దేశభక్తి అంటే కేవలం మాతృభూమిని స్తుతించటం కాదు, దేశ ఔనిత్యాన్ని, దేశ సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పిన మహనీయులను శ్లాఘించటం, దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుష్యులోయని చాటడం. ప్రజలలోని అసమానతలను, జాతి, మత, వర్గ వైషమ్యాలను ఎత్తిచూపి వారిలో మార్పుతీసుకురావడం.
సమాజంలోని ఋగ్మతలను, దురాచారాలను వెలికితీసి వాటిపై తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా దేశభక్తి కోవలోకే వస్తాయి. కేవలం జాతీయోధ్యమంలో అశువులు బాసిన త్యాగనిరతులను తలచుకోవడం కాదు, వారు సాధించి ఇచ్చిన స్వాతంత్ర్యం అర్థం తెలిసి మనుగడ సాగిచటం దేశభక్తి అనిపించుకుంటుంది. ఇలాంటి భావనలను ప్రేరేపించే అనేక సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.