ఇండిజెనియస్ వాయిస్ టు పార్లమెంట్ అని పిలువబడే ప్రాతినిధ్య సంస్థ ద్వారా ఇండిజెనియస్ ప్రజలను గుర్తించడానికి ఆస్ట్రేలియా రాజ్యాగం లో మార్పులు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి అర్హులైన ఓటర్లను త్వరలో పిలుస్తారు.
ఫస్ట్ నేషన్స్ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలు మరియు చట్టాలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి వాయిస్ ఒక ఎన్నికైన గ్రూప్. ఈ ప్రక్రియలో రెఫరెండం ప్రాముఖ్యతను ఆస్ట్రేలియా ఎలక్టోరల్ కమిషన్ (AEC) అధికార ప్రతినిధి ఇవాన్ ఎకిన్-స్మిత్ వివరించారు.
"రెఫరెండం అనేది ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని మార్చడానికి లేదా మారకుండా ఒక నిర్దిష్ట అంశంపై జాతీయ ఓటు" అని అయన చెప్పారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటే ప్రజల ఓటు ఒక్కటే మార్గం. ఆ అధికారం పార్లమెంటుకు లేదు.Evan Ekin-Smyth
ఫెడరల్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో రాజ్యాంగం నిర్ధారిస్తుంది. ఇది కామన్వెల్త్, రాష్ట్రాలు మరియు ప్రజలు ఎలా సహకరించుకుంటాయో అని, రాష్ట్ర మరియు ఫెడరల్ పార్లమెంటులు ఏ చట్టాలు చేయవచ్చో నిర్ణయిస్తుంది.
ఈ కింది ప్రశ్నకు 'అవును' లేదా 'కాదు' ఓటు వేయమని ప్రజలను అడుగుతారు:
"ఒక ప్రతిపాదిత చట్టం: అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండర్ వాయిస్¬ను స్థాపించడం ద్వారా ఆస్ట్రేలియా మొదటి ప్రజలను గుర్తించడానికి రాజ్యాంగాన్ని మార్చవచ్చా లేదా అన్న ప్రశ్నకు ఓటు వేయాల్సి ఉంటుంది. మీరు ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటున్నారా అని అడుగుతారు. "

రెఫరెండం విజయవంతం కావాలంటే రెండింతల మెజారిటీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి.
రెఫరెండం ఆమోదం పొందాలంటే జాతీయ స్థాయిలో మెజారిటీ రాష్ట్రాల్లో 'అవును' ఓట్ల మెజారిటీని సాధించాలి. కాబట్టి, ఆరు ఆస్ట్రేలియన్ రాష్ట్రాలలో కనీసం నాలుగు రాష్ట్రాలు అవును అని సమర్థిస్తూ ఓటు వేయాలి" అని ఎకిన్-స్మిత్ వివరించారు.
ఇతర ఆస్ట్రేలియన్ పౌరుల్లాగే ACT, NT లు కూడా ఓటు వేసి బ్యాలెట్ పేపర్లో 'అవును' లేదా 'కాదు' చెప్పాలి. ఇది నేషనల్ మెజారిటీకి లెక్కించబడుతుంది . కాబట్టి, ఆ జాతీయ మెజారిటీ మొత్తానికి దేశం యొక్క ఓట్లు ఇప్పటికీ చాలా ముఖ్యమైనవి.
ప్రతిపాదించిన ఇండిజెనియస్ వాయిస్ టు పార్లమెంట్ అనేది లింగ-సమతుల్య ప్రతినిధుల సంస్థగా ఉంటుంది, వాటిని ప్రభావితం చేసే చట్టాలను రూపొందించేటప్పుడు పార్లమెంటుకు సలహా ఇవ్వడంలో వారికి ప్రాతినిధ్యం వహించడానికి ఫస్ట్ నేషన్స్ కమ్యూనిటీలచే ఎన్నుకోబడుతుంది.
చట్టాలు, వీటో నిర్ణయాలు, నిధులు ఇచ్చే అధికారం దీనికి ఉండదు. పార్లమెంట్ యధావిధిగా కొనసాగుతుంది.
ప్రొఫెసర్ మెగాన్ డేవిస్ NSW యూనివర్సిటీలో కాబూల్ మహిళ మరియు రాజ్యాంగ చట్టం యొక్క అధ్యక్షురాలు.
వాయిస్ కోసం ప్రతిపాదనను ముందుకు తెచ్చి , రాజ్యాంగంలో అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసుల గుర్తింపుపై నిపుణుల కమిటీలో ఆమె ఒకరు.
ఇతర దేశాల్లో ఇలాంటి సంస్కరణలను విజయవంతంగా అమలు చేశాయని ఆమె చెప్పారు.
"ప్రభుత్వాలు చట్టాలు మరియు విధానాలను రూపొందించినప్పుడు దేశ ప్రజల అభిప్రాయాలను వినటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు చేసిన చాలా సాధారణ సంస్కరణ ఇది" అని ఆమె చెప్పారు .
ఆస్ట్రేలియాలో ప్రతికూలతలో అంతరాన్ని పూడ్చలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, ప్రభుత్వం సమాజాల గురించి చట్టాలు మరియు విధానాలను రూపొందించేటప్పుడు వాళ్ళని చాలా అరుదుగా సంప్రదిస్తుంది.Professor Megan Davis
ఆస్ట్రేలియా ఫస్ట్ నేషన్స్ ప్రజలు వాయిస్ గురించి , వివిధ రకాల రాజకీయ అభిప్రాయాలతో ఉన్నారు, కొందరు వాయిస్ ప్రతిపాదనతో విభేదిస్తున్నారు.
