రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా (RBA) ద్రవ్యోల్బణాన్ని(inflation) తగ్గించడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా బ్యాంకులు ఇంకో ఒకటి లేదా రెండు సార్లు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని వేస్తున్నాయి. ఇప్పుడు నగర శివారు ప్రాంతంలో ఎక్కువ properties supply వల్ల , వారు ఉంటున్న ఇళ్ల ఖరీదు తగ్గి, భవిషయత్తు లో యజమానులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీని వలన యజమానులు నష్టానికి ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన పడుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ podcast ద్వారా విందాం.
ప్రధాన నగర శివారు ప్రాంతాల్లో ఒకే సారి properties సప్లై మరియు ఇళ్ల రేట్లు తగ్గుదల జరగడం వాళ్ళ ఇంటి యజమానులకు ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
మార్కెట్ రికవరీ కోసం ఆశగా చూడాలా లేక నష్టానికి అమ్ముకోవాలో తెలీక ఇంటి యజమానులు సందిగ్తత లో ఉన్నారు.
Core Logic Australian Research Head Eliza Owen మాట్లాడుతూ వడ్డీ రేట్ల పెంపు మరియు గణనీయంగా పెరిగిన ఇళ్ల స్థలాల సరఫరా ఒకేసారి జరగటం కొంచెం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.






