అయితే, ఇక్కడకు వచ్చిన తరువాత ఖర్చులు భరించలేక, వారు తల్లితండ్రులకు లోన్లకు సహాయం చేయలేక కష్టపడుతుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేసి, డబ్బులు ఆశ చూపించి వారిలో కొందరు డ్రగ్ కార్టల్స్ లో, మనీలాండరింగ్ లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఈ విషయంపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వెనుక కారణాలను వివరిస్తూ, విద్యార్థుల్లో అవగాహన పెంచడం గురించి చర్చిస్తున్న డిటెన్షన్ సెంటర్ కు చెందిన కౌన్సిలర్ మను రెడ్డితో మనం ఇప్పుడు మాట్లాడదాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.