ఇందులో ప్రముఖ ఇండిజినెస్ రాజకీయ నాయకులు - నార్తర్న్ టెరిటరీ కంట్రీ లిబరల్ సెనేటర్ జెసింటా ప్రైస్ మరియు మాజీ ప్రముఖ లేబర్ నాయకులు వారెన్ ముండిన్ ఉన్నారు - వాయిస్ టు పార్లమెంట్ ఇండిజెనియస్ ప్రతికూలతను పరిష్కరించడానికి పెద్దగా ఉపయోగపడదని వాదిస్తున్నారు.
రెఫరెండం సమీపిస్తున్న కొద్దీ 'అవును', 'కాదు' ప్రచారాలు వాయిస్¬కు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నాయి, కరపత్రాలను దేశవ్యాప్తంగా ఇళ్లకు పంపుతారు.

17 మిలియన్లకు పైగా నమోదైన ఆస్ట్రేలియన్ ఓటర్లకు సమాచారం అందించడానికి AEC ఒక ఇన్ఫర్మేషన్ క్యాంపైన్ ను అభివృద్ధి చేస్తోందని ఎకిన్-స్మిత్ చెప్పారు.
రెఫరెండం రోజున దేశవ్యాప్తంగా వేలాది పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి.
దీనికి ముందు వారాల్లో ముందస్తు ఓటింగ్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉంటాయని, కాబట్టి ఆ రోజు రాలేనివారు ముందస్తు ఓటింగ్ కేంద్రానికి వ్యక్తిగతంగా హాజరుకావచ్చని తెలిపారు. అంతర్జాతీయ ఓటింగ్, రిమోట్ మొబైల్ పోలింగ్, పోస్టల్ ఓటింగ్, అంధులకు టెలిఫోన్ ఓటింగ్ సౌకర్యం కలిపిస్తున్నారు.
ఓటర్లకు అందుబాటులో ఉండే వివిధ రకాల వనరులను AEC ప్రతినిధి పాట్ కలనన్ వివరించారు.
"సాంస్కృతికంగా, భాషాపరంగా విభిన్నమైన 30కి పైగా భాషల్లోకి అనువదించిన వనరులను తమ వెబ్సైట్లో, ఫోన్ కాల్ ఇంటర్ప్రీటర్ సేవల ద్వారా అందుబాటులో ఉంచుతామని తెలిపారు."
ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదైతే, వారు రెఫరెండంలో ఓటు వేయడానికి కూడా అర్హులని ఆయన వివరించారు. అందువల్ల ఎన్నికల్లో మాదిరిగానే ఓటు వేయడం తప్పనిసరి.
"మీరు ఆస్ట్రేలియా పౌరుడు అయి ఉండాలి, కానీ మీరు ఇక్కడ లేకపోయినా లేదా మీ ఎన్¬రోల్¬మెంట్ నేటి వరకు సవరించి ఉందో లేదో మీకు తెలియకపోతే, మీరు aec.gov.au వద్ద మీ ఎన్¬రోల్¬మెంట్¬ను దృవీకరించుకోవచ్చు.
చర్చలో పాల్గొనడం మరియు ఓటు వేయడానికి ముందు వ్యక్తులు తమ పరిశోధన చేయడం చాలా ముఖ్యమని ఎకిన్-స్మిత్ అభిప్రాయపడుతున్నారు.
"ఈ విషయం గురించి ఆలోచించండి. మీరు ఎన్నుకోవాలనుకుంటున్న అభ్యర్థుల గురించి ఆలోచించడం లేదు, సమస్య గురించి ఆలోచిస్తున్నారు" అని ఆయన అన్నారు.
జాగ్రత్తగా మీ పరిశోధన చేయండి, మీరు 'అవును' లేదా 'కాదు' ఓటు వేయాలనుకుంటున్నారా అన్న దాని గురించి ఆలోచించండి. మీరు తప్పని సరిగా ఓటు వేయండి.Evan Ekin-Smyth
దీని ఫలితం బాధ్యతతో కూడి ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మిస్టర్ కాలనన్ చెప్పారు.
'మీరు ఏ విధంగా ఓటు వేసినా మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. AEC లో, ప్రజలు ఏ మార్గంలో ఓటు వేస్తారనే దాని గురించి మేము పట్టించుకోము, ప్రజలు ఓటు వేస్తారని మాత్రమే మేము అనుకుంటాము, మరియు దానిపై మీ అభిప్రాయాన్ని కలిగి ఉండటం నిజంగా ప్రత్యేకమైన విషయం. కాబట్టి, మీరు, దీనిని సీరియస్¬గా తీసుకోమని మేము ప్రజలను ప్రోత్సహిస్తున్నాము.
Stay informed on the 2023 Indigenous Voice to Parliament referendum from across the SBS Network, including First Nations perspectives through NITV. Visit the SBS Voice Referendum portal to access articles, videos and podcasts in over 60 languages, or stream the latest news and analysis, docos and entertainment for free, at the Voice Referendum hub on SBS On Demand.






