తర తరాల తెలుగు… భావి తరాలకు వెలుగంటూ... తెలుగును ముందుకు తీసుకెళ్తున్న తెలుగు బడి కార్యక్రమాలు..

Canberra Telugu Badi is a non-profit organisation helping students learn the Telugu language within the community. This picture features Telugu Badi Principal Madhuri Kolanu, and volunteer teachers Smitha Dudaga and Anand Kumar.
కాన్బెర్రాలో పిల్లలకు తెలుగు నేర్పాలన్న తపనతో… తల్లితండ్రులే గురువులయ్యారు, పిల్లలే విద్యార్థులయ్యారు. ఈ చిన్న ప్రయత్నానికి మరికొందరు సహాయం అందించి , గత 13 ఏళ్లుగా కాన్బెర్రా తెలుగు బడిని అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్నారు.
తరతరాల తెలుగు భావితరాలకు వెలుగంటూ తెలుగును ముందుకు తీసుకువెళ్తున్న తెలుగుబడి కార్యక్రమాలు. ఏ దేశమేగినా, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, ఎవ్వరేమనినా, అనగనగా ఒక చిన్న ఊరు, క్యాన్బెర. ఆ ఊర్లో మొదట కొంతమంది తెలుగువారు ఉండేవారు. పిల్లలకు తెలుగు నేర్పాలని ఆ తల్లిదండ్రులే గురువులయ్యారు. పిల్లలే విద్యార్థులయ్యారు. దానికి మరికొంతమంది జత అయ్యి, తోడైయ్యి, గత పదమూడేళ్లుగా ఎంతో కృషిచేస్తూ తెలుగుబడిని చక్కగా నిర్వహిస్తున్నారు. పేపర్ మీద తెలుగు అక్షరాలను ప్రింట్ చేసి పిల్లల చేత రాయించిన రోజుల నుండి ఇప్పటికీ వారికి వారే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకునేంత అభివృద్ధి సాధించగలిగారని క్యాన్బెరా తెలుగుబడి ప్రిన్సిపాల్ మాధురి కొలను గారు చెబుతున్నారు. అలానే తెలుగుబడిలో స్వచ్ఛందంగా పనిచేస్తున్న అధ్యాపకులైన స్మిత, మరియు ఆనంద్ గారు కూడా ఇది అందరి టీచర్ల సమిష్టి కృషి అంటూ తమ ప్రయాణం గురించి ఈ శీర్షికలో వివరిస్తున్నారు. ఈ శీర్షికను మీకు అందిస్తున్నది సంధ్యా వెదురు. ఎస్బీఎస్ తెలుగు ద్వారా మన తెలుగువారి విషయాలను, విశేషాలను తెలుసుకోండి. దానికోసం ఎస్బీఎస్ తెలుగు ఇన్స్టా పేజీని కానీ, Facebook పేజీని కానీ ఫాలో చేయండి.
తెలుగు బడిలో 2014 నుంచి నేను తెలుగు బడిలో ఉన్నానండి. కానీ 2013లో తెలుగు బడి మొదలైంది. కొంతమంది పేరెంట్స్ అంతా ఒక చిన్న గ్రూప్ గా ఫామ్ అయ్యి మన పిల్లలకి తెలుగు నేర్పించాలి అని వాళ్ళ పిల్లలు, వాళ్ళే ఉపాధ్యాయులు, వాళ్ళ పిల్లలే విద్యార్థుల్లాగా మొదలు పెట్టాము. 2013లో తెలుగు బడి అలా ఒక పది మంది పిల్లలతో అప్పట్లో ఏం లేదు. ఆ ఆ ఈ లు, కొన్ని అక్షరాలు అలాంటివన్నీ చిన్న చిన్న పేపర్ల మీద ప్రింట్ చేసుకొచ్చి చెప్పేవాళ్ళు.
సో, మాధురి గారు చెప్పినట్టుగా స్కూలు తెలుగు బడి మొదలైనప్పుడు ఉన్న పేరెంట్స్ లో నేను పేరెంట్ ని అండ్ టీచర్ ని కూడా అండి. సో, మెయిన్ మాకేంటంటే అప్పుడు పుస్తకాలు అంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి అనేది కష్టంగా ఉండేది. ఎందుకంటే పిల్లలు స్టూడెంట్ క్లాస్ కి వచ్చేవాళ్ళు ఫస్ట్, ఓన్లీ ఒక క్లాస్ ఉండేదండి. అందులోనే అందరూ ఒక క్లాస్ లో ఉండేవాళ్ళు. సో, ఆరేళ్ళ నుంచి పధ్�మేము అనే ఫుల్ టైం టీచర్స్. అది కాక మొత్తం మాకు ఒక పాతిక మంది రిలీవింగ్ టీచర్స్ ఉంటారన్నమాట. ఈ వారం ఈ టీచర్ కి కుదరదు అంటే ఎవరో ఒకళ్ళు రిలీఫ్ టీచర్స్ వస్తారు. అందరూ వాలంటీర్స్ ఏ నండి. మాకెవ్వరికీ ఒక్క- మేమెవ్వరం జీతాలు తీసుకోము. అందరూ వాళ్ళ సొంత టైంలో వచ్చి చేస్తారు. ఆహ్ టీచర్లకు ఎప్పుడూ కొదవలేదండి. ఎందుకనలి అందరూ అంటే పేరెంట్సే కాకుండా నాన్ పేరెంట్స్ కూడా వచ్చి మాకు టీచ్ చేయడానికి, ఆహ్ కమిట్ అంటే ఏ టర్మ్ అయినా ఒక 10 క్లాసులకు కమిట్ అవ్వడం అనేది నాట్ ఈజీ ఆన్ ఏ వీకెండ్. ఎస్పెషల్లీ. సో అందరూ చేస్తున్నారు. పుస్తకాలు ఈజ్ ఏ ప్రాబ్లం. సో సిలబస్ అది మేమిప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. సో మేము మా పుస్తకాలు తీసుకొచ్చిన తర్వాత ఇక మాకు ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు.
మరొక ప్రశ్న మీకు కమ్యూనిటీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటే బావుండు. ఇంకా అంటే ఆల్రెడీ మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఉంటే బావుండు అని మీకనిపించిన సందర్భాలు?



