Key Points
- తాత్కాలిక వీసాదారులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఫెడరల్ ప్రభుత్వం విస్తరించింది.
- కుటుంబ మరియు గృహ హింసలను ఎదుర్కొంటున్న తాత్కాలిక వీసాదారులకు $3,000 నుండి $5,000కు పెంచుతుంది
- తాత్కాలిక వీసా హోల్డర్‌లకు అదనంగా మరో 44 లక్షల డాలర్లు పెంపు.
హింసకు గురవుతున్న తాత్కాలిక వీసా హోల్డర్‌లకు ఆర్థిక అభద్రతను తగ్గించే ప్రయత్నంలో ఫెడరల్ ప్రభుత్వం 2021లో మొదట ప్రారంభించిన ప్రోగ్రామ్ ఇప్పుడు విస్తరించింది.
ప్రతి ఆరుగురు ఆస్ట్రేలియన్ మహిళల్లో ఒకరు కుటుంబ మరియు గృహ హింసను అనుభవిస్తున్నారు. వలస వచ్చిన మరియు శరణార్థి స్త్రీలలో ప్రతి ముగ్గురు లో ఒకరు.
దీని భాగంగా కుటుంబ మరియు గృహ హింసను ఎదుర్కొంటున్న తాత్కాలిక వీసా హోల్డర్‌లకు ఆర్థిక సహాయం ప్రస్తుతం ఉన్న $3,000 నుండి $5.000కి పెంచింది.
Social Services Minister అమండా రిష్‌వర్త్ మాట్లాడుతూ ఈ మార్పు ద్వారా శాశ్వత నివాసితులను మరియు తాత్కాలిక వీసా హోల్డర్‌లకు ఒకే విధంగా భద్రతా మరియు ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు.
గృహ హింస కు బాధపడుతున్న వారి ని వీసా స్టేటస్ బట్టి ప్రభుత్వ భద్రతా మరియు ఆర్థిక సహాయం చేయడం సరికాదని Ms రిష్‌వర్త్ చెప్పారు.
నిధులు పెంపు వలన తాత్కాలిక వీసా పై ఉంటూ సహాయం కోసం చూస్తూ, చాలా బాధలు పడుతున్న వారికి బాగా సహాయపడుతుందని చెప్పారు.
తాత్కాలిక వీసా హోల్డర్‌లకు అంటే కుటుంబం మరియు గృహ హింసను అనుభవిస్తున్నవారికి ఏప్రిల్ 2021 లో ప్రవేశపెట్టిన పైలట్ ప్రోగ్రాం కు 3 కోట్ల 82 లక్షలకు మంజూరు చేసారు. ఇప్పుడు దీనికి అదనంగా ఫెడరల్ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలలో మరో 44 లక్షల డాలర్లు పెంపుకి అంగీకరించింది.
జనవరి 2025 వరకు పొడిగించబడిన పైలట్ ప్రోగ్రాం, తాత్కాలిక వీసా హోల్డర్‌లకు ఆర్థిక సహాయం, మరియు న్యాయ పరమైన సలహాలను పొందడం వంటి వాటికి సహాయం చేస్తుంది.
ఆస్ట్రేలియన్ రెడ్‌క్రాస్‌లోని ఆస్ట్రేలియన్ ప్రోగ్రామ్‌ల డైరెక్టర్ విక్కౌ మూర్, ఈ పైలట్ ప్రోగ్రామ్ వల్ల గృహ హింస నుండి తప్పించుకున్న వేలాది మంది మహిళలకు మద్దతునిచ్చిందని చెప్పారు.
భద్రత కోసం ప్రయత్నిస్తున్న వలస మరియు శరణార్థి మహిళలకు మద్దతుగా ఈ పెరిగిన నిధులు వాళ్లకు చేరుతాయని ఆమె చెప్పారు.
వలస మరియు శరణార్థుల నేపథ్యాల నుండి వచ్చిన వారు, చట్టపరంగా వెళ్లాలంటే చాలా భయపడుతున్నారని మరియు ఈ పైలట్ ప్రోగ్రాం వల్ల చట్టపరమైన మద్దతు పొందడంలో ముఖ్యమైన సహాయాన్ని అందిస్తుందని Ms మౌ చెప్పారు.
మీకు లేదా మరెవరికైనా సహాయం కావాలంటే, 1800 737 732 లేదా లైఫ్‌లైన్ 13 11 14 నుండి కౌన్సెలింగ్ సహాయం పొందవచ్చు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.