ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధిస్తున్న పురోగతిని గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది. ఈ నెల లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ - 'Inspire Inclusion'. మహిళల కోసం ప్రభుత్వం, కొన్ని ప్రధాన అంశాలపై పని చేస్తుంది: ఆర్థిక సమానత్వం మరియు భద్రత, ఆరోగ్యం, స్త్రీ నాయకత్వం. ప్రభుత్వం ఎన్ని రకాల పధకాలు ప్రవేశపెడుతున్నా, ఎదో ఒక వెలితి. అందుకని కొంతమంది మన కమ్యూనిటీ మహిళలు నడుంకట్టి వారికీ తోచిన విధంగా కమ్యూనిటీ కి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
అందులో ఒకరు నందిని బిస్కుండా. 2016 లో స్త్రీ శక్తి అవార్డు గ్రహీత. మరొకరు ప్రియాంక చౌదరి IT రంగంలో పని చేసి కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు ఏ విధంగా కమ్యూనిటీ కి సహాయ పడుతున్నారో ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.