గత సంవత్సరం ఫ్లూ సీజన్ లో , దాదాపు 300,000 కేసులు మరియు ఆస్ట్రేలియాలో కనీసం 370 ఫ్లూ సంబంధిత మరణాలు సంభవించాయి. 2023లో, ఐదు నుండి 64 సంవత్సరాల వయస్సు గల జనాభాలో కేవలం 25 శాతం మంది మాత్రమే ఇన్‌ఫ్లుఎంజాకు టీకాలు వేయించుకున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. క్వీన్స్‌లాండ్ చీఫ్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ జాన్ గెరార్డ్ మాట్లాడుతూ టీకాల సంఖ్య పెరగాలని చెబుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా FluCelVax Quad అనే సెల్-ఆధారిత వ్యాక్సిన్ ను ప్రారంభిస్తున్నారు. ఇది మొదటిసారిగా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (NIP)లో లిస్ట్ చేయబడింది.
మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.