ఎముకల ఆరోగ్యం, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడం, పోషక విలువల సమతుల్యం, ఒత్తిడి, నీరసం తగ్గించడానికి ఇలా అనేక కారణాల కోసం ముఖ్యంగా డి విటమిన్, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, బి-కాంప్లెక్స్ ఉన్న సప్లిమెంటరీ, విటమిన్ టాబ్లెట్లను చాలామంది తీసుకుంటున్నారు. అయితే వీటివల్ల వచ్చే దుష్ప్రాభావాల గురించి ఎవరూ ఆలోచించట్లేదు.
Therapeutic Goods Administration (TGA)కి అందిన 170 ప్రజానివేదకలలో విటమిన్ బి6 అధిక మోతాదులో వాడటం వల్ల నరాల బలహీనతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది. అందువల్ల 50 mg కంటే ఎక్కువ B6 కలిగిన సప్లిమెంట్లను Schedule 3 అంటే ఫార్మసీ వద్ద మాత్రమే లభ్యమయ్యేటట్టు వర్గీకరించాలని టిజిఎ ప్రతిపాదించింది.