ఆజ్‌బెస్టాస్ ను తెలుగులో "రాతినార" అంటారు. ఇదొక అద్భుతమైన విద్యుత్ బంధకం, అధిక ఉష్ణ నిరోధకతను కలిగి ఉంటుంది. దీనిని చాలా సంవత్సరాలు నిర్మాణ సామగ్రిగా ఉపయోగించారు. "రాతినార" పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ధూళి పీల్చడం మూలంగా ఆస్బెస్టాసిస్, కాన్సర్తో సహా వివిధ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు.
దీని ధూళి వల్ల జరిగే ఆరోగ్య నష్టాలను బహిరంగంగా గుర్తించడం మూలంగా చాలా దేశాలలో నిర్మాణం లో దీనిని నిషేధించారు. అసలు ఆజ్‌బెస్టాస్ అంటే ఏమిటి మరియు దీనివలన కలిగే నష్టాలను ఈ పోడ్కాస్ట్‌లో డాక్టర్ కృష్ణ నడింపల్లి గారు వివరించారు. ఆస్ట్రేలియా లో 20 ఏళ్లకు పైగా శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రంలో Ph.D. పూర్తి చేసారు.