VVLN శర్మ గారు మరియు సంధ్య గారు రిటైర్డ్ బోటనీ ప్రొఫెసర్లు. పేరొందిన ఉపాధ్యాయులుగా చాలా మందికి విద్యాదానం చేసిన వారు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. శర్మ గారు "మెమోనిక్స్" అనే పద్దతి ని కనుగొన్నారు. అంటే ఒక వస్తు రూపమును మనస్సులోనే చిత్రీకరించి ఒక పదం తో దాన్ని గుర్తు పెట్టుకునే పద్ధతి అన్నమాట.
అయన పై వాల్యూ యొక్క 500 అంకెలను ముందునుండి మరియు వెనక నుండి చెప్పి పలుప్రపంచ రికార్డులు సృష్టించారు. 2018 లో ఒక నిమషం 21సెకన్లలో 'Pi' విలువ లో ఉన్న500 అంకెల వరకు పఠించారు మరియు 2022 లో 5 నిముషాల్లో 500 అంకెల వరకు ఒకేసారి ముందుకు వెనకకు పై విలువను పఠించి ఒక ప్రత్యేక ప్రజ్ఞ చూపారు.
అయన ప్రజ్ఞ కు ఈ అవార్డులను దక్కించుకున్నారు.
1. ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్
2.ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్
3.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్
4.హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్ (లండన్)
అయన మాట్లాడుతూ, "ఈ పద్దతిని పాటించి చాల మంది విద్యార్థులు మరియు కొంత మంది స్నేహితులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందారని" చెప్పారు.
శర్మ గారు, సంధ్య గారు కరోనా టైం లో లాక్ డౌన్ వల్ల ఆస్ట్రేలియా లో మూడు ఏళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయం లో శర్మ గారి అద్వితీయ ప్రతిభను తన మూడేళ్ళ మనవడు "మయూఖ్ ప్రఖ్యా " కి అందించారు. చాలా సాధన, కృషి, పట్టుదల తో తాతయ్య గారి ఓర్పుతో మెకానికల్ మెథడాలజీ పద్దతి లో మయూఖ్ రాజధానుల పేర్లు పటిచడం, కార్ల పేర్లు ధారాళంగా చెప్పడం వంటివి అనతి కాలం లోనే నేర్చుకున్నాడు.
దీనితో తాను కూడా 2018 లో 193 దేశాల రాజధానుల పేర్లు 5 నిముషాల 50 సెకండ్ల లో చెప్పి వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. తను అక్కడితో ఆగకుండా తాత గారితో సమానంగా పై వేల్యూ యొక్క 500 అంకెలను స్పష్టంగా 2 నిముషాల 2 సెకండ్ల లో చెప్పి పై వరల్డ్ ర్యాంకింగ్ లిస్ట్ లోకి ఎక్కాడు.
మయూఖ్ 23 జూలై 2021న పీరియాడిక్ పట్టికలోని మొత్తం 118 ఎలిమెంట్‌లను కంఠస్థం చేసి, రికార్డు సమయంలో పఠించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 30.14 సెకన్లు మరియు 58 సెకన్లలో అన్ని మూలకాలను వాటి చిహ్నాలను గుర్తించాడు.
అన్నయ్య ను చూసి చెల్లెలు మిహిర కూడా రికార్డులు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇటువంటి ప్రతిభను కనపరుస్తున్న శర్మ గారికి, మయూఖ్ కి మరియు మిహిర కి SBS తెలుగు తరుపు నుండి అభినందనలు.
శర్మ గారు తనదయిన శైలి లో నేర్చుకున్న విద్యను అందరితో పంచుకోవాలనుకుంటున్నారు. మీకు "మెమరీ రీడింగ్" పై ఆసక్తి ఉంటే కనుక SBS తెలుగు కి మెయిల్ చేయండి. (sandya.veduri@sbs.com.au)