ఉత్తర రామాయణానికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఉత్తర రామయణం జరగలేదని, ఇది కల్పిత గాథ అన్నవారు లేకపోలేదు. వాల్మీకి ఉత్తర కాండను 120 సర్గాలలో మొత్తం 3432 శ్లోకాలలో విస్తృతంగా రచించాడు. కాకపోతే జానపదుల నోటిలో నాని మూలకథలో అనేక మార్పులు, చేర్పులు వచ్చాయి. ఇతర భాషల్లోకి రామాయణ అనువాదాలు జరిగినప్పుడు కూడా కొన్ని అవాల్మీకాలు చేరి ఉండవచ్చు. ఏదిఏమైనా, రామాయణ గాథలాగే, ఉత్తర రామాయణం కూడా బహుళ ప్రాచుర్యాన్ని పొందింది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.












