SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
వాణిజ్య పోరుకు రంగం సిద్ధం..

US President Donald Trump speaks in the Oval Office of the White House in Washington, DC, US, on Thursday, March 6, 2025. Source: AAP / Al Drago/Pool/ABACAPRESS.COM.
ప్రపంచ యుద్ధాలు చూశాం. ప్రచ్ఛన్న యుద్దాలు చూశాం. ఇప్పుడు కొత్తగా వాణిజ్య యుద్ధానికి అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తెరలేపారు. అమెరికాని ఉన్నత పీఠంపై ఉంచాలన్న ఆయన ఆశయం ప్రపంచ దేశాలకు గుదిబండగా మారతోంది. స్థానిక పరిశ్రమలకు జీవం పోయడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి అని చెపుతూ, ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై అధిక మొత్తాలలో సుంకాలను విధించి దేశ, విదేశీ ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెడుతున్నారు.
Share