సాయి బాబా DV గారు రిటైర్డ్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ విజయవాడ నుండి సిడ్నీకి చాలా ఏళ్ల క్రితం వచ్చారు. ఆయన ఒక విషయం గమనించి, అంటే తెలుగు వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి ఒక మాధ్యమం లేదు, పలకరించే వారే కరువయిన విషయం గమనించి ఒక అసోసియేషన్ స్థాపించాలనే ఆలోచన వచ్చింది. మన తల్లితండ్రులు ఇంటి నుండి ఇక్కడకు వచ్చాక మాట్లాడుకోవడానికి ఎవరు తెలీక ఏమి చేయాలో తెలియక కష్టపడుతున్న వారి కోసం ఒక అసోసియేషన్ ను మొదలుపెట్టి వాళ్లలో వాళ్ళు సహాయం చేసుకోవడం మొదలుపెట్టారు.
తెలుగు సీనియర్స్ అసోసియేషన్ మొదలుపెట్టి 10 సంవత్సరాల అయ్యి 350 మందిని ఇప్పుడు ఆసరా గా ఉన్నారు.
ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ మీ కోసం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.