సిడ్నీ రాయల్ ఈస్టర్ షో అనేది రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ ఆఫ్ NSW (RAS) వారు నిర్వహిస్తున్నారు. RAS అనేది ఆస్ట్రేలియా వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించే సంస్థ. సిడ్నీ రాయల్ ఈస్టర్ షో ను 1823 లో మొదటిసారిగా ప్రారంభించారు.
ఇది ఈస్టర్ సమయంలో రెండు వారాల పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే వార్షిక ప్రదర్శన.
ఇంతటి పేరున్న ప్రదర్శనలో మన తెలుగు అమ్మాయి మొదటి బహుమతిని గెలుచుకోవడం గర్వ కారణం. అసలు పోటీకు మన సంస్కృతిని అద్దం పట్టేలా తాను తయారుచేసిన కేక్ పెద్ద హైలైట్. అసలు తనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో మనకు ఈ పోడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.