ ఔత్సాహిక పౌరులకు పరీక్షకు సిద్ధం చేయడంలో సహాయపడటానికి పౌరసత్వ పరీక్ష ప్రిపరేషన్ తరగతులు మరియు వనరులను అందిస్తున్నారు.
ఈ సంస్థలు తరచుగా అనుభవజ్ఞులైన బోధకులచే నిర్వహిస్తుంటారు , వారు ప్రక్రియ కు మద్దతును అందించగలుగుతారు.
సిడ్¬వెస్ట్¬కు చెందిన విక్కీ హైన్ వారి కోర్సులు అనేక మంది కొత్త వలసదారులు, శరణార్థులు మరియు శాశ్వత నివాసితులు పౌరసత్వ పరీక్షకు సిద్ధం కావడానికి ఎలా సహాయపడ్డాయో వివరిస్తున్నారు.
పౌరసత్వ పరీక్షకు సిద్ధం కావడానికి మరియు భద్రత కోసం ఇక్కడ పౌరసత్వం ఉండటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రజలకు మద్దతు మరియు సహాయం అవసరం.Vikki Hine
ఈ కోర్సు అన్ని నేపథ్యాలకు చెందిన వలసదారులకు అందుబాటులో ఉంటుంది. శరణార్థి హోదాతో సంబంధం లేకుండా, ఆస్ట్రేలియాకు చేరుకున్న ఎవరైనా మొదటి ఐదు సంవత్సరాలలో సెటిల్మెంట్ సేవలకు అర్హులు.
2014 లో సిడ్¬వెస్ట్ వెస్ట్రన్ సిడ్నీలో మొదటి పౌరసత్వ క్లాస్ (first citizenship class) ని తీసుకున్నారు.
అప్పటి నుంచి, వందలాది మంది క్లయింట్లు తమ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను పొందారని హీన్ చెప్పారు.
"వారు ప్రతి ప్రశ్నను చదివి దాని గురించి కొంత చరిత్రను నేర్చుకుంటారు. గ్రూపులుగా, మేము భూమి లేఅవుట్¬ను వివరించడానికి సామాజిక విహారయాత్రలకు (సోషల్ ఔటింగ్స్) కూడా వెళ్తాము.

ఆస్ట్రేలియన్ సంస్కృతిని స్వీకరించడం వల్ల వాస్తవాలు, గణాంకాలను గుర్తుంచుకోవడం కంటే దేశం మరియు దాని విలువలపై మీ అవగాహన పెరుగుతుందని ఆమె చెప్పారు.
"ఒక సాధారణ సామాజిక నేపధ్యంలో, ఇది బార్బెక్యూ, పిక్నిక్ మరియు ఆ పార్కులోని వృక్షజాలం (చెట్లు) మరియు జంతుజాలం (జంతువులు) గురించి తెలుసుకోవడం గురించి ఉంటుంది. కాబట్టి, ప్రతిదీ నేర్చుకునే అనుభవం (లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్)."
పౌరసత్వ పరీక్షను రాస్తున్నప్పుడు దరఖాస్తుదారులు చేయకూడని సాధారణ తప్పులు లేదా నష్టాలను కూడా అబ్దెల్-మెస్సీయా పంచుకున్నారు. అభ్యర్థులు ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలని, కాలపరిమితిలో ఉండాలని, సమాధానాన్ని క్లిక్ చేయడానికి తొందరపడవద్దని ఆమె సూచించారు.
మూడుసార్లు పరీక్షను వ్రాసే అవకాశం కల్పించారు. కానీ మూడోసారి, మరో ఆప్షన్ ఉండదు. తిరస్కరించబడుతుంది. ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది' అని అబ్దెల్ మెస్సీయా చెప్పారు.











