మన భాషను తల్లిలా ప్రేమిస్తూ ముందు తరాలకు తెలుగు ధనంగా అందివ్వాలని శ్రీ తూములూరి శాస్త్రిగారు కోరుతున్నారు. 1983 వ సంవత్సరం లో ఆస్ట్రేలియాలో అడుగిడిన వారు తెలుగు పలుకు పత్రికను ప్రారంభించి ఆంగ్ల దేశంలో తెలుగు ప్రసంగాలతో కార్యక్రమాలను నిర్వహించారు. అయన తెలుగు భాష అందాన్ని వర్ణిస్తూ, తెలుగు వారసులుగా పుట్టడమే అదృష్టం అంటున్నారు. ఇతర రాష్ట్రాల కవులు సైతం తెలుగును మెచ్చిన విషయాలను వివరించారు.
అదే స్పూర్తితో తెలుగు భాషను మరింత ప్రేమిస్తూ, భవితకు అందిద్దాం. మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.