భానుమతి హాస్య రచన అత్తగారి కథలులో అత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును అందుకున్నారు.
"అనగనగా" శీర్షికగా మూడవ కధగా పుణ్య పాతూరి గారు వివరించారు. ఆమెకు కథలు చదవడం అన్నా , మనుషుల వ్యక్తిత్వాలను చదవడం అన్నా చాలా ఇష్టం. కధలు రాయలనే ఉత్సాహం కూడా ఉంది - రెక్కల గుర్రాలు , స్నేహం , చాయాదేవి అనే కధలు రాసాను. షడ్రుచుల్లో తీపి, నవరసాల్లో హస్యం అంటే ఇష్టం అంటున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.